Daily Horoscope 19/08/2022 

0
Daily Horoscope 19/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
19, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
కృష్ణ అష్టమి
భృగు వాసరే (శుక్ర వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 19/08/2022 
Daily Horoscope 19/08/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
నవగ్రహ ఆరాధన శుభప్రదం

వృషభం

ఈరోజు
ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచిఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబసభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి.
గణపతి ఆరాధన శ్రేయోదాయకం

 మిధునం

ఈరోజు
మిశ్రమ కాలం. కష్టాన్నినమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త.
చంద్ర ధ్యానం శుభప్రదం

 కర్కాటకం 

ఈరోజు
తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
ఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది

 సింహం

ఈరోజు
మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు

కన్య

ఈరోజు
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక సంబంధ విషయాలలో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు తొలగడానికి రామరక్షాస్తోత్రం చదివితే మంచిది

 తుల

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు

 వృశ్చికం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి

 ధనుస్సు

ఈరోజు
భవిష్యత్తు ప్రణాళికలను అమలుచేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
శ్రీఆంజనేయ స్వామి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది

 మకరం

ఈరోజు
పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికం అవుతాయి, ఒక పరీక్షలా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త పనికి రాదు.
ఆదిత్య హృదయం చదవడం శుభకరం

 కుంభం

ఈరోజు
చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి.
శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది

 మీనం

ఈరోజు
అనుకున్న పనులు నెరవేరుతాయి. మనఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. అర్థలాభం ఉంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు.
ఇష్టదైవారాధన శుభప్రదం

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 19, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
కృష్ణ పక్షం
తిథి: అష్టమి రా1.06
వారం: భృగువాసరే
(శుక్రవారం)
నక్షత్రం: కృత్తిక తె4.53
యోగం: ధృవం రా12.59
కరణం: బాలువ మ12.43
&
కౌలువ రా1.06
వర్జ్యం: సా4.08-5.50
దుర్ముహూర్తం: ఉ8.16-9.07
&
మ12.28-1.18
అమృతకాలం: రా2.20-4.02
రాహుకాలం: ఉ10.30-12.00
యమగండం: మ3.00-4.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం: 5.46
సూర్యాస్తమయం: 6.23

Leave a Reply

%d bloggers like this: