Home PANCHANGAM Daily Horoscope 21/05/2022 :

Daily Horoscope 21/05/2022 :

0
Daily Horoscope 21/05/2022 :
Daily Horoscope 27/06/2022

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

21, మే, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
వసంత ఋతువు
వైశాఖ మాసము
కృష్ట షష్ఠి
స్థిర వాసరే (శని వారం)

శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll

Daily Horoscope 21/05/2022
Daily Horoscope 21/05/2022

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మనఃస్సౌఖ్యం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగినట్టుగా వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.
శివ నామస్మరణ ఉత్తమం

 వృషభం

ఈరోజు
కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు.
ఈశ్వర సందర్శనం శుభప్రదం

 మిధునం

ఈరోజు
మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.
చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది

 కర్కాటకం

ఈరోజు
కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు.
శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం

 సింహం

ఈరోజు
మంచి పనులు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం

 కన్య

ఈరోజు
కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి.
శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది

 తుల

ఈరోజు
ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.
శివారాధన మంచిది

 వృశ్చికం

ఈరోజు
అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.
ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది

 ధనుస్సు

ఈరోజు
పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
ఈశ్వరారాధన శుభప్రదం

 మకరం

ఈరోజు
ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.
లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం

కుంభం

ఈరోజు
మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టనివారితో మితభాషణం అవసరం. స్థానచలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి.
ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం

 మీనం

ఈరోజు
శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం.
ఇష్టదైవారాధన మంచిది

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
మే 21, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
కృష్ణ పక్షం
తిథి: షష్ఠి రా8.08
& సప్తమి
వారం: శనివారం
(స్థిరవాసరే)
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ6.14
& శ్రవణం తె4.5
యోగం: శుక్లం మ1.09
&
బ్రహ్మం
కరణం: గరజి ఉ9.16
&
వణిజ రా8.08
వర్జ్యం: ఉ10.00 – 11.30
దుర్ముహూర్తం: ఉ5.30 – 7.12
అమృతకాలం: రా7.02 – 8.33
రాహుకాలం: ఉ9.00 – 10.30
యమగండం: మ1.30 – 3.00
సూర్యరాశి: వృషభం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.30
సూర్యాస్తమయం: 6.22

Leave a Reply

%d bloggers like this: