Daily Horoscope 23/09/2022 

0
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 23/09/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
23, సెప్టెంబర్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
భాద్రపద మాసము
కృష్ణ త్రయోదశి
భృగు వాసరే (శుక్ర వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 23/09/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
మిశ్రమ కాలం నడుస్తోంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడకపోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి

 వృషభం

ఈరోజు
ప్రారంభించిన పనుల్లో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బుద్ధిబలంతో అందర్నీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
ఇష్టదైవారాధన శ్రేయస్కరం

 మిధునం

ఈరోజు
సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
లక్ష్మీ సందర్శనం ఉత్తమం

కర్కాటకం 

ఈరోజు
శుభసమయం. మీమీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు

 సింహం

ఈరోజు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.
ఇష్టదైవ సందర్శనం ఉత్తమం

కన్య

ఈరోజు
ముఖ్య విషయాల్లో  జాగ్రత్తగా వ్యవహరించాలి.  కొన్ని వ్యవహారాల్లో ధైర్యం ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంటారు.
శివారాధన మంచిది

 తుల

ఈరోజు
మిశ్రమ కాలం. మీమీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టని వారితో మిత భాషణం ఉత్తమం. స్థానచలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి.
ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం

 వృశ్చికం

ఈరోజు
శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.  కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. అధికారుల కోపానికి గురికాకుండా, ఓర్పుగా వ్యవహరించండి.
శివారాధన వల్ల మంచి జరుగుతుంది

ధనుస్సు

ఈరోజు
ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు.  బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీ దేవి సందర్శనం ఉత్తమం

 మకరం

ఈరోజు
పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి.  పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వర ఆరాధన శుభప్రదం

కుంభం

ఈరోజు
అనుకున్నది సాధిస్తారు. మీమీ రంగాల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. కలహాలకు దూరంగా ఉండాలి.  ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.
ఆదిత్య హృదయ పారాయణ చేస్తే బాగుంటుంది

మీనం

ఈరోజు
శ్రమ ఫలిస్తుంది. మొదలుపెట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసమును పెంచుతుంది. అనవసర ధనవ్యయం.
ఇష్టదైవారాధన మంచిది

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
సెప్టెంబరు 23, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
కృష్ణ పక్షం
తిథి: త్రయోదశి రా1.36
వారం: భృగువాసరే
(శుక్రవారం)
నక్షత్రం: మఖ తె4.12
యోగం: సిద్ధం ఉ11.14
కరణం: గరజి మ12.52
&
వణిజ రా1.36
వర్జ్యం: మ3.12-4.56
దుర్ముహూర్తం: ఉ8.16-9.04
&
మ12.17-1.05
అమృతకాలం: రా1.36-3.20
రాహుకాలం: ఉ10.30-12.00
యమగండం: మ3.00-4.30
సూర్యరాశి: కన్య
చంద్రరాశి: సింహం
సూర్యోదయం: 5.52
సూర్యాస్తమయం: 5.57

Leave a Reply

%d bloggers like this: