Daily Horoscope 22/06/2022

0
Daily Horoscope 22/06/2022
Daily Horoscope 28/06/2022

Daily Horoscope 22/06/2022

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

22, జూన్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసము
కృష్ణ నవమి
సౌమ్య వాసరే (బుధ వారం)

శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll

Daily Horoscope 22/06/2022
Daily Horoscope 22/06/2022

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు చేపట్టే పనుల్లో ఓర్పు,సహనం,పట్టుదల అవసరం. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం

 వృషభం

ఈరోజు వృత్తి,ఉద్యోగాల్లో తోటివారి ప్రోత్సాహంతో అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదలతో ముందుకు సాగుతారు. అధికారులను మెప్పించడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఇష్ట దైవారాధన శుభప్రదం

 మిధునం

ఈరోజు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం

 కర్కాటకం

ఈరోజు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్నవిషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది

 సింహం

ఈరోజు చిత్తశుద్ధితో పనులను ప్రారంభిస్తారు. ధర్మ కార్యక్రమాలను చేపడతారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం

 కన్య

ఈరోజు కీలక వ్యవహారంలో తోటివారి ఆలోచనల వల్ల మంచి జరుగుతుంది. ధర్మసిద్ధి కలదు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది, కాబట్టి వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. లక్ష్మీదేవి సందర్శనం మంచిది

 తుల

ఈరోజు అనుకూలమైన సమయం. బంధు,మిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధగా పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుందరకాండ పారాయణ శుభప్రదం

 వృశ్చికం

ఈరోజు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో తోటివారి సూచనలు తీసుకోవడం మంచిది. కుటుంబ సహకారం ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం

 ధనుస్సు

ఈరోజు దైవబలం అనుకూలిస్తోంది. ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. రుణసమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన శుభాలను చేకూరుస్తుంది

 మకరం

ఈరోజు అనుకూలమైన సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. దైవారాధన మానవద్దు

 కుంభం

ఈరోజు ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తోటివారి సహకారంతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది

 మీనం

ఈరోజు మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఒక వ్యవహారంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
జూన్ 22, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
కృష్ణ పక్షం
తిథి: నవమి రా12.53
వారం: సౌమ్యవాసరే
(బుధవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ9.57
యోగం: సౌభాగ్యం ఉ10.38
కరణం: తైతుల మ1.13
&
గరజి రా12.53
వర్జ్యం: రా10.05-11.42
దుర్ముహూర్తం: ఉ11.35-12.27
అమృతకాలం: ఉ6.47 వరకు
రాహుకాలం: మ12.00-1.30
యమగండం: ఉ7.30-9.00
సూర్యరాశి: మిథునం
చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 5.30
సూర్యాస్తమయం: 6.33

Leave a Reply

%d bloggers like this: