Daily Horoscope 13/05/202 :

0
44
Daily Horoscope 20/05/2022
Daily Horoscope 20/05/2022

Daily Horoscope 13/05/202

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

13, మే, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
వసంత ఋతువు
వైశాఖ మాసము
శుక్ల ద్వాదశి
భృగు వాసరే(శుక్ర వారం)

Daily Horoscope 13/05/2022
Daily Horoscope 13/05/202

శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. ప్రారంభించిన పనులలో విజయం దక్కుతుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి.
శివారాధన వల్ల మంచి చేకూరుతుంది

 

వృషభం

ఈరోజు
మంచి ఆలోచనలతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది

 మిధునం

ఈరోజు
శ్రమ ఫలిస్తుంది. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి సహాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది.
విష్ణు ఆరాధన శుభప్రదం

 కర్కాటకం

ఈరోజు
ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్నిశుభఫలితాలు కలుగుతాయి

సింహం

ఈరోజు
మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త.
చంద్ర ధ్యానం శుభప్రదం

 కన్య

ఈరోజు
మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు.
ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది

 తుల

ఈరోజు
మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు.
చంద్రశేఖరాష్టకం శుభప్రదం

 వృశ్చికం

ఈరోజు
మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారంలో అధికారులు దృష్టిని మీరు ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల ఫలిస్తాయి.
హనుమత్ దర్శనం శ్రేయస్సును ఇస్తుంది

 ధనుస్సు

ఈరోజు
సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. గొప్పవారిని కలుస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది.
ఆదిత్య హృదయం చదవాలి

 మకరం

ఈరోజు
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు.
సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి

కుంభం

ఈరోజు
అభివృద్ది కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి.
ఇష్టదైవారాధన శుభప్రదం

 మీనం

ఈరోజు
మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బంది పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి.
దుర్గాఅష్టోత్తరం చదవడం మంచిది

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
మే 13, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
శుక్ల పక్షం
తిథి: ద్వాదశి మ2.32
& త్రయోదశి
వారం: శుక్రవారం
(భృగువాసరే)
నక్షత్రం: హస్త సా4.23
& చిత్ర
యోగం: వజ్రం మ1.34 & సిద్ధి
కరణం: బాలువ మ2.32
&
కౌలువ రా1.59
వర్జ్యం: రా12.15-1.49
దుర్ముహూర్తం: ఉ8.05-8.56
&
మ12.21-1.12
అమృతకాలం: ఉ10.22-11.58
రాహుకాలం: ఉ10.30-12.00
యమగండం: మ3.00-4.30
సూర్యరాశి: మేషం
చంద్రరాశి: కన్య
సూర్యోదయం: 5.32
సూర్యాస్తమయం: 6.19

Leave a Reply