Home Bhakthi Sri Brahma puranam – 15

Sri Brahma puranam – 15

0
Sri Brahma puranam – 15
Sri Brahma puranam - 18

వృష్ణి వంశ వర్ణనమ్‌

సూనూతుడిట్లనియె –

క్రోష్టునికి వృజినీవంతుడుపుట్టెను. వానికి స్వాహి. యజ్ఞకర్తలలో శ్రేష్ఠుడ. స్వాహి కుమారుడు ఉషద్గువు. అతడు సంతతి కొఱకు భూరిదక్షిణములైన యజ్ఞములు సేసి చిత్రరథుడనుకుమారునిం బడసెను. అతడు మంచికర్మిష్ఠి.
వాని కుమారుడు శశబిందువు యజ్వ. విపులదక్షిణుడు. రాజర్షులవర్తనము ననుష్ఠించినవాడు. శశిబిందుని నందనుడు పృధుశ్రవుడు యశస్వి రాజయ్యెను. పురాణవిదు లాతని కుమారుని అంతరుడని చెప్పుదురు.
ఈతనికి నుయజ్ఞుడుదయించెను. వానికి ఉషతుడు గల్గె. అతడు స్వధర్మాదరుడు. వానికి కొడుకు శినేయుడు. శత్రు తావనుడతడు. వానితనూజుడు మరుతుడు. అతడు రాజర్షి.
వాని జ్యేష్టసుతుడు కంబలబర్హిషుడు. అతడు ప్రేత్యభాక్కయ్యు మరణోన్ముఖుడై గూడ ఉత్తమ సంతతిగల కుమారుడు గావలెనని గొప్పధర్మానుష్ఠానమును కోపముతో గావించెను.
నూర్గురు పుట్టిన తరువాత నతనికి యుత్తముడగు కుమారుడొక్కడుదయించెను. అతడు రుక్మకవచుడు. అతడు కవచధారులైన నూర్గరుత్తమ ధానుష్కులను రణమునందు వాడియైన బాణములతో చంపి అత్యుత్తమ శ్రీ లాభమందెను.
వానికి శత్రు సంహారకుడగు పరాజిత్తు వానికి రుక్మేషువుపృధురుక్ముడు జ్యామఘుడు పాలితుడు హరియను మహావీరులపరాజితులు సుతు లైదుగురుదయించిరి.
తండ్రి పాలితుని హరిని విదేహ రాజులకిచ్చెను. ఫృథురుక్ముని యాశ్రయమున రుక్మేషుడు రాజయ్యె. వారిద్దరిచే నంపబడిన జ్యామఘుడు.
అశ్రమమందుండెను, అతడుబ్రాహ్మణులచే లెన్సగ బోధింపబడి ఏకాకియై ధనుస్సుపట్టి ధ్వజము రథముంగొని మరియొక దేశమునకు ఏగెను.
నర్మదాతీరమున నొంటరిగా తిరుగుచు మేకల మృత్తికావతి ఋక్షవంతమను గిరిని గెలిచి శుక్తిమతీ నగరమునందు వసించెను వాని భార్య శైబ్య. బలశాలిని, పతివ్రత, సంతానము లేకున్నను నాతడు మఱియెక భార్యను జేసికొనలేదు.
అతని కొకానొక యద్ధమందు జయము, గల్గెను. అందొక కన్యం గానుకగ బడసెను. ఆమెం గొని భార్యదరికేగి భయముతో కోడలిదిగోయని చూపెను. ఆమె యవరి కోడలు ? యనిప్రశ్నించెన, దానిని విని జ్యామఘుడిట్లనెను.
Sri Brahma puranam - 15
Sri Brahma puranam – 15

రాజిట్లనియె 

నీకు పుట్టబోవు కుమారుని కిది భార్యయనెను.

మఱియు సూతుడిట్లనియె

ఆకన్య ఉగ్రమైన తపస్సు చేసెను. ఆతపఃఫలముగా శైబ్య వృద్ధయై విదర్భుడనుకుమారుం గనెను, విదర్భుడా రాజపుత్రికయందు క్రధకైశికులను శూరులు విద్వాంసులు నగు నిద్దరు కుమారులుం గాంచెను, వారు రణ విశారదులు.
విదర్భునికుమారుడు భీముడు, వాని తనయుడు కుంతి. వాని కొడుకు దృష్టుడు, అతడు రణధృష్టుడు, ప్రతాపశాలి, వాని కొడుకులు ముగ్గురు.
శూరులు, పరమధార్మికులు, అవంతుడు- దశార్హుడు – విషహరుడు దశార్హ సుతుడు వ్యోముడు, వాని కొడుకు జీమూతుడు, వాని తనయుడు వికృతి వానివాడు భీమరథుడు . నవరథుడు నవరథుని పుత్రుడు దళరథుడు, వాని కుమారుడు శకుని.
శకునిసుతుడు కరంభుడు, కరంభుని తనయుడు దేవరాతుడు, వాని పుత్రుడు దేవక్షత్రుడు. వాని సుతుడు వృద్ధక్షత్రుడు.
వృద్ధక్షత్రనందనుడు, దేవపుత్రనముడు మధువుల వంశమునకు కర్త మధురవక్తయగు మధువనువాడు, మధువునకు వైదర్భియందు పురుషోత్తముడగుపురుద్వంతుడను వాడుదయించెను.
మధునికైక్ష్వాకి (ఇక్ష్వాకు వంశజాత) యను భార్యయందు సర్వగుణొపేతుడు సాత్వతకీర్తిపర్ధసుడగు సత్త్వంతుడు అను వాడు పుట్టెను. అతడు సాత్త్వతులనుపేరు తెచ్చినవాడు. మహాత్ముడగు జ్యామఘుని విసృష్టిని విన్నవాడెప్పుడు పరమ ప్రీతినందును ప్రజావంతుడునగును

నూతుడనియె 

సత్త్వతుని వలన కౌసల్యయను నామె బలశాలురగు భాగి, భజమానుడు, దివ్యుడు దేవావృథుడు, అంథకుడు యదునందనుడగు వృష్టి అనువారలగనెను. వారి విశేషసృష్టుల నాల్గింటిని విస్తరించి వర్ణించితిమి.
భజమానునికి సృంజయకుమారైలు బాహ్యక ఉపబాహ్యక అను భార్యలుండిరి. వారికి బెక్కురు పుత్రులుకల్గిరి.
క్రిమి, క్రమణుడు, ధృష్టుడు, శూరుడు, పురంజయుడు, వీరు బాహ్యకసృంజయియందు భజమానునకు జన్మించిరి. అయుతాజిత్తు, సహస్రజిత్తు, శతాజిత్తు దాసకుడు అనువారు ఉపబాహ్యక సృంజయియందు గల్గినవారు.
దేవవృథుడు యజ్వ, తపస్వి. నాకుగుణశాలి కుమారుడుగావలెనని తపోనిష్ఠగొని పర్ణాశానదీజలమాచమించి, తపమాచరించుచుండెను. ఆనదికి సదా తనయందు స్నానముచేయునాతనిపై ప్రేమకలిగెను.
కాని యేలాటిప్రియ మాచరించుటయను నాలోచనలో నొకనిశ్చయమునకురాజాలదయ్యెను. ఈరాజు కల్యాణగుణుడు.
ఈతని కీడైన కల్యాణి యెవ్వతె? ఇతడు కోరిన గుణశాలి కుమారు డుదయింపవతెనన్న నేలాటి యుత్తమ కన్యయితనికి పత్ని కావలెను?
అని యేమేమో తనలో దాను గుణించుకొని తుదకు నేనే యేగి యీతనికింతి నగదునని పరమసుందరరూపము ధరించి యానృపతిని వరించెను. ఆమె నాప్రభు విచ్చగించెను.
ఉదారమతియగు నానృపతి యాసతియందు తేజస్వియైన గర్భముంచెను. పదియవనెలలో నామె సర్వకల్యాణగుణనిధియగు బభ్రుదేవావృథుడను కుమారుని గాంచెను. ఈతడు యేడువేల యరువది యాఱుగురు పురుషుల సమృతత్వమొందించెను.
యజ్వ, దానవతి, ధీమంతుడు, బ్రహ్మణ్యుడు, దృఢాయుధుడు నైన యీ బభ్రుని (దేవావృధుని) వంశమున భోజులు సార్తికావతులని బ్రసిద్ధులైరి. కాశ్యపదుహిత అంధకుని వలని నల్వురం గనెను కుకురుడు భజమానుడు సనకుడు బలబర్హిషుడు అనువారు వారు.
కుకురుని తనయుడు వృష్టి. వానికొడుకు కపోతరోముడు. వానివాడు తివిరి. కానిసుతుడు పుశర్వసువు వానికి అభిజిత్తు వానికి పుత్ర ద్వంద్వము ఆహుకుడు, శ్రాహుకుఢను బేర ప్రసిద్దిచెందిన వారు ఆహుకుని గూర్చి పూర్వులు ఈ క్రింది గాధనుదహరింతురు.
శ్వేతపరివారముతో గూడి (తెల్లవాళ్ళతో) పశివానివలె ఆహుకు డెనుబదికవచముల దాల్చి మొదట నేగును. పుత్రసంతానము లేనివాడు, నూరువేలేండ్లాయుర్థాయము లేనివాడు ఆపవిత్రకర్ముడు.
యజ్వ కానివాడు, భోజరాజు వెంటనుండరాదు. భోజునికి యేనుగులు పదివేలు ధ్వజములు కవచము ధరించినవారు పదివేల మంది. మేఘ ఘోషములు గల
రధములు పదివేలు, బంగారు వెండి యెనుబోతులు ఇరువదియొక్క తూర్పు దిక్కున నేగ్‌డివి. ఉత్తరమున నటులనే నేగెడివి.
భోజవంశీయ రాజులందరు వింటినారియే చిరుగంటగ మ్రోగించినట్టి వారు. మహా యోదులన్నమాట. మరియు అంధక వంశీయులు తమ తోబుట్టువును అవంతీయల కిత్తురు అని గాధ.
ఆహుకునికి కాశ్యపియనునామె యందు దేవకుమారులుబోలు దేవకుడు, ఉగ్రసేనుడడనువారిద్దరు గుమారులు గల్గిరి. దేవకుని కుమారులు నల్గురు. దేవవంతుడు, ఉపదేవుడు, సందేవుడు, దేవరక్షితుడు, అనువారు.
కుమార్తెలేడుగురు. అతడు వారిని వసుదేవునికిచ్చి పెండ్లిసేసెను. వారు దేవకి, శాంతిదేవ, సుదేవ దేవరక్షిత, వృకదేవి, ఉపదేవి, సునామిన్ని, యనువారు.
ఉగ్రిసేనుని కొడుకులు తొమండ్రు కంసుడు, న్యగ్రోధుడు, సునాముడు, కంకుడు, సుభూషణుండు, రాష్ట్రపాలుడు, సుతునువు, అనావృష్టి, పుష్టిమంతుడు, అనువారు. వారి చెల్లెం డ్రయిదుగురు.
కంస, కంసవతీ, సుతనువు, రాష్ట్రపాలి, కంకయునువారు. కుకురవంశీయుడైన ఉగ్రసేనుడు సంతతితోగూడ వర్ణింపబడెను. మిక్కిలి తేజశ్శాలురైన కుకురుల వశమునువిని ధారణసేయుట వలన వంశాభివృద్ధినంది సుఖించును.
ఇది శ్రీబ్రహ్మపురాణమందు వృష్ణివంశనిరూపణమనెడి పదునైదవ యధ్యాయము.

Leave a Reply

%d bloggers like this: