Home Bhakthi Sri Puruhutika Kukkutesvara Kshetra – Pithapuram

Sri Puruhutika Kukkutesvara Kshetra – Pithapuram

0
Sri Puruhutika Kukkutesvara Kshetra – Pithapuram
Sri Puruhutika Kukkutesvara Kshetra - Pithapuram
Sri Puruhutika Kukkutesvara Kshetra – Pithapuram – అష్టాదశ శక్తిపీఠం… పిఠాపురం
శ్రీ పురూహుతికా కుక్కుటేశ్వర క్షేత్రం : పిఠాపురం
పరమేశ్వరుడు కోడిపుంజు రూపంలో వెలసిన కుక్కుటేశ్వర క్షేత్రం… అష్టాదశ శక్తి పీఠాల్లో పురుహూతికాదేవి కొలువైన తీర్థం…
ఇంద్రుడు నిర్మించిన ఐదు వైష్ణవ క్షేత్రాల్లో.. పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి.
దత్రాత్రేయుని ప్రధమ అవతారమైన శ్రీపాద వల్లభుడు జన్మించిన పుణ్యస్థలి… ఇన్ని విశిష్టతల సమాహారం పిఠాపురం. పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం.
దాక్షాయణీ దేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక ఆత్మాహుతికి పాల్పడినప్పుడు ఆమె శరీరంలోని భాగాలు దేశంలోని పలు ప్రాంతాల్లో పడ్డాయనేది పౌరాణిక గాథ.
పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం ఈ ప్రాంతంలో పడటం వల్ల ఈ పట్టణానికి పీఠికాపురంగా పేరొచ్చింది.
అదే క్రమంగా పిఠాపురంగా మారింది.
ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది.
Sri Puruhutika Kukkutesvara Kshetra - Pithapuram
Sri Puruhutika Kukkutesvara Kshetra – Pithapuram

స్థల పురాణం 

పూర్వకాలంలో గయాసూరుడనే రాక్షసుడు విష్ణువు కరుణ కోరుతూ తపస్సు చేశాడట. అతని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఈ పృధ్వి మండలం మీద ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల కన్నా తన దేహం పవిత్రమైనదిగా అనుగ్రహించమని వరం కోరాడట గయాసురుడు. అతని కోరికను విష్ణువును అనుగ్రహించాడట.
ఆ తర్వాత కాలంలో గయాసురుడు అనేక పుణ్యకార్యాలు నిర్వహించి ఇంద్రపదవి పొందాడు. దాంతో పదవీచ్యుతుడైన మహేంద్రుడు భూమ్మీదకు వచ్చి పదవికోసం బ్రహ్మవిష్ణుమహేశ్వరులను పూజిస్తూ పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడట.
అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమవగా ‘గయాసురుడు దర్మాత్ముడైనప్పటికి అతని అనుచరుల వల్ల అనేక అరాచకాలు ప్రబలుతున్నాయని తపోదాన యజ్ఞాదులు లేక దేవతలు బలహీనమవుతున్నారని వర్షాలు కురవక, పంటలు పండక మానవులు అనేక కష్టనష్టాలు పడుతున్నారని భూమి ఎడారిగా మారుతోందని కాబట్టి గయాసురుని వదించి లోకాన్ని రక్షించాలని కోరుకున్నాడట ఇంద్రుడు.
వరాన్ని నెరవేర్చేందుకు త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలు ధరించి గయాసురుని వద్దకు వెళ్లి విశ్వశాంతి కోసం తామో యజ్ఞం నిర్వహించ తలపెట్టామని గయాసురుని దేహమే అందుకు సరైన వేదికగా నిశ్చయించుకున్నామని చెప్పారు.
 అందుకు సంతోషంగా అంగీకరించాడు గయాసురుడు . కాని ఒక షరతు పెట్టారట త్రిమూర్తులు. యాగం ఏడురోజుల పాటు సాగుతుందని ఎట్టిపరిస్థితుల్లోను ఆలోగా లేవకూడదని లేస్తే యాగభంగం చేసినందుకు అతన్ని సంహరిస్తామని చెప్పారట.
అందుకు అంగీకరించాడట గయాసురుడు. యాగం మొదలైంది.  6 రోజులు ముగిసిపోయినా ఆ దానవుడు ఏ మాత్రం చలించకపోవడంతో దేవతలు ఆందోళన చెంది శివుని ప్రార్ధించారట.
అప్పుడు హరుడు ఏడో రోజు అర్ధరాత్రి దాటాక కోడిపుంజు రూపంలో వచ్చి కూత పెట్టాడట. తెల్లవారిందనుకుని గయాసురుడు లేవడంతో యాగభంగం అయింది. షరతు ప్రకారం అతన్ని సంహరించారట త్రిమూర్తులు.
విష్ణువు వరం ప్రకారం అతని దేహంలో తలభాగం శిరోగయ(బీహార్లో ) గానూ నాభిభాగం మద్యగయ(ఒరిస్సాలోని జాజ్ పూర్ )గానూ పాదభాగం పిఠాపురంలో పాదగయగానూ ప్రసిద్ధి పొంది ప్రముఖ క్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి.
 ఇక గయాసుర సంహారానికి కోడిపుంజుగా మారిన శివుడు ఇక్కడ కుక్కుటేశ్వరస్వామిగా స్వయంభువై వెలిశాడని పురాణ ప్రవచనం.
 ప్రదాన ఆలయానికి ఎదురుగా ఒక తటాకం కనిపిస్తోంది. దాన్ని పాదగయ అంటారు. అందులో స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని ప్రతీతి.

దత్తక్షేత్రం 

దత్తాత్రేయను హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు.  దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము “సమర్పించుకున్నారు” కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది.
ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు “ఆత్రేయ” అయింది. దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద వల్లభుడు జన్మించింది ఇక్కడేనన్నది పురాణ కథనం.
దేశవ్యాప్తంగా ఉన్న దత్తక్షేత్రాల్లో ఇక్కడి శ్రీపాదవల్ల క్షేత్రం మిక్కిలి విశిష్టమైనదిగా చెబుతారు దత్తభక్తులు.
పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వరస్వామి సన్నిధిలో కొలువైన అమ్మవారికి నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి. ఆదిశక్తి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందన్న నమ్మకంతో ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
పురూహుతికా శక్తిపీఠంలో ప్రతి శుక్రవారం రోజూ, పర్వదినాల్లోనూ కుంకుమార్చనలను విశిష్టంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారు జుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రోజూ శత చండీయాగాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి దీక్ష చేపట్టిన భక్తులు తొమ్మిది రోజులపాటు ఈ క్షేత్రంలో పూజలు చేస్తారు.

Leave a Reply

%d bloggers like this: