Telugu Poetry

In this category I will provide you with all Telugu poems that will teach you the meaning of life. Hope you like this Thank you

Introducing Verses - చమత్కార పద్యం

Introducing Verses – చమత్కార పద్యం

Introducing Verses – చమత్కార పద్యం  చమత్కార పద్యం రెంటాల సాంబశివరావు గారికి నమస్కృతులతో… యస్తే దదాతి రవ మస్య వరం దదాసి యో వా మదం వహతి తస్య దమం విధత్సే। ఇత్యక్షర ద్వయ విపర్యయ కేళి శీల! కిం నామ కుర్వతి నమో న మనః కరోషి।। ఈ శ్లోకం లో అక్షరద్వయం విపర్యం అవడం గమనించండి… యః-ఎవ్వడైతే, తే- నీకు, రవం-ధ్వనిని, దదాతి- ఇస్తాడో, తస్య-వానికి,(రావణునికి), వరం-వరాన్ని, దదాసి- ఇస్తావు. యః వా-ఎవ్వడైతే,…

Keep reading
Subhashitam - సుభాషితమ్ 

Subhashitam – సుభాషితమ్ 

Subhashitam – సుభాషితమ్  శ్లో𝕝𝕝 నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం దేవీం, నవదుర్గాముపాశ్రయే!! తా𝕝𝕝 నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. సుభాషితమ్ శ్లో𝕝𝕝 స్త్రియాం రోచమానాయాం సర్వం తద్రోచతే కులమ్। తస్యాం త్వరోచ్యమానాయాం సర్వమేవ న రోచతే॥ తా𝕝𝕝 స్త్రీ ప్రసన్నచిత్తముతో ఉన్నప్పుడే కుటుంబమైనా, వంశమైనా సంతోషముగా ఉంటుంది. ఆమె ప్రసన్నముగా లేనిచో కుటుంబముగానీ వంశముగానీ ఏదీ సంతోషముగా ఉండరు. అందువల్ల స్త్రీని…

Keep reading
Dasarathi sathakam-ధాశరథీ శతకం

Dhasharathi sathakam – ధాశరథీ శతకం

Dhasharathi sathakam – ధాశరథీ శతకం కర మనురక్తి మందరము గవ్వముగా, నహిరాజు ద్రాడుగా దొరకొని దేవదానవులు దుగ్థపయోధి మథించుచున్నచో ధరణి చలింప లోకములు తల్లడ మందఁగఁగూర్మమై ధరా ధరము ధరించి తీవెకద దాశరథీ కరుణాపయోనిధీ! తాత్పర్యం: రామా! దేవతలను,రాక్షసులను, వైరములతో కూడి మందర పర్వతమును కవ్వముగాను, సర్వరాజగు వాసుకిని కవ్వపు త్రాడుగాను చేసి పాల సముద్రమును చిలుకుచుండగా, అపుడా కొండ తటాలున మునుగుట చేత భూమి, లోకములు తల్లడిల్లటం చూచి కూర్మావతారం యెత్తి కొండను వీపుమీద దాల్చిన…

Keep reading
Sumati sathakam - సుమతీ శతకం

Sumati sathakam – సుమతీ శతకం

Sumati sathakam – సుమతీ శతకం ధనపతి సఖుఁడై యుండియు నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగవలసెన్ దనవారి కెంతకలిఁగిన దనభాగ్యమె తనఁకుగాగ తథ్యము సుమతీ! తాత్పర్యం: ఓ సుమతీ! ధనమునకు పతియగు కుబేరుడు తనకు స్నేహితుడైనప్పటికినీ, శివుడు భిక్షము ఎత్తవలసి వచ్చినది కదా! అలాగే తనకు సంబంధించిన వారికి ఎంత ధనమున్ననూ తనకు ఉపయోగపడదు. తన అదృష్టఫలమే తనకు లభించును. పరులకున్న ధనమెన్నటికినీ రాదనీ భావం. పెట్టిన దినములలోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్ బెట్టని దినములఁగనకఁపు గట్టెక్కిన నేమిలేదు…

Keep reading

Vemana sathakam-వేమన శతకం

Vemana sathakam-వేమన శతకం అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: సముద్రపు అలలందు బుడగ ఏ విధంగా పుట్టుచూ గిట్టుచూ ఉండునో, అలాగే ఎల్లప్పుడూ భోగభాగ్యములుండవు. ఒకదాని తర్వాత ఒకటి అనుభవించవలసివచ్చుచుండును అని అర్థం. కోతినొనరదెచ్చి కొత్తపట్టముగట్టి కొండముచ్చు లెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: జ్ఞానములేని వానిని తెచ్చి రాజుని చేసిన వాని వద్ద అటువంటివారే మనగలరు. ఎలాగనగా, కోతిని…

Keep reading
Bhaskara sathakam - భాస్కర శతకం

Bhaskara sathakam – భాస్కర శతకం

Bhaskara sathakam – భాస్కర శతకం అదను దలంచి కూర్చిప్రజ నాదర మొప్పవిభుండు కోరినన్ గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టితెండనన్ మొదటికి మోసమౌబొదుగు మూలము గోసిన బాలు గల్గునే పిదికినఁగాక భూమిఁబశు బృందము నెవ్వరికైన భాస్కరా! తాత్పర్యం: భాస్కరా! పాలకోరకు పశువుల పొదుగు మూలమున పిదికినచో పాలు లభించును. పొదుగును కోసినచో పశు ప్రాణమునకే ముప్పు వచ్చును. అట్లే రాజు అవసరార్థము కనిపెట్టి ప్రజలను ఆహ్వానించి వినయముతో ధనమడిగిన వెంటనే తెచ్చి నిత్తురు.…

Keep reading
Kumara Shatakam - కుమార శతకం

Kumara Shatakam – కుమార శతకం

Kumara Shatakam – కుమార శతకం చేయకుము కాని కార్యము; పాయకుము మఱిన్ శుభం; బవని భోజనమున్ జేయకుము రిపు గృహంబునఁ ; గూయకు మొరుమనసు నొచ్చుఁ గూఁత కుమారా! తాత్పర్యం: ఓ కుమారా! సాధ్యము కాని పనిని చేయుటకు ప్రయత్నించవద్దు, మంచిదానిని వదలవద్దు. పగవాని యింట భుజించవద్దు. ఇతరులకు నొప్పికలుగునట్లు మాట్లాడవద్దు. పిన్నల పెద్దలయెడఁ గడు మన్ననచే మెలఁగు సుజన మార్గంబులు నీ వెన్నుకొని తిరుగుచుండిన నన్నియెడల నెన్నఁబడుదువన్న కుమారా! తాత్పర్యం: ఓ కుమారా! నీవు…

Keep reading
Bhaskara sathakam - భాస్కర శతకం

Bhaskara sathakam – భాస్కర శతకం

Bhaskara sathakam – భాస్కర శతకం శ్రీగల భాగ్యశాలిఁగడుఁజేరఁగవత్తురు తారుదారె దూ రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వను ద్యోగముచేసి; రత్ననిలయుండని కాదె సమస్త వాహినుల్ సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా! తాత్పర్యం: మునులచే స్తుతింపబడిన సర్వజనులకు గురుమూర్తియగు ఓ భాస్కరా! జనులు భాగ్యవంతుల వద్దకు చాలా దూరము. శ్రమయని గుర్తించక ఓర్పుతో నివశించుటకు, తమంతట తామే, ప్రేమతో పయనమై వస్తారు. ఎట్లనగా రత్నములకు నిధియగు సముద్రుని వద్దకు సాగరములన్నియును ప్రకృతి సిద్ధముగాచేరును గదా!…

Keep reading
Kumara Shatakam - కుమార శతకం

Kumara Shatakam – కుమార శతకం

Kumara Shatakam – కుమార శతకం ధరణీనాయకు రాణియు గురురాణియు నన్నరాణి కులకాంతను గ న్నరమణి దను గన్నదియును ధర నేవురు తల్లులనుచుఁదలఁపుఁ కుమారా! తాత్పర్యం: ఓ కుమారా! రాజు భార్యయును, గురు భార్యయును, అన్న భార్యయును, అత్తయును, ఈ ఐదుగురు తల్లులని భావింపవలెను. పోషకుల మతముఁగనుఁగొని భూషింపక కాని ముదముఁ బొందరు మఱియున్, దోషముల నెంచుచుందురు, దోషివయిన మిగులఁగీడు దోఁచుఁ కుమారా! తాత్పర్యం: ఓ కుమారా! నిన్ను పోషించు వారి మనస్సును గుర్తెరిగి వారిని గొప్పచేయు…

Keep reading
Bhaskara sathakam - భాస్కర శతకం

Bhaskara sathakam – భాస్కర శతకం

Bhaskara sathakam – భాస్కర శతకం ఎడ్డెమనుష్యుఁడేమెఱుఁగు నెన్ని దినంబులు గూడియుండినన్ దొడ్డ గుణాడ్యునందుఁగల తోరపు వర్తనల్లఁబ్రజ్ఞ బే ర్పడ్డ వివేకి రీతి; రుచిపాకము నాలుక గాకెఱుంగనే? తెడ్డది కూరలోఁగలయ ద్రిమ్మరుచుండినైన భాస్కరా! తాత్పర్యం: భాస్కరా! మూఢాత్ముడు గుణవంతుని వెంట తిరుగుచున్ననూ అతని సద్గుణములతో కూడిన నడవడికలు గుర్తించలేడు, జ్ఞాని గుర్తించగలడు. ఎలాగనగా కూరలో తిరుగుచున్న తెడ్డు ఆ రుచిని గుర్తించలేదు. కూర యొక్క రుచి నాలుక గుర్తించును. ఘనుఁడొక వేళఁగీడ్పడిన గ్రమ్మఱ నాతని లేమి వాపఁగాఁ…

Keep reading

Loading…

Something went wrong. Please refresh the page and/or try again.