Home Bhakthi Ardhanareeswarar Temple – Virupakshapuram :

Ardhanareeswarar Temple – Virupakshapuram :

0
Ardhanareeswarar Temple – Virupakshapuram :
Ardhanareeswarar Temple - Virupakshapuram
Ardhanareeswarar Temple – Virupakshapuram – విరుపాక్షపురం –  అర్ధనారీశ్వర దేవాలయం :  విరూపాక్షపురం –
 శ్రీకాళహస్తి తాలూకా తొట్టంబేడు మండలంలో, సువర్ణముఖినదీ తీరాన విరూపాక్షపురమనే గ్రామంలో ప్రాచీనమైన ‘అర్ధనారీశ్వరస్వామి’ దేవాలయం వెలసి ఉంది.
శివుని అర్ధనారీశ్వరునిగా ఆలయ గోడలపైన, విమానం మీద చూపడం కలదుగాని, మూలవిరాట్టు అయిన లింగమే అర్ధనారీశ్వరుడి రూపంలో వెలయడం అపూర్వం. పురాణాలలో ఈ ఆలయాన్ని ‘పాపివిచ్చేద క్షేత్రం’ అని పేర్కొన్నారు.
ద్వాపర యుగంలో అవంతీ నగరానికి చెందిన ‘విజయ’ మరియు ‘సుభగ ‘ గా అనే పురాణ దంపతులు ఈ స్వామిని సేవించి తరించడం మూలాన, ఈ స్వామిని ‘సుబగాంబ సమేత శ్రీ విజయేశ్వరస్వామి’ అని పేర్కొంటున్నారు. శివపురాణంలో  ‘శ్రీ విజయసగమాంబల’ చరిత్ర ఇది.
ఉత్తరదేశంలోని ఆర్యావర్తంలోని అవంతీనగరంలో అందమైన యువ దంపతులు నివసించేవారు. వారు విజయ సుభగలు.
బాల్యం నుంచి విజయునికి పరమేశ్వరునిపై ఎనలేని భక్తి ఉండేది. అతను పిన్నవయస్సులోనే ఇంద్రియ విగ్రహాన్ని కలిగి దైవాన్ని దర్శించాలని నిశ్చయించుకొన్నాడు.
 శ్రీకాళహస్తికి భార్యాసమేతంగా వచ్చి, విజయుడు చిన్న పర్ణశాలలో నివసిస్తూ రోజు సువర్ణముఖిలో స్నానం చేసి నుదుట విభూది రేఖలు, మేడలో రుద్రాక్షలు ధరించి ఆలయానికి వెళ్ళి, దీక్షతో స్వామిని సేవిస్తూ ఉండేవాడు.
ఒకరోజు విజయుడు స్వామి ధ్యానంలో సాయంకాలం వరకు ఆలయముందే గడిపి ఇంటికి వచ్చాడు. అతడి భార్య సుభగ భర్తకు ఇష్టమైన  వంటలు చేసి, అతడి చేత తినిపించింది.
Ardhanareeswarar Temple - Virupakshapuram
Ardhanareeswarar Temple – Virupakshapuram
భుక్తాయాసంతో విజయుడు మేను వాల్చగానే, సుభగ పూర్తిగా అలంకరించుకొని భర్తను చేరింది. భార్య కోరేదేమిటో అతడికి అర్థం కాలేదు. యుక్తవయసులో ఉన్న భార్య చనుకట్టు విజయునికి రెండు బంగారు శివలింగాలుగా కనబడసాగినాయి.
భార్య పడక పక్కనే ఉంచిన పూలు, సుగంధ ద్రవ్యాలు ఆ చనులపై జల్లి, వాటిని శివలింగాలుగా భ్రమించి రాత్రంతా పూజించసాగాడు సుభగ, భర్త తన కోర్కె తీర్చలేదని బాధపడింది.
తెల్లవారగానే విజయుడు లేచి యథావిధిగా ఆలయానికి వెళుతూ రాత్రి తన ఇంటిలో ఎలా రెండు శివలింగాలు వెలిసినాయి? అది సాధ్యమేనా! అని ఆలోచిస్తూ తన భార్య శారీరక సుఖాన్ని ఆశించి తన్ను మభ్య పెట్టినందువల్లే ఈ విధంగా జరిగి ఉంటుందని, ఇక తాను ఇంట్లోనే ఉంటే తన ధ్యేయం వృథా అయిపోతుందేమో! అయినా చిన్న వయసులో ఉన్న భార్యను ఎలా వదిలిపెట్టి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఏమీ నిర్ణయించుకోలేకపోయాడు.
యథావిధిగా ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి మౌనంగా నిద్రించాడు. నిద్రలో పరమేశ్వరుడు కనబడి శ్రీకాళహస్తికి ఉత్తరంగా సువర్ణముఖి నదీ తీరాన యుగాలకు పూర్వం నుంచే దేవతలు, ఋషులు మొదలగు వారి చేత పూజలందుకుంటూన్న అర్ధనారీశ్వరుని సేవించి తరించమన్నాడు.
మరునాడు విజయుడు వేకువజామునే లేచి భార్యను, ఇంటిని వదిలి వంటరిగా స్వామి సెలవిచ్చినట్లు సువర్ణముఖీ నది గట్టు వెంటే నడిచి వెళ్ళి అర్థనారీశ్వర స్వామి వెలసి యున్న ‘పాపవిచ్చెద క్షేత్రం’ చేరి స్వామిని నిష్టతో కొలువసాగాడు.
పొద్దున లేచి చూస్తే భర్త జాడ లేదు. భర్త కనిపించక పోవడంతో సుభగ తన వల్లనే పరమపవిత్రుడైన తన భర్త ఇల్లు వదిలి వెళ్ళినాడని, అతడి అడుగు జాడలలోనే నడిచి స్వామిలో లీనమై పోవాలని నిశ్చయించుకొని కొంతమంది యోగుల ద్వారా శివపూజా విధానాన్ని తెలుసుకొని రోజు బంకమట్టితో 108 శివలింగాలు చేసి ఎంతో భక్తితో ఆ స్వామిని పూజించసాగింది.
ఆమె కళ్ళ ఎదుట జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళ హస్తీశ్వరుడు ప్రత్యక్షమై ఆమె కోరిక మేరకు ఆమెను తమలో విలీనం చేసుకొన్నారు.
విజయుడు పాపవిచ్చేద క్షేత్రంలో నిద్రాహారాలు మాని స్వామి ధాన్యంలోనే మునిగిపోయాడు. హరుడు అతడిని కూడా పరీక్షింపనెంచి
 శ్రావణమాసం, పూర్ణిమ రోజున శ్రీకాళహస్తీశ్వరుడు దేవీ సమేతంగా విజయునికి ప్రత్యక్షమైనాడు.
ఈ రోజు నుంచి ‘సుబగాంబ సమేత శ్రీ విజయేశ్వరస్వామి’ అని మీ దంపతుల పేరున పిలువబడుతూ భక్తుల కోర్కెలు తీర్చేదని చెప్పి ఇచట యజ్ఞము, దానము, తపస్సు చేసిన వారికి శ్రీ కాళహస్తీశ్వరుని సన్నిధిలో యజ్ఞ, దాన, తపఃఫలితాలతో సమానమైన ఫలితం దక్కుతుందని దీవించి విజయుణ్ణి కూడా తనలో లీనం చేసుకొన్నాడు.

 ఆలయ సౌందర్యం :

అర్థనారీశ్వర దేవాలయం లో గర్భగృహం, అంతరాళం, ముఖ మండపాలున్నాయి. గర్భాలయంలో ‘సుబగాంబ సమేత శ్రీ విజయేశ్వరస్వామి’ పేర స్వయం భూలింగం ఉంది.
ఈ లింగం రెండు ముఖాలను కలిగి ఉంది. శివుని భాగంగా భావించబడుతూ ఉన్న పక్షం తెల్లగా మంచు వలే ఉండగా, దేవి భాగం పసుపు రంగును కలిగి ఉంది.
ఈ అర్థనారీశ్వర స్వామిని భక్తులు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లాంటి ప్రత్యేక సందర్భాల్లో,  శుక్ర, సోమవారాల్లో, ఏకాదశి, కృత్తిక, శివరాత్రి పర్వదినాల్లో విశేషంగా పూజించి తరిస్తారు.

Leave a Reply

%d bloggers like this: