Home PANCHANGAM Daily Horoscope 18/05/2022 :

Daily Horoscope 18/05/2022 :

0
Daily Horoscope 18/05/2022 :
Daily Horoscope 27/06/2022

Daily Horoscope 18/05/2022

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

18, మే, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
వసంత ఋతువు
వైశాఖ మాసము
కృష్ట విదియ
సౌమ్య వాసరే (బుధ వారం)

శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll

Daily Horoscope 18/05/2022
Daily Horoscope 18/05/2022

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
బలమైన సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు.
విష్ణు నామస్మరణ శక్తిని ఇస్తుంది

 వృషభం

ఈరోజు
వృత్తి,వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్ని ఇస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది

 మిధునం

ఈరోజు
ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడికి లోనవకుండా,ఓర్పుగా వ్యవహరించండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు.
శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది

 కర్కాటకం

ఈరోజు
మంచి సమయం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అర్ధ, వస్త్ర లాభాలు ఉన్నాయి.
ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది

సింహం

ఈరోజు
మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు.
గణపతి దర్శనం శుభప్రదం

 కన్య

ఈరోజు
కొన్ని విషయాలలో మీరు అనుకున్నదాని కన్నా ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. నవమంలో చంద్రస్థితి అనుకూలించడంలేదు. స్వల్ప అనారోగ్యం.మనోవిచారం.
చంద్రధ్యాన శ్లోకం చదివితే మంచిది

 తుల

ఈరోజు
అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. పనులలో విజయం కోసం గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది

 వృశ్చికం

ఈరోజు
వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిరనిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి.
గోవింద నామాలు చదవడం మంచిది

 ధనుస్సు

ఈరోజు
శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గోసేవ చేస్తే బాగుంటుంది.
విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది

 మకరం

ఈరోజు
ప్రయత్నకార్యసిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు,వినోదాలతో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు.
ఇష్టదైవ నామస్మరణ శుభాన్ని ఇస్తుంది

 కుంభం

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. పొదుపు పాటించాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు.
శివనామాన్ని జపించాలి

 మీనం

ఈరోజు
ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధు,మిత్రులతో విబేదాలు రావచ్చు.
చంద్రశ్లోకం చదవాలి

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
మే 18, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
కృష్ణ పక్షం
తిథి: విదియ ఉ5.43
& తదియ తె3.16
వారం: బుధవారం
(సౌమ్యవాసరే)
నక్షత్రం: జ్యేష్ఠ ఉ11.11
& మూల
యోగం: సిద్ధం రా10.14
&
సాధ్యం
కరణం: గరజి ఉ5.43
&
వణిజ సా4.30
&
భద్ర తె3.16
వర్జ్యం: సా6.37-8.07
దుర్ముహూర్తం: ఉ11.30-12.21
అమృతకాలం: తె3.33-5.03
రాహుకాలం: మ12.00-1.30
యమగండం: ఉ7.30-9.00
సూర్యరాశి: వృషభం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 5.31
సూర్యాస్తమయం: 6.21

Leave a Reply

%d bloggers like this: