
Sri Brahma puranam – 14 – శ్రీ బ్రహ్మపురాణం – 14
శ్రీ కృష్ణజన్మానుకీర్తనమ్
సూతుడిట్లనియె –
క్రోష్టుని భార్యలు గాంధారి మాద్రియును, గాంధారి అనమిత్రుని మాధ్రి యుధాజిత్తును దేవమీఢుఘడనను నిద్దరింగనెను. వారివంశమే వృష్టి వంశముగా మూడు శాఖలుగా వృధ్ది నందెను. మాద్రికొడుకులు వృష్ణి అంధకుడు. అనువారు శ్వఫల్కడు, చిత్రకుడనువారు వృష్ణియొక్క కుమారులు.
శ్వఫల్కుడు ధర్మపరుడు, వాని పాలనము నందు వ్యాది భయము, అవృష్ణి తాపము మొదలైన బాధలు లేకుండె. ఒకప్పుడు కాశీరాజు పాలించు దేశమునందింద్రుడు మూడేండ్లు వర్షింపనేలేదు.
అపుడు కాశీరాజు శ్వఫల్కుని తన రాజ్యమునకుం గొనవచ్చెను. అతడచ్చేట మసలినకతన హరివాహనుడు (ఇంద్రుడు) వాన గురియించెను. అపుడు శ్వఫల్కుడు కాశీశ్వరుని కుమార్తె గాంధినిని వివాహమాడెను. అమె నిత్యము విప్రునికి గోవు నొసంగుచుండెను.
దాత యజ్వ వీరుడు పండితుడు అతిధిప్రియుడు భూరిదక్షిణుడైన అక్రూరుడు ఉపమద్గువు మద్గువు మందరుడు అరిమేజయుడు, అవిక్షుతుడు అంధకరువు అవాహుడు ప్రతివాహుడును సుందరి యను కన్వయు శ్వఫల్కునకు పుట్టిరి.
దేవవర్చస్సు గల ప్రసేనుడు, ఉపదేవుడు అనువారు ఉగ్రసేనయందు అక్రూరునకు ఉదయించిరి. వృష్ణి కుమారుడగు చిత్రుకునకు పృధువు వివృధువు అశ్వగ్రీవుడు, లశ్వబాహువు, స్వపార్శ్వుడు, గవేషణుడు, అరిష్టనేమిఅశ్వుడు, సుధర్ముడు, సుభాహువుబహుబాహువు ననుకుమారులు.
శవిష్ఠశ్రవణయను కుమార్తెలుపుట్టిరి. దేవమీఢుడు అసిక్నియందు శూరుడనువానినిగనెను. శూరునకు భోజ్యయందు పదిమంది శూరులనువారుదయించిరి.
వసుదేవుడు ఆనక దుందుభియను పేరున ముందుగ పుట్టెను. పుట్టగానే దివంబున అనకములనెడి వాద్య విశేములు దుందుభులు మ్రోగినవి. పుష్పవృష్టి గురిసెను. వసుదేవునితో సముడయిన యందగా డీలోకమునలేడు. అతడు చంద్రునివంటి కాంతితో తేజరిల్లెను.
ఈయనకు దేవ భాగుడు, దేవశ్రవుడు, అనాధృష్ఠి, కనవకుడు, వత్సవానుడు, గృంజముడు, శ్యాముడు, శమీకుడు, గండూషుడునను కొమరులు, పృథుకీర్తి, పృథ, శ్రుతదేవ, శ్రుతశ్రవ రాజాధిదేవి అను నైదుగురు కూతురులు వీరపత్నులు గల్గిరి, శ్రుత శ్రవయందుచైద్యుడు శిశుపాలుడగను పేర గల్గెను.
ఇతడే క్రింధటి జన్మమునదైత్యపతి హిరణ్యకశివుడు, వృద్ధశర్మ వలన వృధ కీర్తియందు కరూశాధిపతియోన దంతవక్త్రుండు పుట్టెను. కుంతియనురాజు పృథను కుమార్తెగా పెంచుకొనెను. అమెను పాండురాజు పెండ్లాడెను.
అమెయందు యముడే ధర్మవేత్తయైన ధర్మరాజై(యుధష్టిరుడు) యుదయించెను. వాయువువలన భీమసేనుడు గల్గెను. ఇంద్రుని వలన ధనంజయుడు అప్రతిరథుడు ఇంద్రపరాక్ర ముడుదయించెను.

కనిష్ఠుడయిన అనమిత్రుడను వృష్ణినందనునికి శినియను వాడుకల్గెను. శిని కొడుకు (శైనేయుడు) సత్యకుడు సత్యకునికుమారుడు యుయుధానుడు(సాత్యకి) దేవభాగునకు మహానుభావుడు.
ఉద్దవుండావిర్భవించెను. డేవశ్రవునిపండితాగ్రణియందురు, దేవశ్రవుడు కీర్తి శాలియగుఆశ్మక్యుడను సుతునింబడెసెను. అనాధృష్టినికృత్తశత్రువసుకుమారిని శ్రుతదేవయనునామె శత్రుఘ్ననిం గనెను.
శ్రుతదేవ కుమారుండు ఏకలవ్యుడు నిషాదుని పెంపకములో పెరిగెను. వత్సవంతునకు పుత్రులు లేనికతన శౌరి (శూరవంశమువాడగు వసుదేవుడు) తన కుమారుని కౌశికుని ధారాదత్తము సేసెను.
అవుత్రకుడైన గండూఘనకు విష్వక్సేనుడు తనకుమారులగు చారుదేష్టుడు, సుదేష్ణుడు పంచాలుడు కృత లక్షణుడునను వారిందతత్త యిచ్చెను.
చారుధేష్ణుడు యుద్ధమునకేగి యెన్నడు వెనుదిరిగినవాడు గాడు అతడు రుక్మిణి తనయులందు కడగొట్టువాడు మహావీరుడు, చారుధేష్ణునిచే హతులైనవారిని (చారూన్ రుచిగనున్నవారివి) ఇపుడుతినవలయునని యాత్ర పోవునపుడు వేలకొలది కాకు లాతని వెంట పోయెడివట.
కనవకునికి తంత్రిజుడు, తంత్రిపాలుడు ననునిద్ధరు కల్గిరి. గృంజమునికి వీరువు అశ్వహనువు గల్గిరి. శ్యమపుత్రుడగు శమీకుడు రాజ్యమేలెను. భోజవంశమున జనించుటచే నేపగించు వాడైనను రాజసూయమొనర్చె.
అతనికి శత్రునాశకుడగు అజాతశత్రపు గల్గెను. ఇక వసుదేవుని సంతానము దెల్పెద. వృష్ణియొక్క (వృష్ణి అంధకభోజ) త్రిశాఖమైన (మూడుశాఖలై) యీ వంశముయొక్క చరిత్ర ధారణము చేయునతడు వంశాభివృద్ధి నందును అనర్థములనుబాయును.
వసుదేవుని భార్యలు పదునల్గురు, పురువంశమున పుట్టిన (1) పౌరవి, (2) రోహిణి, (3) మధిరా, (4) ఆది, (5) వైశాఖి, (6) భద్ర, (7) నునామ్నీ, (8) సహదేవ, (9) శాంతిదేవ, (10) శ్రీదేవి (11) దేవరక్షిత, (12) వృకదేవి, (13) ఉపదేవి, (14) దేవకి అని సుతనువు బడబ అనువారిరువురు పరిచారికలు, పౌరవి, రోహిణియు బాహ్లికుని కుమార్తెలు.
వసుదేవని పెద్దభార్యకు రాముడు, శరణ్యుడు, శరుడు, దుర్దముడు, దమనుడు, శుభ్రుడు, పిండారకుడు, ఉశీనరుడు, చిత్రయను కూతురుం గల్గిరి మొత్తం వీరు తొమ్మండుగురు. చిత్రయే సుభద్రయను పేరుతో గూడ ఖ్యాతి గాంచినది.
వసుదేవునికి దేవకీయందు శౌరి (కృష్ణుడు) అవతరించెను. రామునికి రేవతియందు నిశఠుడను, ప్రియుపుత్రుడుదయించె. పార్ధునికి సుభద్రయందురథికుడగు అభిమన్యుడుగల్గెను.
అక్రూరునికి కాశికన్యయందు సత్యకేతువు జనించె. వసుదేవనియేడ్వురు భార్యలందు కలిగిన శూరుల క్రమమిది. శాంతిదేవకు భోజుడువిజయుడు నను నిద్ధరుగల్గిరి. సునామయందు వృకదేవుడు, గదుడు గల్గిరి. వృకదేవికి అగావహుడు పుట్టెను.
త్రిగర్తరాజుకూతురు శిశిరాయణి యొక్క భార్య గార్గ్యమునివర్యుని పౌరుష పరీక్షకు పూనుకొనెను. కాని యతనివీర్యము స్ఖలనము కాలేదు. పన్నెండవ సంవత్సరమున పరిహసితుడైనయాముని ఒక ఘోషకన్యతో మిథున క్రీడకువక్రమించెను.
అఘోషాంగన ఘోషవేషధారిణియైన గోపాలియనునొక అప్సరస.గోపకన్యావేషము ధరించి యాతని ధరింపనలవికాని గర్భమును (శిశువు) ధరించెను.
మనుష్య స్త్రీ యైన యాగార్గ్యుని భార్యయందు శివునాజ్ఞచే కాలయవనుడనువాడు సింహమువంటి మహాబలశాలి పుట్టెను. వాని పూర్వకాయము వర్తులాకారము సింహమువంటి యాకారము గల్గియుండెను.
అపుత్రకుడైన యవనరాజు యొక్క అంతః పురమున వాడు పెరిగెను. అందువలన యవనునికి వాడు కుమారడయి కాలయవనుడన నొప్పెను. వాడు యుద్ధకుతూహలము గొనియేరితో తలపడుదునవి యడుగగా దేవర్షి నారదుడు వృష్ణి – అంధక కులములను జెప్పెను.
అక్షౌహిణిసేనతో వాడు మధురపైనేగి దూతను బంపెను. అపుడువృష్ణ్యంధకులు మహామతియైన కృష్ణునిం బురస్కరించుకొని పోయి కార్యాలోచనచేసి యొకనిశ్చయమునకు వచ్చి పారిపోవుటకంగీకరించిరి.
పినాకపాణియైన శివుని అభిప్రాయమును గౌరవించి మధురనువదిలి కుశస్థలిని ద్వారకనుజేరినివాసము సేయనెంచిరి. ఇది శ్రీ కృష్ణ జన్మవృంత్తాంతము. శుచియై ఇంద్రియములను నియమించుకొని పర్వములందు వినిపింపవలెను. అట్లువినిపించిన విద్వాంసుడు ఋణములను బాసి సుఖియగును.
ఇది శ్రీ బ్రహ్మపురాణమందు కృష్ణ జన్మానుకీర్తనమను పదునాలుగవ యధ్యాయము.