Daily Horoscope 06/09/2022

0
Daily Horoscope 06/09/2022
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 06/09/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
06, సెప్టెంబర్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
భాద్రపద మాసము
తిథి: ఏకాదశి రా12.39
వారం: భౌమ్యవాసరే
(మంగళవారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 06/09/2022 
Daily Horoscope 06/09/2022

రాశి ఫలాలు 

మేషం

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. నూతన రుణయత్నాలు చేస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.దూర  ప్రయాణ సూచనలు ఉన్నవి.

వృషభం

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ముందుకు సాగవు. ప్రయాణాలు జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.

మిధునం

ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట అందర్నీ మంచి మాట తీరుతో ఆకట్టుకుంటుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.

కర్కాటకం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.  ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. నూతన వాహన సౌఖ్యం ఉన్నది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది.

కన్య

వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు. గృహమున కొందరు ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి, బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో ఇబ్బంందికర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా గందరగోళంగా ఉంటుంది.

తుల

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది ఒక వ్యవహారంలో అందరిని ఒక మాట మీదకు తీసుకువస్తారు. వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి.

వృశ్చికం

తన పరంగా ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది.

ధనస్సు

 సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. నూతన మిత్రులు పరిచయాలు పెరుగుతాయి  స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

మకరం

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

కుంభం

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

మీనం

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఉద్యోగాలు గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
సెప్టెంబరు 6, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
శుక్ల పక్షం
తిథి: ఏకాదశి రా12.39
వారం: భౌమ్యవాసరే
(మంగళవారం)
నక్షత్రం: పూర్వాషాఢ సా4.47
యోగం: ఆయుష్మాన్ ఉ7.49
&
సౌభాగ్యం తె4.40
కరణం: వణిజ మ1.53
&
భద్ర రా12.39
వర్జ్యం: రా12.11-1.40
దుర్ముహూర్తం: ఉ8.16-9.06
&
రా10.48-11.35
అమృతకాలం : మ12.18-1.47
రాహుకాలం: మ3.00-4.30
యమగండం: ఉ9.00-10.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.49
సూర్యాస్తమయం: 6.09

Leave a Reply

%d bloggers like this: