Daily Horoscope 26/01/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
26, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
హేమంత ఋతువు
పుష్య మాసము
కృష్ణ సప్తమి
బుధవారం (సౌమ్యవాసరే)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
కాలం శుభప్రదంగా గడుస్తుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేస్తారు. మనః సౌఖ్యం ఉంటుంది.
ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచిది
వృషభం
ఈరోజు
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే నూతన కార్యక్రమాలను ప్రారంభించండి. కుటుంబానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు.
ఇష్టదేవతా ధ్యానం మంచి ఫలాలను ఇస్తుంది
మిధునం
ఈరోజు
కార్యసిద్ధి ఉంది. దైవబలంతో ఒక పనిని పూర్తిచేస్తారు. ప్రారంభించిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందూవినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం
కర్కాటకం
ఈరోజు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.
విష్ణు నామస్మరణ మంచి చేస్తుంది
సింహం
ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా సానుకూలిస్తుంది. నూతన వస్తువులను కొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. శ్రీవిష్ణు అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది
కన్య
ఈరోజు
ప్రారంభించిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
దుర్గాష్టకం చదివితే మంచిది
తుల
ఈరోజు
ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు.
ఈశ్వర దర్శనం శుభప్రదం
వృశ్చికం
ఈరోజు
సంకల్పసిద్ధి ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్తపడాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అభివృద్దిని ఇచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. ప్రశాంతమైన వాతావరణం కలదు.
ఆంజనేయ దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది
ధనుస్సు
ఈరోజు
తోటివారి సహకారం ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
సూర్య ఆరాధన శుభప్రదం
మకరం
ఈరోజు
శుభఫలాలు అందుతాయి. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.
శివారాధన శుభప్రదం
కుంభం
ఈరోజు
చిత్తశుద్దితో పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది.
శివ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది
మీనం
ఈరోజు
ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎట్టిపరిస్థితిలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి.
Panchangam
శ్రీ గురుభ్యోనమః
బుధవారం, జనవరి 26, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంతఋతువు
పుష్య మాసం – బహళ పక్షం
తిథి:నవమి రా1.08వరకు)
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:స్వాతి ఉ7.24వరకు
విశాఖ తె6.00వరకు
యోగం:గండం రా1.47 వరకు
కరణం:తైతుల రా2.07 & గరజిరా1.08
వర్జ్యం:మ12.40 – 2.10
దుర్ముహూర్తం:ఉ11.50 – 12.35
అమృతకాలం:రా9.42 – 11.13*
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి: తుల
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.48
check Daily Horoscope 27/08/2021 :