Home Bhakthi Sakambhari Story -Mahatya…!!

Sakambhari Story -Mahatya…!!

0
Sakambhari Story -Mahatya…!!
Sakambhari Story -Mahatya...!!
ఇతి సంప్రార్థితా దేవీ భువనేశీ మహేశ్వరీ |
అనంతాక్షి మయం రూపం దర్శయామాసపార్వతీ ||
! నీలానజన సమప్రఖ్యాం నీలపద్మాయతేక్షణం సుక కర్ష సమోత్తుంగ వృత పీన ఘనస్థనం ||
ఈ ఆఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి,  నిరాకార రూపిణి, త్రిగుణాత్మికా, సచ్చిదానంద స్వరూపిణి, సమస్త లోకాలను కేవలం తన సంకల్ప మాత్రంచేత సృజించగలిగిన శక్తిస్వరూపిణి, అయిన ఆ జగజ్జనని
 కాటుకరంగును పోలిన నల్లని వర్ణంతో, దివ్యప్రభలను విరజిమ్మే తేజస్సుతో, నీలి పద్మాలవంటి విశాలమైన కన్నులు శరీరమంతా కలిగినదై, అనంతమైన అక్షములతో (కన్నులతో), లోకాలనన్నిటినీ పోషించే పెద్ద వక్షోజములతో మూర్తీ భవించింది
బాణముష్టించ కమలం పుష్పపల్లవ మూలకాన్ |
శాకాదీన్ ఫల సమా యుక్తాన్ అనంతరస సమ్యుతాన్ ||
క్షుత్ తృష్ణ జరాపహ హస్తైర్బిభృతిచ మహాధనుః |
సర్వసౌందర్య సారం తద్రూపం లావణ్యశోభితం ||
ఒక చేతితో బాణం, రెండవ చేతితో కమలం పట్టుకుంది, మూడవచేతితో సారవంతమైనవి, తినగానే పుష్టినిచ్చేవి,
ఆకలిని తీర్చేవి, బలహీనతలను నశింపజేసేవైన పుష్పములు (పువ్వులు), మొలకలు, కందమూలాలు, కూరగాయలు, ఆకుకూరలు,
 రసము కలిగిన పండ్లు ధరించింది. నాల్గవ చేతితో ఒక మహాధనస్సును ధరించి కనిపించింది. ప్రపంచంలో ఉన్న అందమంతా ఒక చోట చేర్చిన సరితూగని మహాసౌందర్యంతో,
 అన్ని రకాల సౌందర్యాలను కలబోసిందా అన్నట్టుగా సర్వ సౌందర్యరాశియై, ప్రేమ, కరుణ మొదలైన గుణాలను వ్యక్తపరుస్తూ సర్వజీవులను సమ్మోహ పరుస్తున్నట్టుగా ఉన్నది
ఆ దేవి యొక్క దివ్య స్వరూపం. అది జగన్మోహన స్వరూపం. ఆ రూప సందర్శనమే కామవాంఛలను పటాపంచలు చేస్తుంది.
Sakambhari Story -Mahatya...!!
Sakambhari Story -Mahatya…!!

    శాకంబరిదేవి కధ..

శాకంబరిదేవి కధ చాలా రహస్యమైనది.
దేవి పురాణంలొని 28వ సర్గలొ ఉన్న ఈ కధ మహా మహిమాన్వితమైనది.
ఈ కధను చాల నమ్మకంతొనే వినాలని,ఎవరికి పడితే వారికి చెప్పకూడదని,అవతలి వాళ్ళ శ్రద్దను గమనించి మాత్రమే చెప్పాలని నియమం.
శాకంబరి అనగా శాకములను ధరించినది/కలిగినది అని. శాకములు అంటేకూరగాయలు.
అలాగే శాకములకు ప్రాణశక్తిని ఇచ్చేది,శాకములకు మూలమైనది అని.బరి అనగా వేరు అని.శాకంబరి అనగా పచ్చదనానికి ప్రతీక.
పచ్చటి ప్రకృతి ఆమె యొక్క సాకార రూపం.ఈ కధ వేదవ్యాస మహర్షిచే చెప్పబడింది.వేదవ్యాస మహర్షి విష్నుస్వరూపం చిరంజీవి.
ఇప్పటికి బద్రి(ఒకనాటి బదరికాశ్రమం)లొ సశరీరంతొ ఉన్నారు,పుణ్యాత్ములకు చాలా అరుదుగా దర్శనమిస్తారు.
అపరశివావతారం శ్రీ ఆది శంకరచార్యలకు కాశిలొ దర్శనమిచ్చి,వాదించి,వారి జీవితకాలాన్ని 16 నుండి 32 సంవత్సరములకు పెంచిన మహ పురుషుడు.
శక్తి మహర్షి మనుమడు,పరాశర మహర్షి కూమారుడు. ఘనరూపమైన వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి,వ్యాసంగా ఉన్న వేదాన్ని విభజించాడు
కనుక వేదవ్యాసుడని పేరు తెచ్చుకొని,అనేకానేక ఉపనిషత్తులు వ్రాసి,18 మహా పురణాలు,ఉపపురణాలు రచించారు.
మహభారత కావ్యాన్ని చెప్తూ వినయకుని చేత వ్రాయించిన మహానుభవుడు.
సనాతన హిందూ ధర్మానికి మూలస్తంభాలు అయిన భగవద్గీత,బ్రహ్మ సూత్రాలు,కర్మ సిద్ధాంతం(ప్రస్తానత్రయం)న్ని మనకు అందించిన వారు.
కేవలం హిందూ ధర్మంలొనేగాక బౌద్ధము,సిక్కులకు కూడా పుజ్యనీయుడైన వ్యాసుడు ఒక బెస్త(చేపలు పట్టెవల్లు)స్త్రీకి జన్మించారు.
ఒకనాడు దుర్గమాసురుడనె ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని కొసం కొన్ని వందల సంవత్సరాల తపస్సు చేశాడు.
బ్రహ్మ ప్రీతిపొంది ప్రత్యక్షం అయ్యి వరం కోరుకోమనగా వేదాలను అందరు మర్చిపొవాలని,వేద జ్ఞానం అంతా తనకే రావలని వరం అడిగాడు.
సరే అన్నాడు బ్రహ్మ ఇల చెయ్యడం మూలంగా దేవతలను ఓడించాలని వాడి ఆలొచన.
అతి తక్కువ కాలంలొనే అందరు వేదాలను మర్చిపొయారు.
“వేదొఖిలం మూలం జగత్”అని వాక్యం.అంటే వేదమే అన్నిటికి మూలమని.అందువల్ల నాలుగు వర్ణలా వారు వారి వారి పనులు మర్చిపొయారు.
వ్యవసాయం చేయ్యట్లేదు,దేశ రక్షణ,వ్యాపరం,పూజాలు,మంత్రాలది కూడా అదే పరిస్థితి.దుర్గమాసుర సైన్యం విజృంబించింది.
యగ్నయాగాదులు లేక దేవతలకు హవిస్సు లేదు,తత్ఫలితంగా వర్షాలు కురవడంలేదు.ప్రపంచమంత కరువు సంభవించింది.
మృత్యుదేవత విలయతాండవం చేస్తొంది.పశుపక్షాదులు,వృక్ష సంపద నాశనం అవ్వడం పరిపాటే అయ్యింది.
దేవతల శక్తి క్షీణించడం జరిగింది.
దుర్గమాసురుడు ఇంద్రపదవిని లాక్కుని,స్వర్గాన్ని ఆక్రమించాడు.
ప్రజలబాధను తీర్చలేక క్షత్రియులు రాజ్యాన్ని వదిలేశారు.లొకమంతట హాహాకారలు మిన్నంటాయి.
అది చూసిన ఋషులు చలించిపొయారు.ఋషులు,మునులు,తాపసులు,సిద్ధులు అందరు జీవకోటి ఆకలి తీర్చాలని ఉన్న తమకు ఏమి గుర్తురాక బాధపడ్డారు.
చివరకు ఋషులు అందరు “సుమేరు పర్వతం”గుహలలోకి వెళ్ళి ఆ జగన్మాతను “అమ్మా!అమ్మా!” వేడుకున్నారు.వారి పలుకులను ఆ తల్లి విని వారి ఎదుట ప్రత్యక్షం అయ్యింది.
నీలివర్ణంతొ అనేకమైన కళ్ళతో “శతాక్షి”అనే నామంతొ చతుర్భుజములుతొ కనిపించింది.
ధనుర్బణాలతొ ఉన్న ఆ తల్లి ఈ దుర్గతిని చూసి 9 రోజులపాటు కన్నుల నీరు కారుస్తూ ఏడ్వసాగింది.ఆమె కన్నిటితొ ఈ అన్ని నదులు నిండిపొయాయి.
ఇక వారి దుస్థితిని చూడలేక అమ్మె శాకంబరిగా అవతరించింది.అమ్మ శరీరభాగాలుగా కూరలను,పండ్లను,గింజలను,గడ్డి మొదలైనవి ఉండగా,
తన శరీరభాగలను(శాకములను) అన్ని జీవాలకు …ప్రజలకు ఆకలి వెంటనే తీర్చటానికి, అమ్మవారు అమితమైన దయతో  శాకంబరి మాతగా వివిధమైన కాయగూరలు పళ్ళతో సహా ఒక పెద్ద చెట్టు లాగా దర్శనమిచ్చింది.
 ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్నా ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు.
ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే  ఈ శాకంబరి అవతారం.
 పార్వతీ దేవి దుర్గగా, తన నుండి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో దుర్గమాసురునితో, రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది.
 తదనంతరం దేవతలు, బ్రాహ్మణులు తిరిగి వేద పఠనం కొనసాగించారు.అప్పటి నుండి ఆషాడ ద్వాదశి నుండి 10 రోజులు వరకు అమ్మవార్లకు అన్ని రకముల పండ్లు , కూరగాయలు , ఆకు కురాలతో శాంకబరి అలంకారాలతో పూజలు చెయ్యడం ఆనవాయితీగా వస్తుంది..స్వస్తి…

Leave a Reply

%d bloggers like this: