Daily Horoscope 13/08/2022 

0
Daily Horoscope 13/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 13/08/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
13, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
కృష్ణ విదియ
స్థిర వాసరే (శని వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 13/08/2022 
Daily Horoscope 13/08/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు.
శివనామాన్ని జపం చేయండి

 వృషభం 

ఈరోజు
మీ మీ రంగంలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ బంధువుల ప్రవర్తన వల్ల మీకు కాస్త మనస్తాపం కలుగుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
శ్రీహరిని ఆరాధిస్తే మంచిది

మిధునం

ఈరోజు
విఘ్నాలను తెలివిగా పరిష్కరిస్తారు. చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన  సమయం. దుష్టులను దరిచేరనీయకండి.
ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది

 కర్కాటకం 

ఈరోజు
మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసమై దుర్గాదేవి ఆరాధన శుభప్రదం

సింహం

ఈరోజు
లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు.
శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం

 కన్య

ఈరోజు
చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి.
శివారాధన శుభప్రదం

 తుల

ఈరోజు
పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. ఆదాయానికి  మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి.
హనుమత్ ఆరాధన శుభప్రదం

 వృశ్చికం

ఈరోజు
మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అందరినీ కలుపుకొనిపోవడం ఉత్తమం.
శ్రీసూక్తం విన్నా, చదివినా మంచి ఫలితాలు సాధిస్తారు

ధనుస్సు

ఈరోజు
మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చరాదు.
నరసింహస్వామి ఆరాధన శుభప్రదం

 మకరం

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది.సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది

 కుంభం

ఈరోజు
గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త  మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు పొందుతారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి

 మీనం

ఈరోజు
మిశ్రమ కాలం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఆర్థిక అంశాలలో ఆచితూచి ముందుకు సాగాలి. శివనామస్మరణ మంచిది.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 13, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
కృష్ణ పక్షం
తిథి: విదియ ఉ3.29
వారం: స్థిరవాసరే
(శనివారం)
నక్షత్రం: శతభిషం తె3.00
యోగం: శోభనం ఉ11.23
కరణం: తైతుల మ3.13
&
గరజి తె3.29
వర్జ్యం: ఉ10.59-12.31
దుర్ముహూర్తం: ఉ5.45-7.26
అమృతకాలం: రా8.08-9.40
రాహుకాలం: ఉ9.00-10.30
యమగండం: మ1.30-3.00
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం: 5.45
సూర్యాస్తమయం: 6.25

 

Leave a Reply

%d bloggers like this: