Home Bhakthi Sri Brahma puranam – 8

Sri Brahma puranam – 8

0
Sri Brahma puranam – 8
Sri Brahma puranam - 12

ఆదిత్యవంశాను కీర్తనమ్‌

లోమ హర్షణుడిట్లనియె:- సత్యవ్రతుడు భక్తితో కృపతో పట్టుదలతో వినయముతో విశ్వామిత్రుని భార్యను భరించెను. మృగములవేటాడి తెచ్చిన మాంసము నమ్మునియాశ్రమసమీపమున చెట్టుకొమ్మకు వ్రేలాడగట్టెను. ఉపాంశువ్రతమూని (ఇంద్రియములను మనసును నిగ్రహించి-చేయువ్రతము) ద్వాదశవార్షిక దీక్షగొని తండ్రియాదేశమున నాదేశమందు వసించెను.
యజ్ఞకర్తలకు కులగురువులకుగల సంబంధము నమసరించి వశిష్ఠు డయోధ్యారాజ్యమును రాణివాసమును దానే బర్యవేక్షించెను. సత్యవ్రతుడు మాత్రమజ్ఞానమువలన భావిదైవ ఘటనమువలనను కులగురువగు వశిష్ఠునెడ నధికమైన క్రోధము వహించెను.
తండ్రి కుమారుని బహిష్కరించుతఱి వశిష్ఠుడు పెక్కుకారణములచే వలదనడయ్యె. పాణిగ్రహణ మంత్రములకు సప్తపదితో సమగ్రత యేర్పడును కావున సత్యవ్రతుడు సప్తపదిలో కన్య నపహరింపలేదు.
ఓ బ్రాహ్మణులారా ! వశిష్ఠుడా ధర్మ మెఱిగియు నన్ను రక్షించుటలేదని సత్యవ్రతుడు వసిష్ఠునిపై కోపముగొనెను.
వసిష్ఠ భగవానుడు గుణబుద్ధితోనే అట్లు చేసెను. కాని సత్యవ్రతుడు వానిని తటస్థునిగ తలంచెను. తండ్రియగు వసిష్ఠునకు కుమారుడగు సత్యవ్రతునిపై అసంతుష్ఠి కలిగెను.
ఆ కారణమున నారాజ్యామున నిద్రుడు పండ్రెండు సంవత్సరములు వర్షముల లేకుండజేసెను. అందులకు ప్రాయశ్చిత్తముగా సత్యవ్రతుడు ద్వాదశవార్షికమైన కఠోరదీక్షను బూనగలడని దానివలన నీకులమునకుగల కళంకము పోగలదని యెఱిగియే వశిష్ఠుడానాడు వనప్రవేశము వలదనడయ్యె.
మాంసము కరవై సత్యవ్రతుడవ్వల క్షుధాతురుడై క్రోధ మోహములచే మిక్కిలి శ్రమించి వశిష్ఠుని కామధేనువు హరించెను.
తాను వసించు దేశధర్మముననుసరించి యాటవికక్రూరవృత్తిచే దానిం జంపి యా మాంసమును విశ్వామిత్రుని కుమారులచేగూడ దినిపించెను. అదివిని వశిష్ఠుండతనియెడ కుపితుడై యిట్లనియె.
ఓరి క్రూరుడా ! ఇపుడుగురుధనమగు గోవునపహరించి సంహరించుట యామాంసమును ప్రోక్షింపకమే నారగించుటయను నీరెండు శంకువులను ( పాపములను) చేసియుండవేని తండ్రియెడ జేసిన నీమొదటి యపరాధమును నిస్సంశయముగా పోగొట్టియుండెడివాడను.
ఇప్పుడు మూడు శంకువులనుజేసి నీవు త్రిశంకు వైతివని వశిష్ఠమహర్షిపలికెను. అవ్వల దన కుటుంబ భరణము చేసినాడని ప్రీతుడై విశ్విమిత్రుండు వరమేదేని యడుగుమన నానృపకుమారుడు సశరీరస్వర్గమనుగ్రహింపుమని యాచించెను.
అనావృష్టి భయము పోయిసతరువాత విశ్వామిత్రుడు వానిం దండ్రి రాజ్యమున నభిషిక్తుజేసి సశరీసస్వర్గము కొఱుకు యజింపజేసెను. దేనతలు వశిష్ఠులుజూచుచుండగనే వాని నమ్ముని స్వర్గమెక్కించెను.
అతనిభార్య సత్యంధ కేకయ వంశజ. ఆమె పుణ్యాత్ముడగు హరిశ్చంద్రుడు కుమారుని గనెను. ఆ హరిశ్చంద్రుడు త్రైశంకవుడు (త్రిశంకుని కుమారుడు) అనుపేర ప్రఖ్యాతినంచెను.
రాజసూయముగావించి సమ్రాట్టు (చక్రవర్తి) అను యశమందెను. ఆయన పుత్రుడు రోహితుడు. అతని కొడుకు హరితుడు హరితుని కొడుకు చంచువు చంచువు పుత్రుడు విజయుడు.
అతడు సర్వంసహా(భూమి) విజేత. అందువలన నతడు విజయుడనబడెను. వాని కొడుకు రురుకుడు. ధర్మార్థకోవిదుడై నరాజు వానికొడుకు వృకుడు. వానికుమారుడు బాహువు.
హైహయులు-తాలంజఘులు నాఱ నింద్రోరాజనిరి. అతని భార్య గర్భవతియై ఔరుని యాశ్రమమందు జేరెను. బాహువు కుమారుడు సగరుడు. అతడును ధర్మపరుడు. సత్యనిష్ఠుడు.
కృతయుగము వాడు. తల్లికి సవతిపెట్టిన గరముతో (విషముతో)బాటు పుట్టినందున సగరుడని పేరొందెను. ఔర్వుని యాశ్రమమందు జనన సమయమున శుక్రుని రక్షణమొంది క్షేమముగా జన్మించెను.
ఆ భార్గవుని వలననే యాగ్నేయాస్త్రమునంది తాలజంఘులను – హైహయులను సంహరించిభూ మండల మెల్ల జయించెను. శక పహ్లవ పారదులను పేరంబరగిన క్షత్రియులయొక్క ధర్మమును (నాస్తిక ధర్మమును) ఖండించెను.
Sri Brahma puranam - 8
Sri Brahma puranam – 8

మునులనిరి:

సగరుడు విషముతోనెట్లు జనించెను. శకాదుల ధర్మములను క్రుద్ధుడైయేల నిరసించెను. ఈ కథ మాకు సవిస్తరముగ నానతిమ్మనిన లోమహర్షణుడిట్లనియె.
లోమహర్షణు డిట్లనియె – బాహువు వ్యసనియయినందున హైహయులు తాలజంఘులు శకులును నాతని రాజ్యము గాజేసిరి.
హైహయుని పక్షమున శకులు యవనులు, పారదులు, కాంబోజులు, పహ్లవులు నను నైదుగణములవారుకూడ చేరిరి. రాజ్యము పోయి బాహువు వనమున కేగెను. పత్నియు నతని వెంట జనెను. అతడక్కడ ప్రాణములు వాసెను.
అప్పటి కతని భార్య గర్భవతి. అమెకు సవతి గరము (విషము) పెట్టెను. వనమం దాసాధ్వి భర్తతో సహగమనము సేయుటకు జితి యెక్కెను. భృగువంశీయు జౌర్వుడు కరుణగొని యామెను నివారించెను.
అయనయాశ్రమమందా శిశువు గరముతోగూడ జన్మించెను. అందుచే సగరుడను పేరొందెను.
జౌర్వుడాతనిని వేదశాస్త్రబలముచే చదివించి ఆగ్నేయాస్త్రమందు శిక్షణమొసంగెను. క్రుద్ధుడైన రుద్రుడు పశువులం జంపునట్లాతడాగ్నేయాస్త్రబలముచే హైహయుల వధించి మంచిప్రతిష్ఠ వడసెను.
అవ్వల శక యవన కాంభోజ పారద పహ్లవులను నిశ్శేషముగా బరిమార్ప బూనెను. వారు వశిష్ఠుని శరణందిరి.
ఆయన వారి కభయమొసగి సగరుని వారించెను, గురువచన మాలించి యాతడు వారింగాక వారి ధర్మమును ఖండించి వారందరి వేషములను మార్చెను. అదెట్లన శకుల కర్థముండనము (సగము తల గొరుగుట) గావించి వదలెను.
యవన కాంభోజులకు సంపూర్ణముండనము గావించెను. పారదులను తల విరజోసికొన జేసెను. పహ్లవులకు గడ్డముల నుంచెను.
వారెల్లరను నిస్వాధ్యాయవషట్కారులం గావించెను (యజనయాజనాది వేదకర్మదూరులం జేసెనని భావము.) శకాదులు కోణిసర్పులు మహిషకులు దర్వులు, చోళులు, కేరళులు ననుపేర వారందరు క్షత్రియులే. కాని వారి ధర్మమాతనిచే నిరాకరింపబడినది. అనగా పెలివేయబడినారన్నమాట. ఇదంతయ వశిష్ఠునాజ్ఞచేతనే యాత డొనరించెను.
ధర్మముచే జయమందిన యా సగర చక్రవర్తి వసుంధరనెల్ల గెల్చి యశ్వమేధదీక్షగొని గుఱ్ఱమును వదలెను. అ గుఱ్ఱము తూర్పు దక్షిణ సముద్రప్రాంతతీరమున సంచరించుచుండగా నెవ్వనిచేతనో హరింపబడి భూమియందు బ్రవేశింపజేయబడెను.
అపుడా రాజు తన కొడుకు లఱువదివేలమందిచేత నీ భూమిని ద్రవ్వించెను. వారందఱు సముద్రముం జొచ్చి భూమింద్రవ్విపోయిపోయి ఆది పురుషుడగు హరిని కపిలరూపమున నున్న విష్ణువుం గాంచిరి.
అ సమయమున నాదేవుడు నిదురలో నుండెను. వారి రాకచే గల్గిన చప్పుడువలన నాతడు కనుదెఱచెను. అందుండి వెడలిన తేజస్సుచే నా సగరులు నల్గురు తరువాయిగా నఱువది వేలమందియు దగ్ధులైరి.
అ మిగిలిన సగంవంశవర్థములు బర్హికేతువు సుకేతువు భర్మరధుడు శూరుడైన పంచజనుడు ననువారు. భగవంతుడు కపిలుడు ఱనికి ఇక్ష్వాకువంశమక్షయముగ నుండునట్లును.
మంచికీర్తిమంతమగునట్లు వరము ననుగ్రహించె. సముద్రుని కుమారునిగ నిచ్చి అక్షయస్వర్గవాస సౌఖ్యమునుగూడ నొసంగెను. సముద్రుడా సగరుని కర్ఘ్యముం గొని వచ్చియిచ్చి నమస్కరించెను. ఆ పుణ్యకర్మ ప్రభావముచే సముద్రుడుసాగరుడు గూడ నయ్యెను.
(సగరుని కుమారుడను ప్రఖ్యాతి నంచెను) సగరచక్రవర్తి యన్యశ్వమేదాశ్వమును బడసి తిఱిగి వచ్చి నూఱశ్వమేధయాగము లాచరించెను. అతని కుమారులే సాగరులను ప్రఖ్యాతి నందిన వారఱువదివేలమందియని విన్నాము. అన విని మునులు సగరునికి వీరులగు కుమారు లఱువది వేలమంది యెట్లు కల్గిరి ? ఎట్లు విక్రమించిరో తెలుపుమన లోమహర్ణణుం డిట్లనియె.
లోమహర్షణుడిట్లనియె- సగరుని కిద్దరు భార్యలు. విదర్భదేశాధీశుని కూతురు కేశిని పెద్దభార్య. అరిష్టనేమి కూతురు మిక్కియందగత్తె మహతి యునునది రెండవది.
ఔర్వుడు వారింగని, అరువదివేలమంది కొడుకులు గావలెనో, వంశోద్ధారకుడైన కొడుకొక్కడు గావలెనో కోరుకొండని వరమొసంగె. ఒకతె అరువదివేలమంది కొడుకులను, మరొకతె యొక్క వంశధరుడగుపుత్రుని గోరిరి. అంతనమ్ముని యట్లే యగుగాక అనెను.
పంచజనుడను మహాతేజస్వియగురాజు ఒకతెకు గల్గెను. రెండవ యామె బీజపూర్ణమైన యొక తుంబుని (సొరకాయను) ప్రసవించెను ప్రసిద్ధి. అందునువ్వుగింజలంతవారు అరువదివేలమంది శిశువులండిరి.
సమయముననుసరించి సుఖముగ పెంపొందిరి. వారి నామె ఘృతపూర్ణకుంభముల నుంచెను. ఒక్కొక్కని పోషణమున కొక్కొక్కతె దాది నేర్పరచెను. పదినెలలో క్రమముగ నా శిశువులందుండి బయలుదేరి సగరునికి ప్రీతి వర్థనులైరి.
నారాయణ తేజస్సున బ్రవేశించిన యా మహానుభావులలో నొకడు పంచజనుడనువాడు రాజయ్యెను. అతని కుమారుడు వీర్యవంతుడగు నంశమంతుడు. అంశుమంతుని సుతుడు దిలీపుడు. ఖట్వాంగుడనుపేర నతడు సుప్రసిద్ధుడు.
ఈతడు స్వర్గమునుండి యీ లోకమునకు వచ్చి ముహూర్తకాలముండి బుద్ధితోను సత్యముతోను ముల్లోకముల నొక్కటి చేసెను. దిలీవుని దాయాది భగీరథుడు.
అతడు గంగ నవని కవతరింప జేసిన వాడు. ఆ గంగను సముద్రమందు గంగ సంగమింపజేసిన మహానుభావుడు. భగీరథుడు సరిచ్చ్రేష్టయైన గంగ నా విధముగా తన కూతురుగా చేసికొనెను. అందువలననే గంగ భాగీరతథి యయ్యెను.
భగీరథుని కుమారుడు శ్రుతుడు. అతని పుత్రుడు నాభాగుడు ఉత్తముడు. నాభాగుని పుత్రుడు అంబరీషుడు (నాభాగి) సింధుద్వీవుని కాతడు జనకుడు. సింధుద్వీవుని కొడుకు అయితాజిత్తు.
అతని కొడుకు అయుతాజిత్తు. అతని కొడుకు ఋతుపర్ణుడు. అక్షహృదయ మెరిగిన ప్రోడ. బలశాలి. నలునికి మిత్రము. ఋతుపర్ణుని కొడుకు ఆత్తపర్ణి. గొప్పకీర్తిమంతుడు. వాని కుమారుడు సుదాసుడు ఇంద్రుని స్నేహితుడు.
వాని బిడ్డడు సౌదాసుడు రాజై కల్మాష పాదుడు-మిత్రసహుడనియు పేరందెను. వాని కొడుకు సర్వకర్మ. వాని కుమారుడు అనరణ్యుడు. వానితనయుడు నిఘ్నుడు.
నిఘ్నని వలన అనమిత్రుడు రఘువు అని ఇద్దరు రాజశ్రేష్ఠులు గల్గిరి. అనమిత్రుని సుతుడు విద్వాంసుడు దువిదుహుడు. అవ్వాని కొడుకు దిలీపుడు. దిలీపుని కొడుకు వీరుడగు రఘవు. రఘువు రాముని ముత్తాత. ఇతడు మహాబలుడై అయోధ్యాపట్టణమున మహారాజుగ నుండెను.
అయన కొడుకు అజుడు. అయనకు దశరథు డుదయించెను. దశరథకుమారుడు రాముడు. రాముని కుమారుడు కుశుడు కుశనందనుడతిథి. అతని పుత్రుడు నిషధుడు. నిషధుని సుతుడు నలుడు.
నలాత్మజుడు నభుడు. నభుని బిడ్డడు పుండరీకుడు. వానికి క్షేమధన్వుడు, వానికి దేవానీకుడునుదయించిరి. దేవానీకునికొడుకు అహినగువు వాని కొడుకుసుధన్వుడు. వానికొడుకు శలుడు.
శల పుత్రుడుక్యుడు. ఉక్యుని కొడుకు వజ్రనాభుడు. వానికొడుకు నలుడు. పురాణములందు నలులిద్దరేఖ్యాతికెక్కినారు. ఒకడు వీరసేనుని కుమారుడు రెండవవాడు ఇక్ష్వాకువంశజుడు వీరు వివస్వతునివంశమందలి తేజస్సమృద్ధులైన రాజులు.
ప్రజలకు పోషకుడును శ్రాద్ధదేవుడును నగు అదిత్యుని యీ వంశవృత్తముపఠించునాతడు  సంతానవంతుడయి అదిత్యుని యొక్క సాయుజ్యము నందును.
శ్రీ బ్రహ్మపురాణమునందు ఆదిత్య వంశాను కీర్తనము ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Leave a Reply

%d bloggers like this: