Daily Horoscope 13/09/2022 

0
Daily Horoscope 13/09/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 13/09/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
13, సెప్టెంబర్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
భాద్రపద మాసము
తిథి: తదియ మ12.32
వారం: భౌమ్య వాసరే
(మంగళవారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 13/09/2022 
Daily Horoscope 13/09/2022

రాశి ఫలాలు 

మేషం

ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

వృషభం

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. సమాజంలో   ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది ఇంటాబయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

మిధునం

పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి ఉన్నది. సోదరులతో  ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కర్కాటకం

ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం

ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం ఉండదు.

కన్య

మిత్రుల నుంచి అవసరానికి ధనసహాయం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి.  విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

తుల

కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి  కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.

వృశ్చికం

వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు బంధు, మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి.

ధనస్సు

సంతాన ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ధన పరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు మరింత మందగిస్తాయి. అనుకున్న వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.

మకరం

ఇంటాబయట  పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి.

కుంభం

 వృత్తి ఉద్యోగముల అదనపు పని భారం వలన ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన  వ్యవహారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులలో శ్రమాధిక్యత అధికమవుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.

మీనం

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి  గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః

సెప్టెంబరు 13, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
కృష్ణ పక్షం
తిథి: తదియ మ12.32
వారం: భౌమ్య వాసరే
(మంగళవారం)
నక్షత్రం: రేవతి ఉ9.25
యోగం: వృద్ధి ఉ11.18
కరణం: విష్ఠి మ12.32
&
బవ రా12.24
వర్జ్యం: తె5.45నుండి
దుర్ముహూర్తం: ఉ8.16-9.05
రా10.45-11.32
అమృతకాలం: ఉ7.01-8.37
&
రా2.29-4.07
రాహుకాలం: మ3.00-4.30
యమగండం: ఉ9.00-10.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 5.50
సూర్యాస్తమయం: 6.04

Leave a Reply

%d bloggers like this: