Daily Horoscope 16/08/2022

0
Daily Horoscope 16/08/2022
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 16/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
16, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
కృష్ణ పంచమి
భౌమ్య వాసరే (మంగళ వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 16/08/2022 
Daily Horoscope 16/08/2022

రాశి ఫలాలు 

 మేషం

ఈరోజు
మిశ్రమకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో  శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు పెరుగుతాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కనకధారాస్తవం చదవాలి

 వృషభం

ఈరోజు
మీ శ్రమ ఫలిస్తుంది. బంధువుల సహకారం ఉంటుంది. లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి.
శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం

 మిధునం

ఈరోజు
శుభయోగాలు ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఒక వార్త  మానసిక  శక్తిని ఇస్తుంది.
ఆదిత్య హృదయం చదవటం శుభప్రదం

కర్కాటకం 

ఈరోజు
ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అవసరానికి మించి ఖర్చు చేస్తారు. శత్రువులతో జాగ్రత్త గా వ్యవహరించాలి.
హనుమత్ ఆరాధన శుభకరం

 సింహం

ఈరోజు
శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలక వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.  శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది

 కన్య

ఈరోజు
ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి,ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా  చదవాలి

 తుల

ఈరోజు
ముఖ్య వ్యవహారాలను కుటుంబ సభ్యులతో  చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి.
ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి

వృశ్చికం

ఈరోజు
మీ నిబద్ధతే  మీ విజయానికి మూలం. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే అంతా మేలు జరుగుతుంది.
విష్ణు నామస్మరణతో మంచి జరుగుతుంది

 ధనుస్సు

ఈరోజు
చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ బుద్ధిబలంతో పనులను పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మంచిపేరు సిద్ధిస్తుంది.
కులదైవ సందర్శనం శుభాన్ని చేకూరుస్తుంది

 మకరం

ఈరోజు
ఇష్టసిద్ధి ఉంది. ముఖ్య వ్యవహారాలలోను విషయంలోను కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త.
దుర్గాస్తోత్రం చదవాలి

 కుంభం

ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. నూతన  పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది.
దైవారాధన మానవద్దు

 మీనం

ఈరోజు
చేపట్టిన పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.
శివస్తోత్రం చదవడం మంచిది

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 16, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
కృష్ణ పక్షం
తిథి: పంచమి రా12.16
వారం: భౌమ్యవాసరే
(మంగళవారం)
నక్షత్రం: రేవతి రా1.52
యోగం: శూలం తె3.15
కరణం: కౌలువ మ12.38
&
తైతుల రా12.16
వర్జ్యం: మ1.51-3.27
దుర్ముహూర్తం: ఉ8.17-9.07
&
రా10.56-11.41
అమృతకాలం: రా11.28-1.04
రాహుకాలం: మ3.00-4.30
యమగండం: ఉ9.00-10.30
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 5.46
సూర్యాస్తమయం: 6.23

Leave a Reply

%d bloggers like this: