
Daily Horoscope 023/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
03, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
శుక్ల షష్టి
సౌమ్య వాసరే (బుధ వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది
వృషభం
ఈరోజు
ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబసభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి.
గణపతి ఆరాధన శ్రేయోదాయకం
మిధునం
ఈరోజు
మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి, తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీ రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త.
చంద్ర ధ్యానం శుభప్రదం
కర్కాటకం
ఈరోజు
కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
నవగ్రహ ఆరాధన శుభప్రదం
సింహం
ఈరోజు
మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు
కన్య
ఈరోజు
అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది.బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం
తుల
ఈరోజు
చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మనఃస్సౌఖ్యం ఉంది. బంధు,మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం
వృశ్చికం
ఈరోజు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలలో మార్పులు కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగచేస్తాయి.
లింగాష్టకం చదవండి, మంచి జరుగుతుంది
ధనుస్సు
ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.
ఇష్టదైవారాధన శుభప్రదం
మకరం
ఈరోజు
చేపట్టిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు.
ఆంజనేయ ఆరాధన చేయాలి
కుంభం
ఈరోజు
ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు.
శని ధ్యానం శుభప్రదం
మీనం
ఈరోజు
చేపట్టే కార్యక్రమాలలో పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
Panchangam
ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 3, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిథి: షష్ఠి రా1.51
వారం: సౌమ్యవాసరే
(బుధవారం)
నక్షత్రం: హస్త సా4.07
& చిత్ర
యోగం: సిద్ధం సా4.37
కరణం: కౌలువ మ2.09
&
తైతుల రా1.51
వర్జ్యం: రా12.05-1.40
దుర్ముహూర్తం: ఉ11 39-12.31
అమృతకాలం: ఉ10.02-11.39
రాహుకాలం: మ12.00-1.30
యమగండం: ఉ7.30-9.00
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: కన్య
సూర్యోదయం: 5.42
సూర్యాస్తమయం: 6.29