Daily Horoscope 08/08/2022 

0
Daily Horoscope 08/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 08/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
08, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
శుక్ల ఏకాదశి
ఇందు వాసరే (సోమ వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 08/08/2022 
Daily Horoscope 08/08/2022      

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
చేపట్టేపనుల్లో శ్రమపెరుగుతుంది. ఎవ్వరితోను విభేదించకండి. మాట విలువను కాపాడుకోవాలి. సజ్జనులతో కాలాన్ని గడుపుతారు. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
శ్రీ రామ నామస్మరణ మేలు చేస్తుంది

 వృషభం 

ఈరోజు
శుభకాలం. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. శ్రమఫలిస్తుంది. స్థిర చిత్తంతో ముందుకు సాగితే సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి.
సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది

మిధునం

ఈరోజు
ముఖ్యవిషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
గణపతి సందర్శనం శుభప్రదం

 కర్కాటకం 

ఈరోజు
ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలతో మేలైన ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి.
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభదాయకం

 సింహం

ఈరోజు
చేపట్టిన పనులను దైవానుగ్రహంతో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు.
వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం

కన్య

ఈరోజు
భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. మనసు చెడ్డ పనులమీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. తోటివారితో అభిప్రాయ బేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.
సూర్య ఆరాధన శుభప్రదం

తుల

ఈరోజు
మధ్యమ ఫలాలున్నాయి. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు.
హనుమాన్ చాలీసా పఠించాలి

వృశ్చికం

ఈరోజు
చిత్త శుద్ధితో పనులను ప్రారంభిస్తారు. మీ పరిధిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. అవసరానికి సహాయం చేసేవారుంటారు. అతిగా ఎవ్వరినీ నమ్మరాదు.
ఆంజనేయ ఆరాధన శుభప్రదం

 ధనుస్సు

ఈరోజు
మీ ప్రతిభకు పనితీరుకు అధికారులు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయబేదాలు రానీయకండి. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది.
సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించాలి

 మకరం

ఈరోజు
కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. చేపట్టిన పనులను పూర్తిచేయడంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు.
నారాయణ మంత్రాన్ని జపించాలి

కుంభం

ఈరోజు
వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శుభఫలితాలున్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. బంధుమిత్రులతో వాగ్వాదాలకు దిగవద్దు.
దైవారాధన మానవద్దు

మీనం

ఈరోజు
బుద్ధిబలం బాగుంటుంది. ఒక శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో చంచలబుద్ధితో వ్యవహరించి ఇబ్బందులు పడతారు. అధికారులతో కొన్ని ముఖ్యవిషయాలలో అభిప్రాయ బేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
దైవారాధన మానవద్దు.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 8, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిథి: ఏకాదశి సా5.19
వారం: ఇందువాసరే
(సోమవారం)
నక్షత్రం: జ్యేష్ఠ ఉ11.58
& మూల
యోగం: వైధృతి రా2.11
కరణం: వణిజ ఉ6.27
&
భద్ర సా5.19
&
బవ తె4.07
వర్జ్యం: రా7.25-8.54
దుర్ముహూర్తం: మ12.31-1.22
&
మ3.04-3.55
అమృతకాలం: తె4.23-5.52
రాహుకాలం: ఉ7.30-9.00
యమగండం: ఉ10.30-12.00
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 5.43
సూర్యాస్తమయం: 6.28
సర్వ ఏకాదశి

Leave a Reply

%d bloggers like this: