Home Bhakthi In Dussehra Navratri avatars of Amma offerings to be given to Amma shlokas….

In Dussehra Navratri avatars of Amma offerings to be given to Amma shlokas….

0
In Dussehra Navratri  avatars of Amma offerings to be given to Amma shlokas….
In Dussehra Navratri avatars of Amma offerings to be given to Amma shlokas….
In Dussehra Navratri, avatars of Amma, offerings to be given to Amma, shlokas…. –  దసరా నవరాత్రుల లో అమ్మవారి అవతారాలు, అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు, శ్లోకాలు….
ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించ వలెను.

నవదుర్గలు :

ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా||
నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.

 నవదుర్గా ధ్యాన శ్లోకములు 

 శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి)
నైవేద్యం : కట్టు పొంగలి
శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||
 బ్రహ్మ చారిణి ( గాయత్రి ):
నైవేద్యం : పులిహోర
శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
చంద్రఘంట ( అన్నపూర్ణ )
 నైవేద్యం : కొబ్బరి అన్నము
శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
 కూష్మాండ ( కామాక్షి )
నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు
శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||
స్కందమాత ( లలిత )
నైవేద్యం : పెరుగు అన్నం
శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||
కాత్యాయని(లక్ష్మి)
నైవేద్యం : రవ్వ కేసరి
శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||
కాళరాత్రి ( సరస్వతి )
నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నాన్ని
శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||
 మహాగౌరి( దుర్గ )
నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)
శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||
 సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )
నైవేద్యం : పాయసాన్నం
శ్లో|| సిద్ధ గంధర్వ యక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
 దుర్గా ధ్యాన శ్లోకము :
శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥
In Dussehra Navratri  avatars of Amma offerings to be given to Amma shlokas….
In Dussehra Navratri avatars of Amma offerings to be given to Amma shlokas….

నవదుర్గా అవతారాలు, నైవేద్యం, మంత్రం

శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరీ, సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రి-గాయత్రీదేవి, చంద్రఘంట-అన్నపూర్ణ,కూష్మాండ-మహాలక్ష్మి, స్కందమాతను లలితా త్రిపురసుందరి, కాత్యాయిని- సరస్వతీదేవి, కాలరాత్రిని దుర్గాదేవి, మహాగౌరి-మహిషాసురమర్దని, సిద్ధి ధాత్ని-రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి పూజిస్తారు.
తిథులలో అమ్మవారి అవతార విశేషం, ఆ రోజున సమర్పించాల్సిన నైవేద్యం, జపించాల్సిన మంత్రం, గాయత్రి మంత్రం.
పాడ్యమి – బాలా త్రిపురసుందరి – పాల పాయసం
“దినకర కిరణైః జ్యోతి రూపే శివాఖ్యే – హేమ వర్ణే హిమ కర కిరణా భాసమా నేన్దుచూడే
సకల జయకరీ, శక్తి బాలే నమస్తే|| ” అని మొదటి రోజున బాల స్వరూపంగా పూజించాలి
బాల గాయత్రి :
” ఓం త్రిపురేశ్యచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి – తన్నో బాలా ప్రచోదయాత్‌||”
అనే బాల గాయత్రి సహస్ర గాయత్రి జపించిన మంచి ఫలితం లభిస్తుంది.
విదియ – అన్నపూర్ణేశ్వరి – పాయసన్నం
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి||
మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః
అన్నపూర్ణ గాయత్రి :
అన్నపూర్ణాయై విద్మహే జగన్మాత్రేచ థీమహి – తన్నో దేవి ప్రచోదయాత్‌||
తదియ – శ్రీమహలక్ష్మి – గుఢాన్నం
మాతర్నమామి కమలే కమలాయతాక్షి – శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః
క్షీరదజే కమల కోమల గర్భగౌరి – లక్ష్మీప్రసీద సతతం సమతాం శరణ్యే||
లక్ష్మీ గాయత్రి :
ఓం మహాలక్ష్యైచ విద్మహే సర్వసిద్ధ్యైచ ధీమహి – తన్నో దేవి ప్రచోదయాత్‌||
“ఓం అమృతవాసిన్యైచ విద్మహే పద్మలోచన్యైచ ధీమహి – తన్నో లక్ష్మిః ప్రచోదయాత్‌||” అని పఠించినా మంచిది.
చవితి – గాయత్రి దేవి – కట్టు పొంగలి అన్నం
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య థీమహి ధియో యోనః ప్రచోదయాత్‌||
అని పఠించినట్టయితే తల్లి కరుణిస్తుంది.
పంచమి – శ్రీ లలితా దేవి – పులిహోరాన్నం
అనఘాద్భుత చరిత్రా వాంచితార్థ ప్రదాయినీ – ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసనా||
శ్రీలలితా గాయత్రి : లలితాయై చ విద్మహే కామేశ్వర్యైచ థీమహి ఔతన్నో దేవి ప్రచోదయాత్‌||
షష్టి – శ్రీ దుర్గాదేవి – చిల్లు లేకుండా అల్లపు గారెలు
ప్రథమా శైల పుత్రీచ ద్వితీయ బ్రహ్మచారిణే – తృతీయా చంద్రఘాటేతి కుష్మాండతేతి చతుర్థికీ
పంచమాస్కంద మాతేతి షష్టా కాత్యేయనేతిచ – సప్తమ కాల రాత్రిచ అష్టమా చేతి భైరవీ
నవమా సర్వస్థిశ్చేత్‌ నవదుర్గా ప్రకీర్తితా||
దుర్గా గాయత్రి : ఓం మహా దుర్గాయై విద్మహే సర్వ శక్తయైచ థీమహి – తన్నో దుర్గా ప్రచోదయాత్‌
సప్తమి – మూల నక్షత్రం – సరస్వతి దేవి – కొబ్బరి అన్నం
సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తక ధారిణీ – హంస వాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ||
సరస్వతీ గాయత్రి : సరస్వత్యైచ విద్మహే బ్రహ్మసతియైచ ధీమహి – తన్నో వాణీ ప్రచోదయాత్‌||
అష్టమి – మహిషాసురమర్ధని – శాకాన్నం, కేసరిబాత్‌
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే
మహిషాసుర మర్ధిని గాయత్రి : మహిషష్యైచ విద్మహే జగన్మాత్రేచ ధీమహి – తన్నో మాతా ప్రచోదయాత్‌||
నవమి – శ్రీరాజరాజేశ్వరి – చిత్రాన్నం, లడ్డూలు
అంబా పాలిత భక్తరాజరనిశం అంబాష్టకం యః పఠేత్‌
దంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబాపావన మంత్ రాజ పఠనాద్ధంతీశ మోక్ష ప్రదా
చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ||
రాజరాజేశ్వరి గాయత్రి : రాజేశ్వర్యైచ విద్మహే శ్రీభవానీయైచ ధీమహి – తన్నో దేవి ప్రచోదయాత్‌||

Leave a Reply

%d bloggers like this: