Daily Horoscope 20/09/2022 

0
Daily Horoscope 20/09/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 20/09/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
20, సెప్టెంబర్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
భాద్రపద మాసము
తిథి: దశమి రా8.21
వారం: భౌమ్యవాసరే
(మంగళవారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 20/09/2022 
Daily Horoscope 20/09/2022

రాశి ఫలాలు 

మేష రాశి 

దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారులకు చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృషభ రాశి 

వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు  ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది.

మిధున రాశి 

ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కర్కాటక రాశి 

ఉద్యోగులకు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది.

సింహ రాశి 

ఆరోగ్య పరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

కన్య రాశి 

ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. దైవచింతన పెరుగుతుంది. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకున్నది సాధిస్తారు.

తుల రాశి 

వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు ఉద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశములు లభిస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆలయ దర్శనం చేసుకుంటారు. స్థిరస్తి కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి 

ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు మిత్రులతో మీ మాటతో విబేదిస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి.

ధనస్సు రాశి 

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. అవరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మకరం రాశి 

చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది వ్యాపారలకు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.

కుంభ రాశి 

వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ వివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగులకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి.

మీన రాశి 

బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మారులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున పరిస్థితులు అంతగా అనుకుంలించవు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
సెప్టెంబరు 20, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
కృష్ణ పక్షం
తిథి: దశమి రా8.21
వారం: భౌమ్యవాసరే
(మంగళవారం)
నక్షత్రం: పునర్వసు రా9.19
యోగం: వరీయాన్ ఉ9.51
కరణం: వణిజ ఉ7.20
&
భద్ర రా8.21
వర్జ్యం: ఉ8.01-9.48
దుర్ముహూర్తం: ఉ8.16-9.05
&
రా10.43-11.30
అమృతకాలం: సా6.40-8.26
రాహుకాలం: మ3.00-4.30
యమగండం: ఉ9.00-10.30
సూర్యరాశి: కన్య
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం: 5.52
సూర్యాస్తమయం: 5.57

Leave a Reply

%d bloggers like this: