Daily Horoscope 28/07/2022

0
Daily Horoscope 28/07/2022
Daily Horoscope 15/08/2022 
Daily Horoscope 28/07/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
28, జూలై, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసము
కృష్ణ అమావాస్య
బృహస్పతి వాసరే (గురు వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 28/07/2022
Daily Horoscope 28/07/2022

రాశి ఫలాలు 

 మేషం

ఈరోజు
లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు.
శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం

 వృషభం 

ఈరోజు
మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం

 మిధునం

ఈరోజు
విఘ్నాలను తెలివిగా పరిష్కరిస్తారు. చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. దుష్టులను దరిచేరనీయకండి.
ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది

కర్కాటకం 

ఈరోజు
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.
శివనామాన్ని జపించండి

 సింహం

ఈరోజు
మీ మీ రంగంలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ బంధువుల ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
శ్రీహరిని  ఆరాధిస్తే మంచిది

 కన్య

ఈరోజు
చేపట్టిన  పనులలో  ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి.
శివారాధన శుభప్రదం

 తుల

ఈరోజు
పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి.
హనుమత్ ఆరాధన శుభప్రదం

వృశ్చికం

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది

 ధనుస్సు

ఈరోజు
మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అందరినీ కలుపుకొనిపోవడం ఉత్తమం.
శ్రీసూక్తం విన్నా, చదివినా మంచి ఫలితాలు సాధిస్తారు

 మకరం

ఈరోజు
గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి  సంబంధించిన  శుభవార్త వింటారు. ఒక శుభవార్త  మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మెప్పు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి

కుంభం

ఈరోజు
మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఒక వార్త  మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అనవసర  విషయాల్లో తలదూర్చరాదు.
నృసింహస్వామి ఆరాధన శుభప్రదం

 మీనం

ఈరోజు
బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ధన,ధాన్యవృద్ధి ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.
శివనామస్మరణ  శుభప్రదం

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః

జూలై 28, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
కృష్ణ పక్షం
తిథి:  అమావాస్య
రా10.04
వారం: బృహస్పతివాసరే
(గురువారం)
నక్షత్రం: పునర్వసు ఉ7.04
& పుష్యమి
యోగం: వజ్రం సా6.47
కరణం: చతుష్పాత్ ఉ 9.06
&
నాగవ రా10.04
వర్జ్యం: మ 3.54-5.39
దుర్ముహూర్తం: ఉ9.56-10.48
&
మ3.05-3.56
అమృతకాలం: ఉ6.11 వరకు
&
రా2.28 – 4.14
రాహుకాలం: మ1.30 – 3.00
యమగండం: ఉ6.00 – 7.30
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం: 5.40
సూర్యాస్తమయం: 6.31

Leave a Reply

%d bloggers like this: