Daily Horoscope 21/09/2022 

0
Daily Horoscope 21/09/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 21/09/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
21, సెప్టెంబర్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
భాద్రపద మాసము
కృష్ణ ఏకాదశి
సౌమ్య వాసరే (బుధ వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 21/09/2022 
Daily Horoscope 21/09/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
మధ్యమ ఫలితాలున్నాయి. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బందిపెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.
గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు

 వృషభం 

ఈరోజు
ధనాగమనసిద్ధి ఉంది. సొంతింటి వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది.
సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది

 మిధునం

ఈరోజు
అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి.
ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం

 కర్కాటకం 

ఈరోజు
సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం

సింహం

ఈరోజు
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్యక్రమాలల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి.
ఈశ్వరదర్శనం చేయడం మంచిది

 కన్య

ఈరోజు
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిరనిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి.
దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది

 తుల

ఈరోజు
మీ మీ రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఏర్పడతాయి. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తిచేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబసభ్యులకు మేలైన కాలం. దైవారాధన మానవద్దు

 వృశ్చికం

ఈరోజు
ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది.
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది

ధనుస్సు

ఈరోజు
కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి.
సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది

 మకరం

ఈరోజు
చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు.
విష్ణు నామస్మరణ ఉత్తమం

కుంభం

ఈరోజు
మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలుంటాయి. మనః స్సౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది

 మీనం

ఈరోజు
స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. సకాలంలో ఆదుకునేవారున్నారు.
శివారాధన చేయడం మంచిది.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
సెప్టెంబరు 21, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
కృష్ణ పక్షం
తిథి: ఏకాదశి రా10.22
వారం: సౌమ్యవాసరే
(బుధవారం)
నక్షత్రం: పుష్యమి రా11.52
యోగం: పరిఘము ఉ10.28
కరణం: బవ ఉ9.21
&
బాలువ రా10.22
వర్జ్యం: ఉ6.10 – 7.56
దుర్ముహూర్తం: ఉ11.30 – 12.18
అమృతకాలం: సా4.47 – 6.34
రాహుకాలం: మ12.00 – 1.30
యమగండం: ఉ7.30 – 9.00
సూర్యరాశి: కన్య
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం: 5.52
సూర్యాస్తమయం: 5.57

Leave a Reply

%d bloggers like this: