Home PANCHANGAM Daily Horoscope 20/05/2022 :

Daily Horoscope 20/05/2022 :

0
Daily Horoscope 20/05/2022 :
Daily Horoscope 27/06/2022

Daily Horoscope 20/05/2022

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

20, మే, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
వసంత ఋతువు
వైశాఖ మాసము
పంచమి రా 10.24
వారం: శుక్రవారం(భృగువాసరే)

శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll

Daily Horoscope 20/05/2022
Daily Horoscope 20/05/2022

రాశి ఫలాలు

మేషం

ఇంటా బయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దైవానుగ్రహం తో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

వృషభం

శారీరక మానసిక అనారోగ్యాలు ఉంటాయి. ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకొన్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బందికి గురవుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు కోపానికి గురికావల్సి వస్తుంది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి.

మిధునం

నూతన వస్తు,వాహన సౌకర్యం పొందుతారు సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

కర్కాటకం

ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

సింహం

ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వ్యాపారమున ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది. శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవరపెడతాయి. వృధా ఖర్చులు చేస్తారు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

కన్య

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

తుల

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.అన్ని వైపుల మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తిఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.

వృశ్చికం

ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.సౌకర్యాల కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి. కారణం లేకుండానే కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి.

ధనస్సు

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం.

మకరం

చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. బంధువుల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగ విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు.

కుంభం

బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి.

మీనం

ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు వ్యాపారపరంగా ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
మే 20, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
కృష్ణ పక్షం
తిథి: పంచమి రా 10.24
వారం: శుక్రవారం
(భృగువాసరే)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ7.50
& ఉత్తరాషాఢ
యోగం: శుభం సా4.07
&
శుక్లం
కరణం: కౌలువ ఉ11.36
&
తైతుల రా10.24
వర్జ్యం: మ3.18-4.47
దుర్ముహూర్తం : ఉ8.04-8.55
&
మ12.21-1.12
అమృతకాలం: రా12.16-1.46
రాహుకాలం: ఉ10.30-12.00
యమగండం: మ3.00-4.30
సూర్యరాశి: వృషభం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.31
సూర్యాస్తమయం: 6.21

Leave a Reply

%d bloggers like this: