Daily Horoscope 19/01/2022

0
126

Daily Horoscope 19/01/2022

ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యోనమః 
శుభమస్తు 

19, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
హేమంత ఋతువు
పుష్య మాసము
కృష్ణ విదియ
సౌమ్య వాసరే (బుధవారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

శివ రామ గోవింద నారాయణ మహాదేవా
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి.
హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి

వృషభం

ఈరోజు
ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.
నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని చదివితే అన్నివిధాలా మంచిది

మిధునం

ఈరోజు
చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
ఆంజనేయ ఆరాధన శుభప్రదం

కర్కాటకం

ఈరోజు
ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. అలసట పెరుగుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఇష్టదేవతా నామస్మరణ ఉత్తమం

సింహం

ఈరోజు
మనోధైర్యంతో ప్రయత్నించి పనులను సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
చంద్రశేఖరాష్టకం చదివితే మంచిది

కన్య

ఈరోజు
మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు

తుల

ఈరోజు
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను విషయాలను సాగదీయకండి, త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి.
ఆదిత్య హృదయం చదవడం మంచిది

వృశ్చికం

ఈరోజు
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది

ధనుస్సు

ఈరోజు
వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం ఉత్తమం

మకరం

ఈరోజు
కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది

కుంభం

ఈరోజు
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు.
సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది

మీనం

ఈరోజు
శుభ కాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన చేయడం మంచిది

Panchangam 19-01-2022

ఓం శ్రీ గురుభ్యోనమః
జనవరి 19, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం
హేమంతఋతువు
పుష్య మాసం
కృష్ణ పక్షం
తిధి: విదియ పూర్తి
వారం: బుధవారం
(సౌమ్యవాసరే)
నక్షత్రం: ఆశ్రేష పూర్తి
యోగం: ప్రీతి సా4.04
కరణం: తైతుల సా6.33
వర్జ్యం: రా7.57 – 9.54
దుర్ముహూర్తం: మ12.01 – 12.45
అమృతకాలం: తె6.12 నుండి
(తెల్లవారితే గురువారం)
రాహుకాలం: మ12.00 – 1.30
యమగండం: ఉ7.30 – 9.00
సూర్యరాశి: మకరం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం: 6.38
సూర్యాస్తమయం: 5.42
లోకాః సమస్తాః
సుఖినోభవంతు
సర్వే జనాః సుఖినోభవంతు

Daily Horoscope 19/01/2022

check other posts Daily horoscope 21/04/2021

Leave a Reply