
Sri Brahma puranam – 10 – శ్రీ బ్రహ్మపురాణం – 10
సోమ వంశ వర్ణనమ్
నూతు డిట్లనియె – ఓ మునిశ్రేష్ఠులారా ! బుధుని కుమారుడు పురూరవుడు. విద్వాంసుడు, తేజశ్శాలి. దాత. విపుల దక్షిణలిచ్చిన యజ్వ. బ్రహ్మవాదీ యుద్ధమునందు శత్రువునలకందని వాడు.
నిత్యాగ్నిహోత్రి-యజ్ఞకర్త. మహీపతి సత్యవాది. పుణ్యమతి, నిగూఢమైథనుడు, ముల్లోకములందు అనుపమ కీర్తిశాలి. అట్టివానిని బ్రహ్మవాదిని (వేదాధ్యయన రతుని) శాంతుని ధర్మజ్ఞుని సత్యవచనుని యశస్విని యగు ఊర్వశి అభిమానము (గుట్టు) విడిచి వరించెను.
బ్రాహ్మణులారా ! ఆ రాజు ఊర్వశితోగూడి చైత్ర రథమను సుందరవనమందు పదిసంవత్సరములు, మందాకినీ నదీ తీరముననైదు సంవత్సరములు, అలకాపురమందు ఆరుసంవత్సరములు, బదరీ పురమునందు అయిదు సంవత్సరములు, నందనవనమునం దేడు సంవ్సతరములు, మనోహర ఫలవృక్షములతో గూడిన ఉత్తర కురు దేశమునందెనిమిది సంవత్సరములు, గంధమాదన పర్వతముపై పది సంవత్సరములు సుమేరు పర్వతోత్తర భాగమున నెనిమిది సంవత్సరములు నివసించెను.
ఈ ప్రధాన వనములందును, దేవతల క్రీడా స్థానములందును, ఊర్వశితో గూడ నారాజు పరమ హర్షమున క్రీడిచెను. ఇలా పుత్రుడగు పురూరవుడు పవిత్ర తమము మహర్షులచే స్తుతింపబడినదియు నగు పృయాగక్షేత్రమునందు రాజ్యము నేలుచు మహాప్రభావశాలి యగు నరశ్రేష్ఠుడై యొప్పెను.
సూతుడిట్లనియె – ఆ ఇలుని (పురూరవుని) కుమారు లేడుగురు. దేవ కుమారోపములు, గంధర్వలోక ప్రసిద్దులు. ఆయువు ధీమంతుగు అమావసువు | ధర్మాత్ముడగు విశ్వాయివు – శ్రుతాయివు – దృఢాయువు-వనాయువు-బహ్వాయువు నసువారూర్వశికి జనించినారు.
అమావసుపుత్రుడు రాజరాజగు ఖీముడు. వాని కొడుకు శ్రీమంతుడగు కాంచనప్రభనామధేయుడు. వాని తనయుడగు సుహోత్రుడు బలశాలి, విద్వాంసుడు. వాని తనయుడు. జహ్నువు కేశిని కుమారుడు.
అతడు సర్పమేధమను మహాయాగమను, అచరించెను. గంగపతి లోభముచే నతని బతిగ వరించి యభి సరించెను. అతని యంగీకారము లభింప యజ్ఞ సదస్సును ముంచెత్తెను.
యజ్ఞవాటము నట్లు ముంచుట జూచి సుహోత్రుని కుమారుడు ఆ జహ్నువు క్రుద్ధుడై ” నీ జతనమిది విఫలమొనరింప నిదిగో నీ నీటినెల్ల ద్రావెదను.
నీ గర్వమునకు ఫలమిపుడే యనుభవింపుమని శపించి అతడెల్ల గంగను ద్రావివైచెను. అవ్వింతగని మహర్షు లాతనికి అభ్రాపగను గన్నకూతురి గావించిరి. దాన నామె జాహ్నవియయ్యె.
యువనాశ్వుని పుత్రియగు కావేరిని జహ్నుమహర్షి పరిణయమాడెను. యువనాశ్వుడిచ్చిన శాపముచే గంగలో నర్దాంశమయి ఏతెంచి జహ్ను భార్య, సరిద్వరయగు కావేరిలో కలసెను.
జహ్నుడు ధర్మపరుడయిన సునద్యుడను కుమారుని కావేరియందు బడెసెను. వాని కుమారుడు అజకుడు. వాని బిడ్డడు బలాకాశ్వుడనురాజు. మృగయా భిరక్తుడగు కుశుడు వాని కొడుకు.
వాని కుమారులు దేవ వర్చస్కులు నల్వురు. 1. కుశికుడు 2. కుశనాభుడు 3. కుశాంబుడు 4. మూర్తిమంతుడను వారు. వల్లవులతో నిరంతరము పెంపు వడసి వనచరుడై కుశికుడు ఇంద్రతుల్యుడైన కొమరునిం గోరి తపమెనరించెను.
అతనికి బెదరి వేయేండ్లు ముగియగా నుగ్ర తపమ్మున యాఱనింగని పుత్రునీయ సమర్థుండయ్యు తాన యాతనికి పుత్రుడాయెను. కుశికు పుత్రుడగు ఇంద్రుడే గాధియను రాజాయెను.
కుశికుని భార్య యగు పౌరయందు గాధిపుట్టెను. గాధి కుమార్తె సత్యవతి. మహానుభావురాలు. గాధిరాజామెను సక్రునిపుత్రుడగు బుచీకుని కిచ్చెను. అమె యెడగల ప్రీతిచే భార్గవుడు (బుచీకుడు) గాథికి (మామగారికి) కుమారుడు గలుగవలెనని యజ్ఞమున చరువును సాధించి యిచ్చెను.
బుచీకుడు తాన భార్య సత్యవతిబిల్చి ఈ చరువుగు నీవును మీ అమ్మయి స్వీకరింపుడు అమెయందు దీప్తిగల క్షత్రియోత్తము డుదయించును. క్షత్రియుల కతడజయ్యుడు క్షత్రియాంతకుడును కాగలడు.
కల్యాణీ ! నీవీ రెండవ చరువు సేవించినంతట ధృతమంతుడు తపోధనుడు శాంతడునైన ద్విజశ్రేష్ఠుడుదయించును. అని పలికి దపోనిరతుడై యరణ్యముం బ్రవేశించెను.
గాథియు నింతితో నప్పుడు బుచీకునాశ్రమమున కేగెను. తీర్థయాత్రా ప్రసంగమున కూతుం జూడ ఆ రాజు జామాతృన గృహంబున కేతెంచెను.
సత్యవతి యా రెండు చరువులను గైకొని తల్లికి నివేదించెను అ తల్లిదైవవశమున తాను దైకొనవలసిన చరువును కూతురునకిచ్చి అమెకీయదగినదానిని తాను గైకొనెను.
అటుపై సత్యవతి సర్వక్షత్రియాంతక తేజముం గర్భమున దాల్చిన కతన ఘోరమైన యాకారముతో గననయ్యెను. బుచీకుడా యింతింగాని యోగదృష్టిచే గ్రహించి ద్విజశ్రేష్ఠుండాతడు భార్యంగని కల్యాణీ ! చరువ్యత్యాసముచే మీ అమ్మచే నీవు వంచింపబడితివి.
నీకు క్రూరవర్తనుడు అతిదారుణుడు సగు తనయుడుదయించు వానికి భ్రాత బ్రహ్మణ్యుడు తపోధనుడు గల్గును.
తపస్సుచే నేనీ యెల్ల బ్రహ్మమునువాని యందర్పించితిని. అన విని సత్యవతి నీవలన నాకిట్టి క్రూరకర్ముడు బ్రాహ్మణావసదుడు కొడుకుగావలదనిన బుచీకముని యిట్లనియె.
కౌశికీతి సమాఖ్యాతా ప్రవృత్తేయం మహానదీ

బుచీకు డిట్లనియె:-
కల్యాణి ! నేనిట్లకావలయునని సంకల్పింపలేదు. పితృమాతృనిమిత్తమున దనయు డుగ్రమూర్తి కాగలడు. ఇది విని మరల సత్యవతి యిట్లనియె. నీవు, తలచిన లోకములను సృజింపగలవాడవు.
కొడుకునిచ్చు మాట తెక్కేమి శమాత్మకుని బుజుస్వభావుని పుత్రుని నాకనుగ్రహింపుము. ఇది వేరొక విధముగ జేయవలను పడటేని మనకుదయింపcగల మనుమడు మీరన్నట్లు క్రూరమూర్తియగునట్లనుగ్రహింపుడని భర్తను వేడుకొనెను.
అది విని యమ్ముని తపోబలమున నట్ల యగుగాక యనియనుగ్రహము సేసెను. మరియు సుందరి పుత్రునందును పౌత్రునందును నాకుభేదములేదు. నీవెట్లంటి పట్టేయగుట నాయభిమతమని యామెనా తపస్విలాలించెను.
అవ్వల సత్యవతి భార్గవునిం గుమారునిం గనెను. అతడే తపోనిరతు డతిదాంతుడు శాంతుడునగు జమదగ్ని ఈ భృగువంశముందవతరించెను. పుణ్యురాలు సత్యవతి సత్యధర్మపరాయణ కౌశికియను బేర మహానదియై ప్రవర్తిల్లె.
ఇక్ష్వాకువంశజుడు రేణువనురాజుకూతురు కామలి యనుపేరుగలది (రేణుక) మహానుభావురాలు. అమెయందు తపోవిద్యా సమన్వితుడు ఆర్చీకుడు (జమదగ్ని) భయంకరుడైన జామదగ్న్యుని (పరుశురాముని) గాంచెను. అతడు సర్వవిద్యాపారంగతుడు ధనుర్వేదవిశారదుడు క్షత్రియాంతకుడు ప్రజ్వలితాగ్నివోలె నుండెను.
పరశురాము డాజమదగ్ని తపోవీర్యమున జన్మించెను. మధ్యముడు శునశ్శేపుడు కనిష్టుడు శునఃపుచ్చుడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షిసముడై బ్రహ్మయు నయ్యెను. విశ్వరథుడనియు నాయనకుcబేరు.
విశ్వామిత్రుని కుమారులు దేవరాతుడు మొధలయినవారు. విఖ్యాతులు. దేవరాతుడు. కలి యాయనసంతతియే కాత్యాయనులు. శాలావతియందు హిరణ్యాక్షుడు రేణువు.
రేణుకుడు సాంకృతి గాలవుడు ముద్గలుడు. మధుచ్చందుడు జయుడు, దేవలుడు కచ్ఛపుడు, హారితుడు ననువారు జనించిరి. కౌశికులగోత్రములు ప్రఖ్యాతిచెందియున్నవి.
పాణినులు, బభ్రవులు, ధ్యానజప్యులు, దేవరాతులు, శాలంకాయనులు, బాష్కలులు, లోహితులు, యమదూతలు, కారూషకులు ననువారు కౌశికులు, పౌరవుడను బ్రహ్మర్షియొక్కయు కౌశికుని యొక్కయు వంశమందు బ్రహ్మక్షత్ర సంబంధము ప్రసిద్దమయ్యెను.
విశ్వామిత్రుని కొడుకులలో శునఃశేపుడు పెద్దవాడు. భార్గవుడు కొశికత్వముం బడసినవాడు. శునఃశేవుడు హరిదశ్వుని యజ్ఞమందు పశువుగా వినియుక్తుడయ్యె.
దేవతలాతనిం దిరిగి విశ్వామిత్రునకు క్షేమముగనిచ్చిరి. దేవతలచే నీయబడినవాడగుటచే దేవరాతుడనియు పేరొందె. దేవరాతాదులేడ్వురు విశ్వామిత్రుని కుమారులు.
దృషద్వతిసుతుడు అష్టకుడును వైశ్వామిత్రుడే అష్టక కుమారుడు లౌహి. జహ్నుమునిగణము నాచే చెప్ప బడినది ఇటుపైని అయువుయొక్క వంశమునుదెత్పెదను.
శ్రీ బ్రహ్మమహాపురాణమునందు సోమవంశములోఅమావసువంశాను కీర్తనమను పదియయవయధ్యాయము. సమాప్తము.