Daily Horoscope 17-01-2022

0
133

Daily Horoscope 17-01-2022

ఓం శ్రీ గురుభ్యోనమః 
శుభమస్తు 

17, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
హేమంత ఋతువు
పుష్య మాసము
శుక్ల పౌర్ణమి
ఇందు వాసరే (సోమ వారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

శివ రామ గోవింద నారాయణ మహాదేవా
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. అధికారుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం

వృషభం

ఈరోజు
శారీరక శ్రమ అధికమవుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో చంచల స్వభావాన్ని రానీయకూడదు. సమయం వృథా చేయకండి. దగ్గరివారిని దూరం చేసుకోకండి.
శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది

మిధునం

ఈరోజు
శుభకాలం. ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగితే అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం ఉంది.
గణపతి ఆరాధన శుభాన్నిస్తుంది

కర్కాటకం

ఈరోజు
వృత్తి ఉద్యోగాల్లో శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. భయాందోళనలు విడిచిపెట్టాలి.
ఆంజనేయ ఆరాధన శుభప్రదం

సింహం

ఈరోజు
విశేషమైన శుభఫలితాలున్నాయి. నైపుణ్యంతో గొప్ప పేరును సంపాదిస్తారు. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనలాభం ఉంది.
ఈశ్వర దర్శనం చేయడం మంచిది

కన్య

ఈరోజు
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్నీ కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. సౌభాగ్యసిద్ధి ఉంది.
లక్ష్మి సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది

తుల

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి ఉంది. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రుణసమస్యలు లేకుండా చూసుకోవాలి.
ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది

వృశ్చికం

ఈరోజు
చేపట్టే పనుల్లో రెండు ఆలోచనలతో వెళ్లకండి. గిట్టని వారికి దూరంగా ఉండాలి. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది.
ఇష్టదైవాన్ని పూజించాలి

ధనుస్సు

ఈరోజు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు.
శివ నామాన్ని జపించండి

మకరం

ఈరోజు
చేపట్టే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. దైవారాధన మానవద్దు

కుంభం

ఈరోజు
మిశ్రమకాలం. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దేహ జాడ్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది.
గణేశ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి

మీనం

ఈరోజు
శరీరసౌఖ్యం కలదు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది

Panchangam 17-01-2022

శ్రీ గురుభ్యోనమః
సోమవారం, జనవరి 17, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంతఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:పౌర్ణమి తె4.29 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:పునర్వసు తె4.20 వరకు
యోగం:వైధృతి సా4.06 వరకు
కరణం:విష్ఠి మ3.34 తదుపరి బవ తె4.29
వర్జ్యం:మ3.10 – 4.55
దుర్ముహూర్తం:మ12.32 – 1.16 & మ2.44 – 3.29
అమృతకాలం:రా1.41 – 3.26
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.42
ముక్కనుమ,బొమ్మల కొలువు
సావిత్రి గౌరీ వ్రతం
గురు మౌఢ్యమి ప్రారంభం
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

Daily Horoscope 17-01-2022

check other posts Daily horoscope – 31/05/2021

Leave a Reply