Daily Horoscope 23/06/2022

0
Daily Horoscope 23/06/2022
Daily Horoscope 28/06/2022
Daily Horoscope 23/06/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
23, జూన్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసము
కృష్ణ దశమి
బృహస్పతి వాసరే (గురు వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 23/06/2022
Daily Horoscope 23/06/2022

రాశి ఫలాలు 

 మేషం

ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో అనుకూలత కలదు.
గోసేవ చేయడం మంచిది

 వృషభం 

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం

 మిధునం

ఈరోజు
మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు.
ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది

కర్కాటకం 

ఈరోజు
కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి,వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంది. లక్ష్మీస్తుతి శ్రేయస్కరం

 సింహం

ఈరోజు
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది.
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది

 కన్య

ఈరోజు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.
విష్ణు నామస్మరణ శుభప్రదం

 తుల

ఈరోజు
ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. చెడు పైకి మనస్సు మళ్లకుండా జాగ్రత్తపడాలి.
దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది

 వృశ్చికం

ఈరోజు
శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ  వ్యయం ఉంటుంది.
దైవారాధన మానవద్దు

ధనుస్సు

ఈరోజు
మీదైన రంగంలో శ్రమ ఫలిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావొచ్చు.  ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది.

 మకరం

ఈరోజు
బాగా కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం

 కుంభం

ఈరోజు
మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్రహావేశాలకు పోవద్దు. తోటివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు.
శని ధ్యానం చేయాలి

 మీనం

ఈరోజు
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు.
శ్రీవేంకటేశ్వర సందర్శనం ఉత్తమం

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
జూన్ 23, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
కృష్ణ పక్షం
తిథి: దశమి రా12.43
వారం: బృహస్పతి వాసరే
(గురువారం)
నక్షత్రం: రేవతి ఉ10.13
యోగం: శోభన ఉ9.15
కరణం: వణిజ మ12.48
&
భద్ర రా12.43
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ9.50-10.43
&
మ3.04-3.56
అమృతకాలం: ఉ7.47-9.25
&
తె3.33-5.12
రాహుకాలం: మ1.30-3.00
యమగండం: ఉ6.00-7.30
సూర్యరాశి: మిథునం
చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 5.30
సూర్యాస్తమయం: 6.33

Leave a Reply

%d bloggers like this: