Daily Horoscope 11/08/2022 

0
Daily Horoscope 11/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 11/08/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
11, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
శుక్ల చతుర్దశి
బృహస్పతి వాసరే (గురు వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 11/08/2022 
Daily Horoscope 11/08/2022

 రాశి ఫలాలు 

 మేషం

ఈరోజు
మంచి  పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం

 వృషభం 

ఈరోజు
భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.
శివ నామస్మరణ ఉత్తమం

మిధునం

ఈరోజు
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.
చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది

కర్కాటకం 

ఈరోజు
శుభకాలం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు.  కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.
కనకధారాస్తవం చదవాలి

 సింహం

ఈరోజు
మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు.
చంద్రశేఖరాష్టకం శుభప్రదం

కన్య

ఈరోజు
కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు.
ఈశ్వర సందర్శనం శుభప్రదం

 తుల

ఈరోజు
లక్ష్యంపై  ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి.  కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. ఉద్యోగంలో  మీ పై  అధికారుల సహకారం ఉంటుంది. సొంతనిర్ణయాలు పనిచేస్తాయి. మీ నిబద్ధతే  మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది.
దుర్గాధ్యానం శుభప్రదం

 వృశ్చికం

ఈరోజు
ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగ,వ్యాపారాల్లో మిశ్రమ ఫలాలు ఉన్నాయి.  కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి.  ప్రశాంత చిత్తంతో ముందుకుసాగితే అన్నీ సర్దుకుంటాయి. సూర్యారాధన శుభప్రదం

 ధనుస్సు

ఈరోజు
కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. ఒక శుభవార్త  మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం ఉత్తమం

 మకరం

ఈరోజు
మీ అభివృద్ధికి  దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి.
దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది

 కుంభం

ఈరోజు
శ్రద్ధగా పనిచేయాలి.  తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. బంధువులతో మాటపట్టింపులకు పోరాదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.  అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి.
సూర్యస్తుతి శక్తిని ఇస్తుంది

 మీనం

ఈరోజు
ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. గిట్టనివారి జోలికి పోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 11, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిథి: చతుర్దశి ఉ9.59
వారం: బృహస్పతివాసరే
(గురువారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ7.01
& శ్రవణం తె5.30
యోగం: ఆయుష్మాన్ సా5.04
కరణం: వణిజ ఉ9.59
&
విష్ఠి రా8.48
వర్జ్యం: ఉ10.45-12.15
దుర్ముహూర్తం: ఉ9.58-10.49
&
మ3.03-3.53
అమృతకాలం: రా7.45-9.15
రాహుకాలం: మ1.30-3.00
యమగండం: ఉ6.00-7.30
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.45
సూర్యాస్తమయం: 6.26

Leave a Reply

%d bloggers like this: