Daily Horoscope 05/08/2022 

0
Daily Horoscope 05/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 05/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
05, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
శుక్ల అష్టమి
భృగు వాసరే (శుక్ర వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 05/08/2022 
Daily Horoscope 05/08/2022

రాశి ఫలాలు 

 మేషం

ఈరోజు
తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త.
సాయి నామాన్ని జపించాలి

 వృషభం 

ఈరోజు
సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తారు. గిట్టనివారితో మితసంభాషణం చేయడం మంచిది. శ్రీసుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం

 మిధునం

ఈరోజు
సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృథా ప్రయాణాలు చేయకండి. ఆరోగ్యంపై  శ్రద్ధ అవసరం.
శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం

కర్కాటకం 

ఈరోజు
ప్రయత్న కార్యసిద్ధి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. కలహాలకు తావివ్వరాదు.
ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు

 సింహం

ఈరోజు
ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలు ఉన్నాయి. ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. శాంతంగా వ్యవహరించండి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది

 కన్య

ఈరోజు
కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
నవగ్రహ ఆరాధన శుభప్రదం

 తుల

ఈరోజు
స్వల్ప ధనలాభం ఉంది. అనవసర తగాదాలకు తావివ్వకండి. ఒక విషయంలో మనఃసంతోషాన్ని పొందుతారు.
విష్ణు సహస్రనామాలు చదవడం ద్వారా అంతా మంచి జరుగుతుంది

 వృశ్చికం

ఈరోజు
స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.
శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం

ధనుస్సు

ఈరోజు
సమయాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయండి, మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు.
ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది

 మకరం

ఈరోజు
లక్ష్యంపై మనస్సును లగ్నం చేయండి, మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి.
ఇష్టదైవ ఆరాధన శుభప్రదం

 కుంభం

ఈరోజు
తోటివారి సహకారం లభిస్తుంది. పనులలో ఆటంకాలు తొలుగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీరామనామాన్ని జపిస్తే  మేలు జరుగుతుంది

 మీనం

ఈరోజు
మనో ధైర్యాన్ని కోల్పోకండి. ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు,మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్య విషయాల్లో అశ్రద్ధ రానీయకండి.
ఇష్టదైవ ప్రార్థన శుభాన్ని కలిగిస్తుంది.

Panchangsm

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 5, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిథి: అష్టమి రా11.25
వారం: భృగువాసరే
(శుక్రవారం)
నక్షత్రం: స్వాతి మ3.29
& విశాఖ
యోగం: శుభం మ12.55
కరణం: భద్ర మ12.08
&
బవ రా11.25
వర్జ్యం: రా8.53-10.24
దుర్ముహూర్తం: ఉ8.16-9.07
&
మ12.31-1.22
అమృతకాలం: ఉ6.53-8.27
రాహుకాలం: ఉ10.30-12.00
యమగండం: మ3.00-4.30
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: తుల
సూర్యోదయం: 5.42
సూర్యాస్తమయం: 6.29
శ్రీ వరలక్ష్మీ వ్రతం

Leave a Reply

%d bloggers like this: