Daily Horoscope 19/05/2022 :

0
Daily Horoscope 19/05/2022 :
Daily Horoscope 27/06/2022

Daily Horoscope 19/05/2022

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

19, మే, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
వసంత ఋతువు
వైశాఖ మాసము
కృష్ట చవితి
బృహస్పతి వాసరే (గురు వారం)

శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll

Daily Horoscope 19/05/2022
Daily Horoscope 19/05/2022

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
హనుమత్ ఆరాధన శుభప్రదం

 వృషభం

ఈరోజు
మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్పలితాన్ని ఇస్తాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అష్టమ చంద్రస్థితి అనుకూలంగా లేదు. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి.
దుర్గా ఆరాధన మేలు చేస్తుంది

 మిధునం

ఈరోజు
మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు.
రామ నామ జపం శ్రేయోదాయకం

 కర్కాటకం

ఈరోజు
బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పారాయణ మంచిది

సింహం

ఈరోజు
చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృథా కానీయకండి.
ఆదిత్య హృదయం చదువుకోవాలి

 కన్య

ఈరోజు
మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం

 తుల

ఈరోజు
అదృష్ట కాలం. బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కలహాలకు తావివ్వరాదు.
ఇష్టదైవారాధన మేలు చేస్తుంది

వృశ్చికం

ఈరోజు
దైవబలం కలదు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్యవహారంలో నైతికవిజయం సాధిస్తారు. ఆర్ధికంగా మేలైన ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.
ఇష్టదైవ ఆరాధన మరింత శుభాన్ని ఇస్తుంది

 ధనుస్సు

ఈరోజు
ప్రారంభించిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దుర్గాస్తుతి చదవాలి

మకరం

ఈరోజు
ప్రయత్న కార్యసిద్ధి కలదు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మాటపట్టింపులకు పోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
లక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం

 కుంభం

ఈరోజు
ఉత్సాహంగా పనిచేసి ప్రారంభించిన పనులను పూర్తిచేస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అనవసర ప్రయాణాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. కలహాలకు తావివ్వవద్దు.
సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది

 మీనం

ఈరోజు
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు.
శివారాధన చేయాలి

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
మే 19, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
కృష్ణ పక్షం
తిథి: చవితి రా 12.49
& పంచమి
వారం: గురువారం
(బృహస్పతివాసరే)
నక్షత్రం: మూల ఉ9.31
& పూర్వాషాఢ
యోగం: సాధ్యం రా7.10
&
శుభం
కరణం: బవ మ2.03
బాలువ రా12.49
వర్జ్యం: ఉ8.02-9.31
&
సా6.27-7.56
దుర్ముహూర్తం: ఉ9.47-10.39
&
మ2.55-3.47
అమృతకాలం: తె3.23-4.52
రాహుకాలం: మ1.30-3.00
యమగండం: ఉ6.00-7.30
సూర్యరాశి: వృషభం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.31
సూర్యాస్తమయం: 6.21

Leave a Reply

%d bloggers like this: