Home Bhakthi Sri Brahma puranam – 13

Sri Brahma puranam – 13

0
Sri Brahma puranam – 13
Sri Brahma puranam - 18

పురు వంశ వర్ణనమ్‌

సూత! పురువంశమును, ద్రుహ్యుడు అనువు యదువు తుర్వసుడు నను వారి వంశములను వేర వేర వినవలతునుని భ్రాహ్మణులడుగ నూతుండిట్లనియె.
మునిపుంగవులరా! మొదట మహాత్ముడైన పూరుపువంశమును గూర్చి మొదటినుండి విస్తారముగా జెప్పుచున్నాను. వినుడు.
పూరువు కుమారుడు సువీరుడు, వానికి మనుస్యుడు, వానికి అభయదుడు. వానికి సుధన్వుడు, వానికి సుబాహువు, వానికి రౌద్రాశ్వుడు, రౌద్రాశ్వునకు దశార్ణేయుడు, కృకణయువు, కక్షేయువు, స్థండిలేయువు, నన్నతేయువు, ఋచేయువు, జలేయువు, బలశాలి యగు స్థలేయువు, ధనేయువు, వనేయువు నను పదిమంది గల్గిరి.
మరియు భద్ర, శూద్ర, మద్ర, శలద, మలద, ఖలద, నలద, సురస, గోచవల, స్త్రిరత్నకూటయను పదిమంది కుమార్తెలు జనించిరి. అత్రివంశమందుదయించిన ప్రభాకరుడను ఋషి వారందరకు భర్తయయ్యెను.
అతడు భద్రయందు యశస్వియగు సోముని గనెను. సూర్యుడు రాహువుచే నిహతుడై (గ్రహణమందు) యాకాశమునుండి పడిపోవుచున్న తఱి, లోకమంధకారబంధురమైన యెడ యీ ప్రభాకరుని వలననే వెలుగేర్పడెను.
నీకు స్వస్తి (శుభము) గలుగుగాక యని ప్రభాకరుడన్నంత సూర్యు డంతరిక్షమునుండి క్రిందికింబడడయ్యెను. ప్రభాకరుడత్రి ప్రధానములయిన అత్రేయస గోత్రములకు కర్తయయ్యె.
యజ్ఞములందత్రికి బలము దేవతలచే కల్పింపబడెను. (ఇప్పటికిని యజ్ఞసదస్సునందాత్రేయన గోత్రుల కగ్రపూజ యిచ్చుట సంప్రదాయ సిద్ధమైనది.) ప్రభాకరుడా పదిమంది పత్నులయందు పదిమంది కుమారులను వేదపారగులను గోత్రకర్తలను గాంచెను. వారు స్వస్త్యాత్రేయ లనుపేర ప్రఖ్యాతి గనిరి.
త్రివిధ ధనశూన్యులు. (సూర్యుడు పడిపోవుటజూచి ఆత్రేయుడగు ప్రభాకరుడాయనకు స్వస్తియగుగాక యన్నందున నా గోత్రము వారికీ బిరిదు వచ్చినదన్నమాట) కక్షేయుని కుమారులు మువ్వురు.
మహారధులు. సభానరుడు, చాక్షుషువు, పరమన్యువు ననువారు. సభానరుని కుమారుడు విద్యాంసుడగు కాలానలుడు. వాని కుమారుడు ధర్మజ్ఞుడగు సృంజయుడు వానిపుత్రుడు వీరుడు, మహారాజునగు పురంజయుడు వాని కుమారుడు జనమేజయుడు.
మహాశాలుడు జనమేజయిని పుత్రుడు. మహాశాలుడు దేవతలలో విఖ్యాతుడు. సుప్రతిష్ట గన్నవాడు, నయ్యెను. మహాశాలుని కుమారుడు మహామనుడు దేవపూజితుడు. మిక్కిలి గొప్ప మనస్సుcగలవాడు.
ఆయన కౌడుకులు ధర్మజ్ఞుడగు ఉశీనరుడు, మహాబలశాలియగు తితిక్షుడు ననువారిద్దరు. ఉశీనరుని పత్నునైదుగురు. రాజర్షి వంశమువారు. నృగ, కృమి, నవ, దర్వ, దృషద్వతియనువారు.
వారియందు ఉశీనరునకు వార్ధకదశలో తపఃప్రభావముచే కులోద్వహులైన కుమారులైదుగురు. నృగకు నృగుడు, కృమకి కృమి, నవకు నపుడు, దర్వకు సువ్రతుడు, దృషద్వతికి శిబియనుజౌశినర ప్రభువు జన్మించిరి.
శిబికి శిబులయుడను నల్గురు కొడుకులు నృగునికి ధేయులు గల్గిరి. నవునిది నవయను రాష్ట్రుము. కృమిది కృమిలాపురి, సువ్రతునికంబష్టులు గల్గురి.
శిబయొక్క నల్గురు, కుమారులు వృషదర్భుడు, సువీరుడు, కేకయుడు, మద్రకుడునను వారు, వారిదేళములు సర్వసంవత్స మృద్ధములగు కేకయములు, మద్రకములు పృషదార్భములు సువీరములు నను ప్రసిద్ధినందినవి. తితిక్షువు పూర్వదిక్కునకు రాజయ్యెను.
తితిక్షుని కుమారుడు ఉషద్రధుడు. వాని కుమారుడు ఫేనుడు, వానికి సుతవుడు వానికి బలి కలిగిరి. బలి మనుష్య జన్మ మెత్తెను. అతడు బంగారపు తూణీరము (అమ్ములపొది) గలవాడు.
మహాయోగియై రాజ్యమేలెను. వంశోద్దారకులగు నైదుగురు కుమారులను భూమియందు గదెను. వారు అంగుడు, వంగుడు, సుహ్ముడు, పుండ్రుడు, కళింగుడు ననువారు, వారి పరంపర బాలేయమనుపేర క్షత్రవంశము ప్రసిద్ధిగాంచెను.
బాలేయాలను, బ్రాహ్మణులను, బలి వంశోద్ధారకులును, గూడనైరట.
బ్రాహ్మ సంతోషించినవాడై బలికి మహాయోగిత్వము కల్పపూర్ణాయువు, ధర్మతత్తార్ధ మెఱుంగుడి సాటిలేని బలమును సంగ్రామమందజేయత్వము ధర్మప్రాధాన్యము, తైలోక్యదర్శనము, సంతానప్రాధాన్యము చాతుర్వర్ణ్యవ్యవస్థాపనము నను లక్షణములను వరముగ నొసంగెను; ఇందువలన బలి పరమశాంతి వడసెను.
కాలక్రమమున నతడు స్వస్థానమును (పాతాళమును) చేరెను. అంగాదుల పేర నాయాదేశములు ప్రసిద్ధినందియున్నవి.
అంగునికొడుకు దధివాహనుడు. వాని కొడుకు దివిరధుడు. వాని పుత్రుడు ఇంద్రతుల్య పరాక్రముడు విద్వాంసుడునగు ధర్మరధుడువాని పుత్రుడు చిత్రరథుడు, ధర్మరథుడు కొలం జరాద్రిపై యజ్ఞముచేసి యింద్రునితోగూడి సోమపానము జేసెను.
చిత్రరథుని తనయుడు దశరధుడు, లోమపాదుడను ఖ్యాతినందెను. ఆయన కూతురు శాంత. ఆ దశరధునికి శాంతా భర్తయైన ఋష్యశృంగుని యనుగ్రహముచే చతురంగుడనువాడు వంశోద్ధారకుడై జనించెను.
చతురంగునికి పృధులాక్షుడు, వానికి చంపుడుcగలిగెను (ఈతని రాజధానియే చంపాపురి. ఇంతకుము న్నీనగరము ‘మాలిని’ యనబడెను.) అతనికి పూర్ణభ్రదుని ప్రసాదమున హర్యంగుడు గల్గెను.
వైభాండకి (ఋష్యశృంగముని) మంత్రములతో నింద్రుని ఉత్తమ వాహనమైన ఐరావతమును ఆ హర్యంగుని యేనుగుగా భూమికి దింపెను. హర్యంగుని తనయుడు ఛద్రరధుడను రాజు.
వాని కోడుకు బృహత్కర్మ యను నరేంద్రుడు, వాని పుత్రుడు బృహద్దర్భుడు వానితనయుడు బృహన్మనుడు, రాజేంద్రుడగు వాని కుమారుడు జయద్రధుడు వానిపుత్రుడు దృఢరథ మహారాజు, వాని సుతుడు విశ్వజిత్తయిన జనమేజయుడు.
వాని కుమారుడు వైకర్ణుడు. వాని పుత్రుడు వికర్ణుడు వానికి నూర్గురు కొడుకులుఁ గల్గిరి.
వారంగవంశవర్ధనులు, ఆంగతవంశరాజుల నందరిని తెల్పియుంటిని, వారందరు సత్యవ్రతులు, మహత్ములు, సంతానవంతులు, మహారదులు, రౌద్రాశ్వతనయుడైన ఋచేయుని వంశమిక వర్ణించెద; వినుడు.
Sri Brahma puranam - 13
Sri Brahma puranam – 13
ఋచేయుని తనయుడు మతినారుడు, వానికొడుకుయి పరమధార్మికులు ముగ్గురు. వసురోధుడు, సుబాహువు అనువారు. అందురు వేదవిదులు, బ్రహ్మణ్యులు, సత్యనంగరులు, మతినారుని కూతురు ఇల ఆమె స్త్రీయయ్యు బ్రహ్మవాదినియయ్యె.
ఆమె తంసుని భార్య. వారి కొడుకు రాజర్షి ప్రతాపశాలియైన ధర్మనేత్రుడు అయిన బ్రహ్మావాది, పరాక్రమవంతుడు అతని భార్య ఉపదాసవి. వారి కుమారులు నల్వురు దుష్యంతుడు, సుష్మంతుడు ప్రవీరుడు, అనఘడు, ననువారు.
దుష్యంతునికి శకుంతల యందుదయించినవాఁడు భరతుడు. నర్వదమనుడను ఖ్యాతినందెను. అతడు పదివేల యేనుగుల బలము గలవాడు.
చక్రవర్తి, అయన పేరనే భారతవర్షము ఆందలి ప్రజలు భారతులను పేరును పొందిరి. భరతునితనయులు మాతృశాపమున నశించిరి. ఆ కథ మున్న తెలిపితిని.
బృహస్పతి (అంగిరస్సు) యొక్క కుమారుడు భరద్వాజుడు భరతునిచే బెక్కు యాగములు చేయించిను.
కాని అవి పుత్ర సంతానము విషయములో వితధములు (వ్యర్థములు) కాగా భరద్వాజుని వలన (నియోగమువలన) అతనికి వితథుడను పుత్రుడు కలిఁగెను.
వాడు కలిగిన వెంటనే భరతుడు దివమునకు వెళ్ళెను. అతనికి పట్టము గట్టి భరద్వాజుడు వసంబున కేగేను.
వితధునికి అయిదుగురు సుతులు గల్గిరి, సుహోత్రుడు, సుహోత, గయుడు, గర్గురు, కపిలుడు ననువారు. సుహోత్రుని కొడుకులు సత్యవాదియగు కాశికుడు నరపతియగు గృత్సమతి.
గృత్సమతి పుత్రులు బ్రాహ్మలు, క్షత్రియులు వైశ్యులును. కాశికుని కుమారుడు (కాశేయుడు) దీర్ఘతపుడు. దీర్ఘతపుని కుమారుడు విద్వాంసుడైన ధన్వంతరి.
ఆయనకుమారుడు కేతుమంతుడు వాని కుమారుడు విద్వాంసుడైన భీమరధుడు, వాని కుమారుడు వారణాసి ప్రభువగు దిశోదానుడు, దిశోదానుకొడుకు వ్రతర్ధనుడు వీరుడైన ప్రభువు అతని కుమారులు వత్సడు, బార్గవుడు, వత్సరాజుపుత్రుడగు అలర్కుడను ఠాణుబుద్ధిమంతుడు.
హైహయుని దాయాద్యమును (రాజ్యమును) హరించెను అంతియగాక దివోదానుడు హరించిన పితృరాజ్యమును తిరిగి సంపాదించుకొనెను.
అలర్కుడు కాశీరాజు బ్రహ్మణ్ముడు సత్యసంగరుడు అరువదు ఆరువేలేండ్లయువకుడై రూపసంపన్నుడై యుండెను.
లోపాముద్రప్రసాదమున దీర్ఘాయువునొందినాడు. చివరివయస్సున క్షేమక రాక్షసుని జంపి రమ్యమైన వారాణసీ నగర నిర్మాణము సేసెను. అలర్కుని కొడుకు క్షేమకుడు వాని సుతుడు వర్షకేతుడు, వాని తనయుడు విభువు.
విభుని కొడుకు ఆనర్తుడు. నుకుమారుడు వాని కొడుకు, వాని తనయుడు సత్యకేతువు ధర్మమూర్తి. వత్సునకు వత్సభూమి, భార్గవు నివలన భర్గభూమియుకలిగెను, భార్గవ వంశమునందు అంగిరసుని పుత్రులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగలరు.
బ్రహ్మణోత్తములారా! అజమీడుని వంశము వినబడుగాక! సుహోత్రుని పుత్రుడు- బృహన్నామకుడు వాని తనయులు ముగ్గురు. అజమీఢుడు ద్విమీఢుడు-పురుమీఢుడు.
ఆజమీఢుని భార్యలు నీలిని-కేశిని-ధూమీని యనువారు అజమీఢునకు కేశినియందు వ్రతాపవఁతుఁడగు జహ్నువు కలిగెను, అతడు సర్వమేధమను మహానత్రయాగ మొనరించెను.
గంగాదేవి యాయనను భర్తగారించి వినీతురాలివలె నభినరించెను. అతడు యిష్టపడకున్నంత నాతని యజ్ఞసదస్సును ముంచెత్తెను. జహ్ను వందులకు కోపించి యిదిగో నీ నీరమును సంక్షేపించి త్రాగెదను చూడుమని త్రాగివైచెను.
ఋషులు చూచి యామె నాతని కుమార్తెగా నొనర్చిరి. యువనాశ్వుని కూతురగు కావేరి నాతడు పరిణయ మయ్యెను. గంగా శాపమున నవ్వల కావేరియొక్క సగము మేను నదీరూపమయ్యెను.
జహ్నుని తనయుడు అజకుడు, వాని కుమారుడు బలాకాశ్వుడు, వాని సుతుడు మృగయాప్రియుడు కుశికుడు, అడవిజాతులతో పెరిగినాడు. అతడిం ద్రతుల్యుడగు సుతుడు కావలెనని తపముఁజేసెను.
ఇంద్రుడడలి గాధియను పేరుతో దానే స్వయముగ వాని కుదయించెను. గాధి తనయుడు విశ్వామితుడు, అష్టకుడాతనికొడుకు, వాని కొడుకు తౌహీ, ఇది జహ్నుగణము.
అజమిఢుని రెండవ వంశము. అజమీఢునికి నీలియందు సుశాంతి పుట్టెను. వానికి పురుజాతి, వానికి వాహ్యాశ్వుడు వానికి అయిదుగురుకల్గిరి. ముద్గలుడు సృంజయుడు, బృహదిషురాజు.
పరాక్రమశాలియగు యువీనరుడు, కృమిలాశ్వుడు. ఈ అయుదుగురు దేశములను రక్షింపజాలుదురు. అని ప్రసిద్ధి.
ముద్గలునిదాయాదుడు మౌద్గల్యుడు, అయనవలన ఇంద్రసేన బ్రధ్నశ్వుడును కోమరుం గన్నది. సృంజయుని కుమారుడు పంచజనుడనువాడు. వాని కొడుకు సోమదత్తుడు. వాని కొడుకు కీర్తిశాలి సహదేవుడు.
వాని పుత్రుడు సోమకుడు. అజమీడు వంశము యొక్క క్షీణదశలో సోమకుడుపుట్టెను. వాని కొడుకు జంతువు. వానికి నూర్గురు కుమారులు. వారిలో చిన్నవాడు వృషతుండు. వాని కొడుకు ద్రుపదుడు.
ఇంతవరకు అజమీఢవంశము. వారు సోమకులను పేరుతో ప్రఖ్యాతి గనిరి.
మునిశ్రేష్టులారా! అజమాఢుని మహిషి ధూమిని పతివ్రత. వ్రతాచరణపరాయణ. సంతతికై పదివేలేండ్లు దుశ్చరమైన తపమాచరించి అగ్ని హోత్రము సేయుచు మిత భోజనయై అగ్నిహోత్రసమీపదర్భలందు శయించెను.
అమెతో అజమీఢుడు నమావేశమంది ధూమ్రవర్ణుడు చక్కనివాడునగు ఋక్షుడనుకుమారుని గాంచెను. ఋక్షుని వలన సంవరణుడు వానికి కురువు గల్గెను. అతడు ప్రయాగనుండి వెళ్ళి కురుక్షేత్రము నిర్మించెను.
అదిపవిత్రము, రమణీయము, పుణ్యవంతులచె సేవింపబడునది. ఆయన వంశీయులే కౌరువులు. కురుని కుమారులు నల్వురు, సుధన్వుడు, సుధనుడు, పరీక్షిత్తు మహాపరాక్రమవంతుడగు అరిమేజయుడు.
పరీక్షిత్తుకొడుకులు జనమేజయుడు, శ్రుతసేనుడు, అగ్రసేనుడు, భీమసేనుడు, వీరందరు శూరులు, బలశాలురు. జనమేజయుని తనయుడు బుద్ధిశాలియగు సురధుడు.
వానిసుతుడు విదూరథుడు, వానికొడుకు మహారథుడగు ఋక్షుడు. రెండవవాడు భరధ్వాజుని వలన నదే పేర ప్రఖ్యాతి వడెసెను. సోమ వంశమం దిద్దరు ఋక్షులు, ఇద్దరు పరీక్షిత్తులు, ముగ్గురు భీమసేనులు, ఇద్దరు జనమేజయులు గల్గిరి.
రెండవ ఋక్షునికి భీమసేనుముదయించెను, వానికి ప్రతీవుడు. వానికి శాంతనుడు. దేవాపి, బాహ్లీకుడు అను మువ్వురు గల్గిరి. శాంతసునికి భీష్ముడుదయించెను.
బ్రాహ్మణులారా ! బాహ్లీకుని వంశము వినుడు. బాహ్లీకునికి కీర్తి శాలియగు సోమదత్తుడు, వానికి భూరిశ్రవుడు శలుడు, దేవాపిముని దేవతులకుపాధ్యాయుడయ్యె. చ్యవనపుత్రుడు కృతకు డతని కిష్టుయ్యెను. శాంతనుడు కౌరవశ్రేష్టుడు రాజయ్యెను.
త్రిలోకప్రసిద్ధమైనశంతను వంశము తెల్పెద. శంతనుని వలన గంగ దేవవ్రతునిcగన్నది. అతడే భీష్ముడు. (గాంగేయుడు). పాండవులకు పితామహుడు. శంతనుని భార్య కాళి విచిత్రువీర్యునిగాంచెను.
విచిత్ర్యవీర్యునిక్షేత్రమందు (భార్యయందు) కృష్ణద్వైపాయనుని వలన ద్భతరాష్ట్రుడు పాండురాజు విదురుడు పుట్టిరి.
ధృతరాష్ట్రునికి గాంధారియందు దుర్యోధనాదులు నూర్గురు గల్గిరి. దుర్యోధనుడు రాజరాజయ్యెను. పాండురాజు కుమారుడు ధనంజయుడు. అయనకు సౌభద్రుడు(సుభద్రకొడుకు) అభిమన్యుడు.
వానికి పరీక్షిత్తు గల్గిరి. పరీక్షిత్తునకు పారిక్షిత్తుc (జనమే జయుడు) వానికి కాశియందు ఇద్దరు సుతులు పుట్టిరి. మహారాజగు చంద్రాపీడుడు, మోక్షజ్ఞుడగు సూర్యాపీడుడు ననువారు.
చంద్రా పీడుని కొడుకులు నూర్వురు. మంచి విలుకాండ్రు. జానమేజయమను పేర నీ క్షత్రవంశము ప్రసిద్ధికెక్కినది.
అందు మొదటివాడు సత్యకర్ణుడు వారణాసీనగరమందుండెను. ఈతడు పరాక్రమశాలి, యజ్వ. విపులదక్షిణుడు. వాని దాయాదుడు శ్వేతకర్ణుడు. ప్రతాపశాలి. అపుత్రకుడై వనమునకేగెను.
అతనివలన వనమున యదువంశమున పుట్టినదియు సుచారుని కుమార్తెయు నగు మాలిని (గ్రాహమాలిని) గర్భవతి కాగా శ్వేతకర్ణుడు పూర్వము సంకల్పించిన మహాప్రస్థానమునకేగెను.
మాలినియు ప్రియుని వెంబడించి మార్గమందు సుకుమారుడైన కుమారుం బ్రసవించెను. అ శిశువు నక్కడనే విడిచి, మహాప్రస్థానమున పతులననుగమించిన ద్రౌపదివలె మహానుభావురాలగు నామె రాజు ననుగమించెను.
ఆ విడిచిపెట్టిన శిశువు పర్వతమం దేడ్చుచుండగా దయచూప మేఘములు ఆ మహాత్మునికి నీడయిచ్చెను. శ్రవిష్ఠాకుమారులిద్దరు పైప్పలాది కౌశికుడనువారు జాలిగొని యా బాలుని జలమునందు గడిగిరి.
అంతకుమున్నేడ్చుచు పాషాణమందు దొరలిన యా బాలుని రక్తసిక్తమైన శరీరము యిరుపార్శ్వములు మేకవతెనల్పెక్కినవి. అందువలన నా బాలుని కా మునులు అజపార్శ్వుడు అను నామకరణము గావించిరి.
అతడు రేమకుని యింట నిద్దరు బ్రాహ్మణులచే బెంపబడెను. రేమకునిభార్య యతనిని తనపుత్రునిగా నెత్తుకొనగానామెకతడు కొడుకయ్యెను. అతనికా బ్రాహ్మణులు మంత్రులైరి.
వారిపుత్ర పౌత్రులు సమాన జేవనుతైరి. ఇది పౌర వంశచరిత్ర. మహాను భావులైన పాండవుల గథ. ఈ విషయములో పరమ ప్రీతినందిన ధీమంతుడగు నహుషకుమారుడగు యయాతిచే వార్దక దశలోనిట్లొక శ్లోకము గానము చేయబడినది.
ఈ భూమి చంద్రార్కగ్రహశూన్యమైన కావచ్చును. కాని యెస్నటికి అ పౌరపము కాదు. అనగా పురవంశాకురమెన్నటికిని నుండకపోదు. ఇది పౌరవంశచరిత్ర తెలిపితిని.
ఇక తుర్వసువు ద్రుహ్యుడు. అనువు యదువు వారి వంశములు చెప్పెద. తుర్వసుని కొడుకు వహ్ని వాని కొడుకు గోభానుడు. అతని కొడుకు ఐశానుడు. ఇతడు పరాజుతడు కానిలాజు వాని కుమారుడు కరంధముడు.
వాని పుత్రుడు మరత్తుడు. మఱియొక అవిక్షితుని పుత్రుడగు మరుత్త మహారాజు నాచే వెనుక చెప్పబడెను.
మరుత్తు విపులదక్షిణములైన యజ్ఞము లాచరించెను. వానికి సంతతి లేదు, సంయతయనుకూతురు మాత్రమే గల్గెను. అమె యజ్ఞదక్షిణగా సంవర్తున కీయబడినది. అమె దుష్యంతుని కుమారునిం గనెను.
ఇట్లు యయాతి శాపముచే తుర్వసుపు వంశము పురువంశములో చేరెను.
దుష్యంతుని కుమారుడు కరూరోముడనురాజు. వాని కొడుకు అహ్లీదుడు. అతనికి నల్గురు కుమారులు, పాండ్యుడు, కేరశుడు, కాలుడు, చోళరాజుననువారు. దృహ్యుని కుమారుడు బభ్రుసేతు మహారాజు.
అతని కొడుకు అంగారసేతుడు. అతడు మరుత్తులకు రాజు. ఆవీరుడు వనాశ్యునిచే అతికష్టముతో యుద్దమందు గూలచ్చిబడెను. పదునాలుగు మాసములా ఘోరయుద్ధము జరిగెను.
అంగారసేతువు కొడుకు గాంధారుడు. అతనిపేరనే గాంధారమను దేశము ప్రఖ్యాతి కెక్కెను. గాంధారదేశమందలి గుఱ్ఱములు ప్రశస్తములు.
అనువు కొడుకు ధర్ముడు, ధర్ముని కొడుకద్యూతుడు. వాని కొడుకు వనదహుడు. వాని కొడుకు ప్రచేతనుడు. వాని కొడుకు సుచేతనుడు. తుర్వసువంశీయులు చెప్పబడిరి.
యదుకుమారులు దేవకుమారతుల్యులైదుగురు. సహస్రాదుడు, పయోదుడు, క్రోష్ఠనీలుడు. అంజికుడు. సహస్రాదుని కొడుకులు పరమధార్మికులు ముగ్గురు.
హైహయుడు, హయుడు వేణుహయరాజు, హైహయుని కుమారుడు ధర్మనేత్రుడు, వాని కొడుకు కార్తుడు, వాని కొడుకు సాహంజుడు, వాని పేర ” సాహంబని” యని పుర మేర్పడెను.
మహిష్మతుని కొడుకు భద్రశ్రేణ్యుడు, ప్రతాపశాలి. వాన తనయుడు దుర్ధముడు. వాని తనయుడు బుద్ధిమంతుడు కనకుడు. వాని కుమారులు నల్గురు. కృతవీర్యుడు, కృతౌజనుడు, కృతథన్వుడు, కృతాగ్ని, కృతవీర్యుని తనయుడు అర్జునుడు (కార్త వీర్యార్జునుడు)
ఇతడు సప్తద్వీములేలెను. వేయు బాహువులు కలవాడు. సూర్యునట్లు వెలుగు రథముతో నొక్కడు వసుధామండలమెల్ల జయించే పదివేలేండ్లు దుశ్చరమైన తపముసేసి దత్తాత్రేయుల నారాధించె.
దత్తగురు డాతనకి నాల్గువరములిచ్చెను. వేయి చేతులు గల్గుట. అధర్మమునుండి సజ్జనులు రక్షించుట, సర్వ భూమండలము జయించి ధర్మమున ప్రజారంజనము చేయుట, రణరంగమున బెక్కుర జయించి అక్కడే సర్వాధికుడైన వానిచేతిలో వధింపబడుట అనునవి యా వరములు.
యుద్దము సేయుచుండగా యోగశక్తిచే యోగీశ్వరునికట్లు బాహుసహస్ర మావిర్భవించుచుండును. సప్తద్వీపయైన వసుంధర నాతడు సముద్రములు, నగరములు, పట్టణములతో గూడినవెల్ల గెల్చుకొనెను. ఏడు ద్వీపములందు నేడువందలయజ్ఞముల నతడు నిర్వహించెను.
అన్ని యజ్ఞములు శతసహస్ర దక్షిణములు, అన్నియు కాంచనయూపములు, కాంచనవేదికములు, అన్నిటను సర్వదేవతలు, గంధర్వులు, అప్సరసలు అలంకరించు కొని విమానములపై యరుదెంచి నిత్యము నాతని యజ్ఞము నలంకరించిరి.
అ యజ్ఞమందు దేవర్షియు, వరీదాసుకొడుకును గంధర్వుడును విద్వాంసుడు నగు నారదుడు అతని మహీమ కన్చెరువడి యతిని జన్నమందు ఈ గాధలను గానము చేసెను.

నారదుడు పాడిన గాథలివి :-

యజ్ఞ దాన తపస్సులచే, విక్రమముచే, శ్రుతముచే (పాండిత్యముచే) కార్తవీర్యార్జునుని స్థితి నే రాజును పొందజాలడు, సప్తధ్వీపములందును జనములకాతడు, డాలు, కత్తి, రథము కలవాడై యోగియై యెట్టయెదుట కనబడుచుండును.
ద్రవ్యనష్టము, శోకము, విభ్రమము ననునవి ధర్మపాలనలో నుండు ఆతనికి లేవు. నర్వరత్నభాజనుడు, సమ్రాట్టు, చక్రవర్తియునై యతడే పశుపాలకుడు, క్షేత్రపాలుడను గూడ నయ్యెను.
యోగియగుటచే నా కార్త వీర్యార్జునుడు వర్షించుటలో వర్జన్యుడాయెను. మేఘముతానేయయ్యెను. వింటివారిదెబ్బలచే కఠినమైన చర్మముగలబాహుసహస్రముచే నాతడు శరత్కాలమందు వేయికిరణములచే వెలుగొందు భాస్కరుడట్లు తేజరిల్లెను.
మాహిష్మతీ నగరమందు కర్కౌటకుని కొడుకులను నాగులను జయించి వారి నానగరమందే మనుష్యులలోనుంచెను. పద్మ నయనుడగు నతడు వర్షాకాలమునందు విలానముగా తన బాహువులచే నుబికిన సముద్రవేగము నడ నీటివాలు నెదురెక్కించెను.
క్రీడించుచున్న ఆకార్తవీర్యార్జునిచే తిరస్క్రతయై యాతడేలు గ్రామమును మాలాకారమున చుట్టుకొని పారు నర్మదానానది చలించు వేలకొలది కెరటములతో భయ పడుచు అతనికీ అభిముఖముగా వచ్చెను.
అతడు వేయిచేతులచే సముద్రమునుక్షోభింపచేయగా పాతాళవాసులగు మహాసురులు భయపడి నిశ్చేష్ఠులయి సముద్రమందు నక్కినక్కి దాగిరి. మహాతరంగములు చూర్ణితములాయెను.
మహామీన తిమింగలాది జలజంతువులు చలించిపోయొను. నురుగు రాసులు గాలిచేభగ్నమాయెను. సుడులుసంకులములయ్యెను. ఇట్లాతడు మందరగిరి మథవ పరిక్షిప్తమగుక్షీరాభ్ధినట్లుబ్ధిని సంక్షోభపరచెను.
అమృతమథన మందువలె శంకితులయి వేలకొలది నాగులు తటాలున లేచి వెఱచుచు రాజవరుల దిలకించి పడగలు వంచి వినతులై సాయాహ్నమందు వాయుకంపితములైన అరటిబోవెల గుంపులట్లు వణంకుచు నాతని శరణమందిరి.
అతడు శరపంచకముచే రక్తము గారి తడిసిపోయిన సేనానమేతుదైన లంకేశ్వరుని అల్లెత్రాళ్ళతో బంధించి మోహింపజేసి లోగొని మాహిష్మతీ నగరమున బంధించెను.
తనకుమారుడట్లు కార్తవీర్యార్జునిచే బంధితుడగుట వని పులస్త్యబ్రహ్మ కార్తవీర్యార్జునుని దర్శించి యాచించిన మీదట రావణు నతడు విడిచిపుచ్చెను.
వాని బాహుసహస్రముచే నొనరింపబడిన ధనుష్టంకారము ప్రళయ సమయ పర్జన్యఘోషణభీషణమ్మై పిడుగులుపడినట్లు బెట్టదమాయెను. ఏమి అశ్చర్యము ! భార్గవరాముని వీర్యంబు కార్త్యవీర్యుని బాహుసహస్రమును హేమతాళవనంబునట్లు భేదించెను.
దప్పిక గొనియనులుండొకప్పుడా కార్తవీర్యుని భిక్షమడుగ నవ్వీరుడాయనకు పురములు గ్రామముల ఘోషములు, పల్లెలు – దేశములతోడి సప్తద్వీపములను భిక్షగనొసంగెను.
అగ్నియ వ్వినోద మరయం గోరి యన్నిటిని దహించివైచెను. కర్త్యావీర్యుని ప్రభావముచే నగ్ని యట్లు పర్వతములు వనములతో గూడ దహించెను.
వరుణ కుమారు డాపపుడను వానియాశ్రమముం గూడ కార్తవీర్యునితోగూడి మసిసేసెను. వరుణకుమారుడు తేజస్వియునుత్తముడునగు వశిష్ఠుడనువాడు. ఆముని ఆపవుడను ప్రఖ్యాతి నంచెను, అపవుడు కోపించిఅర్జునుని శపించెన.
ఓరీ!హైహయ ! నానివసించువనమునుగూడ విడువవైతివి. కావున నీ చేసిన దుష్కర్మమును మరొక్కడు నాశనము సేయగలడు.
రాముడనుపేరనతడు మహావీరుడు జమదగ్నికి కుమారుయుదయించి నీ వేయు బాహువులు నరికి యాబ్రాహ్మణతపస్యి నిన్ను సంహరింపగల డనెను ప్రతాపముతో శత్రుసంహారమోనర్చును ధర్మముతో ప్రజాపాలన మొనర్చుచున్న యే కార్తవీర్యునకు ద్రవ్యనాశనములేదో!
అకార్తవీర్యార్జునుడు మున్ను పొందిన వరములన్నియు నీరీతి ఫలించెను. ప్రబలుడైన వాని చేతిలో మరణము నతడు కోరుకొనెను. కోరినట్లు అపవమహాముని శాపమువలన పరశురామునిచేతిలో నతడువీరస్వర్గమందినాడు.
అ కార్తవీర్యునకు కుమారులు నూర్గురు. అందైదుగురు మిగిలిరి. వారు బలశాలురు, శూరులు, ధర్మవరులు, కీర్తిశాలురు శూరశేనుడు, శూరుడు, వృషణుడు, మధుపద్వజుడు, జయధ్వజుడు అనువారు.
జయధ్వజుడు అవంతీదేశము నేలిన వాడు, జయధ్వజుని తనయుడు తాలజంఘడు. వాని కుమారులు నూర్గురు ” తాలజంఘలు అను పేర బరగిరి.
మహానుభావులగు హెహయుల వంశమందు నీతిహోత్రులు, సువ్రతులు, భోజులు, అవంతులు, తౌండికేరులు, తాళజంఘులు ప్రసిద్ధులు, భరతులు, సుజాతులు మొదలగువారు పెక్కుమంది కావున పేర్కొన శక్యముగారు.
విప్రులారా ! వృషుడు మొదలయినవ యాదవులు పుణ్యాచరణపరాయణులు, వృషుడు మొదలయిన యాదవులు పుణ్యాచరణ పరాయణులు, వృషుడు, వంశధరుడు (మూలపురుషుడు), వాని కుమారుడు మధువు వానికి నూర్గురుకుమారులు, అందు వృషణుడు వంశకర్త. వాని సంతతి వృష్టులు, మధువను వాని సంతతి మాధవులైరి.
యదవుపేర యాదవులని హైహయులు పేరందిరి. కార్తవీర్యుని జన్మచరిత్రకధనము నిత్యముచేయువానికి విత్తనాశనము కలుగదు. పోయిన సొత్తుదొరుకును. బ్రాహ్మణులారా ! ఇవి యయాతి కుమారులయిదుగిరి వంశములు.
యయాతికుమారులయిదుగురు పంచభూతములవలె లోకములనుధరించినారు. కావున వారి చరిత్ర సంకీర్తనముచే పంచభూత జగత్తు చఠాచరాత్మక మిదియెల్ల ధరింపబడును.
ఉద్దరింపబడును. ఈ పంచవంశ విసర్గము విన్నరాజు ధర్మార్థ నిపుణుడు వశియును ( జితేంద్రియుడు) కాగలడు.
అయిదువరములందగలడు. అవి ఆయువు, కీర్తి, పుత్రులు, ఐశ్వర్యము, విభూతి, ఈ పవిత్రచరిత్ర. ధారణము వలన, శ్రవణము వలన, నీచెప్పిన ఫలము నిశ్చయమ. కోష్టువంశ మిక తెల్పెద.
వినుండు, యజ్ఞకర్త ధర్మాత్ముడు వంశధారకుడనగు యదుక్రోష్టుపుల వంశముల వృత్తాంతము సర్వపాపవిమోచకము. ఈ వృష్టివంశమునమందు శ్రీ మహావిష్ణువు శ్రీ కృష్ణ రూపమున నవతరించెను.
ఇది బ్రాహ్మమహాపురాణము నందు వంశాను కీర్తనమను పదమూడవ యధ్యాయము.

Leave a Reply

%d bloggers like this: