Daily Horoscope 04/09/2022 

0
Daily Horoscope 04/09/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 04/09/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
04, సెప్టెంబర్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
భాద్రపద మాసము
శుక్ల అష్టమి
భాను వాసరే (ఆది వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 04/09/2022 
Daily Horoscope 04/09/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి

 వృషభం 

ఈరోజు సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. రామనామ జపం శ్రేయోదాయకం

 మిధునం

ఈరోజు బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పారాయణం చేయడం మంచిది

కర్కాటకం 

ఈరోజు చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా కానీయకండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది

 సింహం

ఈరోజు మీలోని శ్రద్ధాసక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవ్వరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం

 కన్య

ఈరోజు మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది

తుల

ఈరోజు మీ రంగాల్లో బాగా శ్రద్ధగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు

 వృశ్చికం

ఈరోజు ధర్మ సిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలను ఇతరులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు.     కొన్ని చర్చలు మీకులాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి

ధనుస్సు

ఈరోజు తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులతో అణిగిమణిగి ప్రవర్తించవలసి ఉంటుంది. శివ స్తోత్రం పఠించడం మంచిది

 మకరం

ఈరోజు సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది

కుంభం

ఈరోజు ముఖ్య వ్యవహారాల్లో అనుకున్నది దక్కుతుంది. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి సహాయసహకారాలు అందుతాయి.  ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గా స్తోత్రం పఠిస్తే మంచిది

 మీనం

ఈరోజు శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం మంచిది

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
సెప్టెంబరు 4, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
శుక్ల పక్షం
తిథి: అష్టమి ఉ7.49
&
నవమి తె5.30
వారం: భానువాసరే
(ఆదివారం)
నక్షత్రం: జ్యేష్ఠ రా8.00
యోగం: విష్కంభం మ1.49
కరణం: బవ ఉ7.49
బాలువ మ12.51
కౌలువ తె5.30
వర్జ్యం: తె.3.28-4.58
దుర్ముహూర్తం: సా4.31-5.20
అమృతకాలం: ఉ11.42-1.12
రాహుకాలం: సా4.30-6.00
యమగండం: మ12.00-1.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 5.49
సూర్యాస్తమయం: 6.10

Leave a Reply

%d bloggers like this: