
Daily Horoscope 10/05/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
10, మే, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
వసంత ఋతువు
వైశాఖ మాసము
శుక్ల నవమి
భౌమ్య వాసరే(మంగళ వారం)
శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
విష్ణు నామస్మరణ ఉత్తమం
వృషభం
ఈరోజు
ఒక మంచివార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది.
దైవారాధన మానవద్దు
మిధునం
ఈరోజు
మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. దగ్గరివారితో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు.
దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది
కర్కాటకం
ఈరోజు
ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలం అవుతారు. ప్రారంభించిన పనులలో విజయదుందుభులు మోగిస్తారు.
శని శ్లోకాన్ని చదివితే అన్నివిధాలా మంచిది
సింహం
ఈరోజు
అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించినా, జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.
దుర్గాధ్యానం శుభప్రదం
కన్య
ఈరోజు
కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య ఈ వారంలో పరిష్కారం అవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది.
గణపతిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి
తుల
ఈరోజు
ప్రారంభించబోయే పనిలో దోషాలు పెరగకుండా చూసుకోవాలి. ఆచితూచి ఖర్చు చేయాలి. విచక్షణాజ్ఞానంతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. చక్కటి ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు.
శ్రీరామ రక్షా స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది
వృశ్చికం
ఈరోజు
అర్థలాభం ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. బుద్దిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు.ఆరోగ్యంపై శ్రద్ద అవసరం.
ఇష్టదైవారాధన శుభప్రదం
ధనుస్సు
ఈరోజు
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది.
శివ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది
మకరం
ఈరోజు
శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. ఉద్యోగంలో శుభఫలితాలు ఉన్నాయి. అధికారుల సహకారం ఉంది.
విష్ణు నామస్మరణ శక్తిని ఇస్తుంది
కుంభం
ఈరోజు
అభివృద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల మాట వినండి, మంచి జరుగుతుంది.
ఇష్టదైవ దర్శనం ఉత్తమం
మీనం
ఈరోజు
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారు ఉన్నారు జాగ్రత్త.
సద్గురువు దత్తుని జపించాలి.
Panchangam
ఓం శ్రీ గురుభ్యోనమః
మే 10, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
వైశాఖ మాసం
శుక్ల పక్షం
తిథి: నవమి మ2.59
&
దశమి
వారం: మంగళవారం
(భౌమ్యవాసరే)
నక్షత్రం: మఖ మ2.49
&
పుబ్బ
యోగం: ధృవం సా5.01
&
వ్యాఘాతం
కరణం: కౌలువ మ2.59
&
తైతుల తె3.10
వర్జ్యం: రా11.09 – 12.49
దుర్ముహూర్తం: ఉ8.06 – 8.57
&
రా10.47 – 11.32
అమృతకాలం: మ12.16 – 1.58
రాహుకాలం: మ3.00 – 4.30
యమగండం: ఉ9.00 – 10.30
సూర్యరాశి: మేషం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం: 5.34
సూర్యాస్తమయం: 6.17