Home PANCHANGAM Daily Horoscope 14/05/2022 :

Daily Horoscope 14/05/2022 :

0
Daily Horoscope 14/05/2022 :
Daily Horoscope 27/06/2022

Daily Horoscope 14/05/2022

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

మే 14, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
వసంత ఋతువు
వైశాఖ మాసము
త్రయోదశి మ1.25
&
చతుర్థశి
వారం: శనివారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll

Daily Horoscope 14/05/2022
Daily Horoscope 14/05/2022

రాశి ఫలాలు

 మేషం

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.

వృషభం

ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.

మిధునం

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కర్కాటకం

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

సింహం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

కన్య

వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.

తుల

దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

వృశ్చికం

ఆలోచనలు ఆచరణలో పెడతారు.ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.

ధనస్సు

ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు. పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.

మకరం

ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు. వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

కుంభం

అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.

మీనం

ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నూతన వస్త్రఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
మే 14, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
శుక్ల పక్షం
తిథి: త్రయోదశి మ1.25
&
చతుర్థశి
వారం: శనివారం
(స్థిరవాసరే)
నక్షత్రం: చిత్ర మ3.58,
&
స్వాతి
యోగం: సిద్ధి ఉ11.40
&
వ్యతీపాతం
కరణం: తైతుల మ1.25
&
గరజి రా12.41
వర్జ్యం: రా9.23-10.56
దుర్ముహూర్తం : ఉ5.03-7.14
అమృతకాలం: ఉ9.41-11.15
రాహుకాలం: ఉ9.00-10.30
యమగండం: మ1.30-3.00
సూర్యరాశి: మేషం
చంద్రరాశి: తుల
సూర్యోదయం: 5.32
సూర్యాస్తమయం: 6.19

Leave a Reply

%d bloggers like this: