Daily Horoscope 25/08/2022 

0
Daily Horoscope 25/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 25/08/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
25, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
కృష్ణ‌ త్రయోదశి
బృహస్పతి వాసరే (గురు వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 25/08/2022 
Daily Horoscope 25/08/2022      

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.
ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం

వృషభం 

ఈరోజు
చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు,వినోదాలతో కాలం గడుస్తుంది.
లక్ష్మీదేవి దర్శనం శుభాన్ని చేకూరుస్తుంది

మిధునం

ఈరోజు
చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి.
శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది

 కర్కాటకం 

ఈరోజు
శుభకాలం. మొదలుపెట్టిన పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు,మిత్రులతో అతి చనువు వద్దు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.
శివ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది

 సింహం

ఈరోజు
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు.
నారాయణ మంత్రాన్ని జపించాలి

కన్య

ఈరోజు
సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో తగుజాగ్రత్తలు అవసరం.
ఇష్టదైవ ఆరాధన శుభప్రదం

 తుల

ఈరోజు
ప్రయత్నకార్య సిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు,వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు.
ఇష్టదైవ నామస్మరణ శుభాన్ని ఇస్తుంది

 వృశ్చికం

ఈరోజు
కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది.
లక్ష్మీ అష్టకాన్ని చదివితే బాగుంటుంది

 ధనుస్సు

ఈరోజు
శ్రమతోకూడిన ఫలితాలు ఉన్నాయి. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.
నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది

 మకరం

ఈరోజు
మీ మీ రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం

కుంభం

ఈరోజు
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు.
నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది

 మీనం

ఈరోజు
ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థికాభివృద్ధి కలదు. తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి.
ఇష్టదైవారాధన శుభప్రదం.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 25, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
బహుళ పక్షం
తిథి: త్రయోదశి ఉ9.54
వారం: బృహస్పతివాసరే
(గురువారం)
నక్షత్రం: పుష్యమి సా4.46
యోగం: వరీయాన్ తె3.30
కరణం: వణిజ ఉ9.54
&
భద్ర రా10.46
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ9.57-10.47
&
మ2.57-3.47
అమృతకాలం: ఉ9.41-11.26
రాహుకాలం: మ1.30-3.00
యమగండం: ఉ6.00-7.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం: 5.47
సూర్యాస్తమయం: 6.18

Leave a Reply

%d bloggers like this: