Daily Horoscope 20/01/2022

0
112

Daily Horoscope 20/01/2022

ఓం శ్రీ గురుభ్యోనమః 
శుభమస్తు 

20, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
హేమంత ఋతువు
పుష్య మాసము
కృష్ణ తదియ
బృహస్పతి వాసరే (గురువారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

శివ రామ గోవింద నారాయణ మహాదేవా
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. ఆటంకాలు ఎదురవకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.
ఈశ్వరధ్యానం శుభప్రదం

వృషభం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
నవగ్రహ ఆరాధన శుభప్రదం

మిధునం

ఈరోజు
కాలానుగుణంగా ముందుకు సాగండి. అనుకున్నది సిద్ధిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి.
దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి

కర్కాటకం

ఈరోజు
మిశ్రమ కాలం. అప్రమత్తముగా ఉండాల్సిన సమయం. కీలక విషయాల్లో శ్రద్ధను పెంచాలి. సందర్భానుసారంగా ముందుకు సాగండి. బంధుమిత్రుల సలహాలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి. మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి.
శివాలయ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది

సింహం

ఈరోజు
కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసివచ్చే కాలం. అంతా శుభమే జరుగుతుంది.
ఇష్టదైవారాధన శుభప్రదం

కన్య

ఈరోజు
కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి.
చంద్రశేఖరాష్టకం చదవాలి

తుల

ఈరోజు
ఒక శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. విందూవినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం.
ఇష్టదైవారాధన మంచిది

వృశ్చికం

ఈరోజు
‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. శత్రువుల విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలలో మీరు అనుకున్నదాని కన్నా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది.
సూర్య ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది

ధనుస్సు

ఈరోజు
ప్రారంభించిన పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాల పట్ల దృష్టి తగ్గించి, సమయాన్నిసద్వినియోగం చేసుకోవాలి.
ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది

మకరం

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. ఏకాగ్రతతో పనిచేయండి అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి

కుంభం

ఈరోజు
ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి.
శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది

మీనం

ఈరోజు
అనుకున్న పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు.విందూ వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.
ఇష్టదేవతా శ్లోకాన్ని చదవాలి

Panchangam 20-01-2022

ఓం శ్రీ గురుభ్యోనమః
జనవరి 20, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం
హేమంతఋతువు
పుష్య మాసం
కృష్ణ పక్షం
తిధి: విదియ ఉ7.07
వరకు తదుపరి తదియ
వారం: గురువారం
(బృహస్పతివాసరే)
నక్షత్రం: ఆశ్రేష ఉ7.55
తదుపరి మఖ
యోగం: ఆయుష్మాన్ మ3.33
తదుపరి సౌభాగ్యం
కరణం: గరజి ఉ7.07
&
వణిజ రా7.23వరకు
వర్జ్యం: రా8.27 – 10.07
దుర్ముహూర్తం: ఉ10.20 – 11.05
&
మ2.46 – 3.31
అమృతకాలం: ఉ7.55వరకు
&
తె6.28నుండి
రాహుకాలం: మ1.30 – 3.00
యమగండం: ఉ6.00 – 7.30
సూర్యరాశి: మకరం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం: 6.39
సూర్యాస్తమయం: 5.44

Daily Horoscope 20/01/2022

check other posts Daily Horoscope 18/12/2021 :

Leave a Reply