Daily Horoscope 29/08/2022 

0
Daily Horoscope 29/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 29/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
29, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
భాద్రపద మాసము
శుక్ల విదియ
ఇందు వాసరే (సోమ వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 29/08/2022 
Daily Horoscope 29/08/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
చేపట్టే పనిలో శారీరక శ్రమ పెరుగుతుంది.  కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు సాధిస్తారు.  బంధువులతో బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి.  ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం

వృషభం 

ఈరోజు
అనుకున్నది సాధించే వరకు పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాత  పనులను ప్రారంభిస్తే మంచిది.
ఇష్టదైవారాధన శుభదాయకం

మిధునం

ఈరోజు
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది.  అవసరానికి తగట్టుగా ముందుకు సాగడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివారాధన శుభాన్నిస్తుంది

 కర్కాటకం 

ఈరోజు
మీ మీ రంగాల్లో  సత్ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.  పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం

సింహం

ఈరోజు
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. పనులు వాయిదా వేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబసభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి

కన్య

ఈరోజు
మిశ్రమ వాతారణం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.  ఒక కీలక వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది.
లక్ష్మీదేవి సందర్శనం శుభాన్నిస్తుంది

తుల

ఈరోజు
చేపట్టే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేసి తోటి వారి ప్రశంసలు పొందుతారు.
గణపతి మంత్రాన్ని చదివితే మంచిది

వృశ్చికం

ఈరోజు
శుభ సమయం. గొప్ప భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం

 ధనుస్సు

ఈరోజు
ఆశించిన ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. సమయ పాలన పాటించండి. బలమైన ఆహారం, విశ్రాంతి అవసరం. ప్రయాణాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి.
శ్రీరామ నామాన్ని జపించండి

మకరం

ఈరోజు
స్థిరమైన ఫలితాలను అందుకుంటారు.  కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. మనస్సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభకాలం.
గాయత్రీ మంత్రాన్ని జపించాలి

కుంభం

ఈరోజు
తోటివారి సహాయ సహకారాలున్నాయి. ధనలాభం కలదు. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిర చిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది.
కుల దైవారాధన శుభప్రదం

మీనం

ఈరోజు
అనుకూల సమయం. మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.
విష్ణుసహస్రనామ పారాయణ శుభ ఫలితాలనిస్తుంది

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 29, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
శుక్ల పక్షం
తిథి: విదియ మ2.30
వారం: ఇందువాసరే
(సోమవారం)
నక్షత్రం: ఉత్తర రా11.20
యోగం: సాధ్యం రా2.20
కరణం: కౌలువ మ2.30
&
తైతుల రా2.28
వర్జ్యం: ఉ5.51-7.31
దుర్ముహూర్తం: మ12.26-1.16
&
మ2.55-3.45
అమృతకాలం : మ3.49-5.29
రాహుకాలం: ఉ7.30-9.00
యమగండం: ఉ10.30-12.00
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: కన్య
సూర్యోదయం: 5.48
సూర్యాస్తమయం: 6.16

Leave a Reply

%d bloggers like this: