Home Bhakthi Sri Venkateswara Swamy Temple – Vadapally

Sri Venkateswara Swamy Temple – Vadapally

0
Sri Venkateswara Swamy Temple – Vadapally – శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం  : వాడపల్లి
 తిరుపతి, ద్వారకా తిరుమల క్షేత్రాల  తరువాత అత్యంత ప్రజాధరణ పొందిన వేంకటేశ్వర స్వామి  క్షేత్రం వాడపల్లి. గౌతమీ నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది.
కొద్ది దూరాలలోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున – లోల్లకు ఆనుకొని ఉండుటతో లోల్లవాడపల్లిగా పిలిచేవారు.  అదే నేడు వాడపల్లి గా మారింది. వాడపల్లి గ్రామాన్ని పూర్వం  ” నౌకాపురి ”  అని కూడా పిలిచేవారు.
ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా పిలుస్తారు. ఇక్కడ ఏడు వారాల శనివారం వ్రతం చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని చెబుతారు.
 అందువల్లే ఈ క్షేత్రంలో శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు..
ఇక్కడ గోదారమ్మ  రెండు పాయలుగా విడిపోయి ఒకటి వశిష్ఠ మరొకటి గౌతమి పాయలు గా పయనిస్తోంది.
పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయ నందు వాడపల్లి గ్రామంలో శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభూ వెలిసారు.
Sri Venkateswara Swamy Temple - Vadapally
Sri Venkateswara Swamy Temple – Vadapally
తూర్పుగోదావరి జిల్లా  కొనసీమలోని వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి స్వయంభు స్వయంభు.
కలియుగంలో 4 చోట్ల మాత్రమే వెంకన్న  స్వయంభూగా వెలిశారు.
ఒకటి తిరుమల తిరుపతి.
రెండవది ద్వారకాతిరుమల.
మూడు విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని ఉపమాక .
ఈ మూడు చోట్ల స్వామివారు రాతి విగ్రహ రూపంలో ఉంటారు.
నాలుగవది వాడపల్లి  ఇక్కడ స్వామివారి విగ్రహం ఎర్రచందనం లో ఉంటుంది .
అందుకే స్వామివారికి పంచామృత అభిషేకంలు చేయరు.
కర్పూర తైలంతో అభిషేకం చేస్తారు.ఇది ఇక్కడ మరో మహత్యం .
నది ఒడ్డున వెలసిన స్వామి వారిని నారద మహర్షి వారు కనుగొని  ‘‘వేం-కట’’ అని పేరు పెట్టిన పుణ్యక్షేత్రం ..వాడపల్లి .
నారదమహర్షి తన స్వహస్తాతో ఆ మూర్తికి ‘వేం’ అంటే ‘పాపాలను’ ‘కట’ అంటే పోగొట్టేవాడు అని నామకరణ చేసి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టింపజేస్తాడు.
అలా ఇక్కడ కొలువైన స్వామికి వేంకటేశ్వరుడిగా పేరు వచ్చింది. అటు పై అక్కడ ఉన్నవారంతా కలిసి అక్కడ ఆలయం నిర్మింపజేశారు.
గోదావరి నదిలో వరద ముంచెత్తడం వలన నారదుడు నిర్మించిన ఆలయం నది గర్భంలో కలిసిపోయింది.
ఆ రోజుల్లో పినుబోతు గజేంద్రుడు అను వారు కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు ఒకసారి పెద్ద తుఫాన్ సంభవించడంతో ఆ పడవలు అన్ని సముద్రంలో కలిసిపోగా ఆయన స్వామి వారిని వేడుకున్నాడు.
“స్వామి నా పడవలు సముద్ర గర్భం నుండి తీయిస్తే నిన్ను గోదావరి నది నుండి వెలికి తీసి నీకు ఆలయం నిర్మించి ప్రతిష్టిస్తాను”  అని అనగా ఆ మరుసటి రోజు నౌకలు అన్ని నది ఒడ్డుకి చేరడంతో అన్న మాట ప్రకారం స్వామి వారికి ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయంలో స్వామి వారికి కుడి వైపున వేణుగోపాల స్వామి వారు, ఉత్తరం వైపు అలివేలుమంగతయారు అమ్మవారు, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు వారు వారి శిష్యులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు మనకి.
2000 సంవత్సరం వరకు సామాన్యంగా భక్తులు వచ్చేవారు. వచ్చిన భక్తులు మళ్ళీ మళ్ళీ వచ్చే వారు.
అయితే 2000 సంవత్సరంలో ప్రతి శనివారం వచ్చే ఓ భక్తుడును చూసి ఆలయంలో పనిచేసే సూపరిండెంట్ రాధాకృష్ణ అతడిని ప్రతివారం ఎందుకు వస్తున్నారు అని ప్రశ్నించగా.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఓ సిద్ధాంతి ఉన్నారు…ఆయన దగ్గరికి వెడితే ఈతి బాధలు పోవడానికి  కోనసీమలో వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఏడు శనివారాలు దర్శించుకుని ,ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణలు చేయాలని చెప్పారని దానితో తన బాధలు తీరి పోవడంతో ప్రతివారం వస్తున్నట్లు వెల్లడించారు.
ఈ విషయం ఆ గ్రామస్తులు అందరికి తెలిసింది. గ్రామస్థులు కూడా ప్రతి శనివారం  ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామి దర్శనం చేసుకునేవారు. వారి కోరికలు నెరవేరాయి. దీంతో ఆనోటా ఈనోటా ప్రపంచవ్యాప్తంగా వాడపల్లి వెంకన్న మహత్యం అందరికీ తెలిసింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంగమాంబ నిత్యాన్నదాన భవనం లో ఎలా అన్నదానం నిర్వహిస్తారో అదే స్థాయిలో ఇక్కడ ఒకేసారి 15వేల మందికి అన్నదానం జరపడం విశేషం.
స్వామి వారి ఆలయం చెంతనే గోదావరి నది ఉంది. భక్తులు అక్కడ స్నానం చేసి ,మరి కొందరు అక్కడే తలనీలాలు సమర్పించి స్వామివారి ప్రదక్షిణ లో పాల్గొంటారు. ప్రదక్షిణలు పూర్తయ్యాక స్వామి దర్శనం చేసుకుని, అన్నదానం స్వీకరించి నిండుమనసుతో తిరిగి వెళతారు.
కొందరైతే శుక్రవారం సాయంత్రానికి అక్కడకు చేరుకుని ఆలయ ప్రాంగణంలో నిద్రపోయి తెల్లవారుజామునే లేచి గోదావరి స్నాన మాచరించి ప్రదక్షిణలు ప్రారంభిస్తారు.
ఏడు శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం.. ఏడేడు జన్మల పుణ్యఫలం అంటూ మార్మోగి పోవడంతో లక్షలాదిగా భక్తులు వాడపల్లికి వస్తున్నారు ఈ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల గా ప్రసిద్ధి గాంచింది.
ఆత్రేయపురం నుండి 6 కి.మీ దూరంలో ఉంటుంది ఈ గ్రామం.

Leave a Reply

%d bloggers like this: