Daily Horoscope 02/09/2022 

0
Daily Horoscope 02/09/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 02/09/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
02, సెప్టెంబర్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
భాద్రపద మాసము
శుక్ల షష్ఠి
భృగు వాసరే (శుక్ర వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 02/09/2022 
Daily Horoscope 02/09/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.
శివ నామస్మరణ ఉత్తమం

వృషభం 

ఈరోజు
మంచి  పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది.  ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం

మిధునం

ఈరోజు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. తోటివారిని కలుపుకుపోవడం ద్వారా ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.
చంద్ర ధ్యాన శ్లోకం చదివితే శుభం జరుగుతుంది

కర్కాటకం 

ఈరోజు
కృషికి తగిన ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు.
ఈశ్వర సందర్శనం శుభదాయకం

సింహం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.
కనకధారాస్తవము పఠించాలి

కన్య

ఈరోజు
అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి.
దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది

తుల

ఈరోజు
లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి.  కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. సొంత నిర్ణయాలు పని చేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతులను  చేస్తుంది.
దుర్గా ధ్యానం ఉత్తమం

వృశ్చికం

ఈరోజు
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ప్రశాంత చిత్తంతో ముందుకుసాగితే అన్ని సర్దుకుంటాయి. సూర్యారాధన శుభదాయకం

ధనుస్సు

ఈరోజు
మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు.
చంద్రశేఖరాష్టకం చదివితే మంచిది

మకరం

ఈరోజు
అనుకున్నది సాధించే దిశగా పయనిస్తారు. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు  తప్పనిసరి.  ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం

కుంభం

ఈరోజు
ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. గిట్టని వారి జోలికి పోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం

 మీనం

ఈరోజు
శ్రద్ధతో పనిచేయాలి. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. బంధువులతో మాటపట్టింపులకు పోరాదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి.
సూర్య స్తుతి శక్తినిస్తుంది.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
సెప్టెంబరు 2, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
శుక్ల పక్షం
తిథి: షష్ఠి ఉ11.35
వారం: భ్రుగువాసరే
(శుక్రవారం)
నక్షత్రం: విశాఖ రా10.32
యోగం: ఐంద్రం రా7.10
కరణం: తైతుల మ11.35
&
గరజి రా10.42
వర్జ్యం: ఉ శే.వ6.18వరకు
&
రా2.20-3.52
దుర్ముహూర్తం: ఉ8.17-9.07
&
మ12.25-1.14
అమృతకాలం: మ2.02-3.34
రాహుకాలం: ఉ10.30-12.00
యమగండం: మ3.00-4.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: తుల
సూర్యోదయం: 5.49
సూర్యాస్తమయం: 6.13

Leave a Reply

%d bloggers like this: