Home Bhakthi Sri Balabalaji Temple – Appanapally

Sri Balabalaji Temple – Appanapally

0
Sri Balabalaji Temple – Appanapally
http://www.hindutemplesguide.com/2018/04/appanapalli-sri-bala-balaji-swamy-vari.html

 కోనసీమలో మరో తిరుపతి 

 భగవంతుడు తనని దర్శించడానికి వచ్చి ఇబ్బందులు పడుతున్న వారినే కాదు, చూడాలని ఉన్నా రాలేకపోయిన వారికోసం కూడా మరింత తాపత్రయపడుతుంటాడు. అవసరమైతే తన భక్తుల గ్రామాలకి తానే తరలిపోతుంటాడు.
అలా ఆ శ్రీనివాసుడు తన భక్తుడి కోసం తరలి వచ్చిన క్షేత్రమే ‘అప్పనపల్లి’.
చిలుకూరు ‘బాలాజీ’ తరువాత వేంకటేశ్వరస్వామి ఆ పేరుతో పిలువబడుతున్న పుణ్యక్షేత్రం ‘అప్పనపల్లి బాలాజీ’ దేవస్థానం.
తూర్పు గోదావరి జిల్లాలో గోదావరికి ఉపనది అయిన వశిష్ఠానదీ తీరాన ఈ అప్పనపల్లి గ్రామం ఉంది.
గతంలో ఈ నదీ తీరాన ఆశ్రమం నిర్మించుకుని చాలా మంది ఋషులు తపస్సు చేశారట.
అప్పన్న అనే ఋషి తపస్సు చేసిన ప్రదేశం అయినందున అప్పనపల్లిగా పిలువబడింది.
గోదావరి నదీ తీరాన ఉన్న అపన్నపల్లి గ్రామం సహజ ప్రకృతి సౌందర్యంతో విరాజిల్లుతూ కనిపిస్తుంది. కొబ్బరి, పనస, మామిడి తోటలు, ఒకవైపు సముద్రం, ప్రశాంతమైన, స్వచ్ఛమైన వాతావరణం కలిగిన పరిసరాలు.. యాత్రికులకు మానసికోల్లాసాన్నిస్తాయి.

 భక్తుని కలలో …

గ్రామంలో నివశించే మొల్లేటి రామస్వామి అనే భక్తుడు కొబ్బరి వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. 1966వ సంవత్సరంలో ఒక రోజు రామస్వామికి శ్రీ వేంకటేశ్వరస్వామి కలలో కనిపించి – “నా దర్శనం కోసం భక్తులు ఎంతో శ్రమకోర్చి తిరుమలకు వస్తున్నారు.
వారి సౌకర్యార్థం నేనిక్కడే, నీ కొబ్బరి దుకాణంలోనే తూర్పు దిక్కున వెలిశాను. ” అని చెప్పగా రామస్వామి ఉదయాన్నే నీ గ్రామస్తులకు ఈ విషయం చెప్పి వారిని వెంట తీసుకుని స్వామి వారు చెప్పిన ప్రదేశంలో, వెదకగా విగ్రహం లభించింది.
ఆ విధంగా వెలసిన భగవానుడు శ్రీ బాల బాలాజీగా భక్తుల చేత పిలువబడుతూ పూజలు అందుకుంటున్నాడు.
Sri Bala Balaji Temple - Appanapalli
Sri Bala Balaji Temple – Appanapalli
ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన ధ్వజ స్తంభం గురించి ఒక విశేషమైన కథ ప్రచా రంలో ఉంది.
ఈ ఆలయ నిర్మాణకర్త మొల్లే టి రామస్వామి, కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన చెట్టును కొన డానికి వెళ్ళినప్పుడు ధర విషయంలో తేడా వచ్చి కొనకుండా వెనుకకు తిరిగి రావటం జరిగింది.
తరువాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చి విచిత్రంగా ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదే చెట్టు అప్పనపల్లి తీరానికి చేరి ఉన్నదని, దానినే ధ్వజస్తంభ నిర్మాణానికి వాడారనీ చెపుతారు.
దీనిలో భాగంగా 1970 మార్చి18న శంకుస్థాపన చేశారు.
1991 జూలై 4న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయానికి మూలవిరాట్టును ఉచితంగా అందించింది.
ఈ ఆలయంలో పద్మావతి, ఆండాళ్‌ తాయార్‌, గరుడాళ్వార్‌ విగ్రహాలను పంచాహ్నిక ఆగమశాస్త్ర విధులతో  శ్రీమాన్‌ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి నూతన ఆలయంలో ప్రతిష్టించారు.
 అప్పటి నుంచి దేవస్థానం అభివృద్ధి చెందుతూ వచ్చింది.
ఈ ఆలయం ఎంతో కళాత్మకతను నింపుకున్న సుందర కట్టడం, గోపురం పైనా, గర్భాలయంలోను కనిపించే చిత్రాలు భక్తులను ఎంతగా ఆకట్టుకుంటాయి.
అప్పనపల్లి క్షేత్రం ఎంతో పవిత్రపుణ్యస్థలంగా కీర్తికెక్కింది.
భక్తులు తండోపతండాలుగా వచ్చి శ్రీ బాలబాలాజీ స్వామిని దర్శించుకుంటారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందింది.
నిత్య ధూపదీపనైవేద్యాలతో, సంకల్ప పూజా విధానాలతో ఇక్కడ స్వామివారు విరాజిల్లుతున్నారు.
ఈ పుణ్యక్షేత్రం పవిత్ర వశిష్టా గోదావరి తీరంలో వుండడంతో మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది.

Leave a Reply

%d bloggers like this: