Home Current Affairs Saṅkrānti – The significance of the festival :

Saṅkrānti – The significance of the festival :

0
Saṅkrānti – The significance of the festival :
Saṅkrānti - The significance of the festival

Saṅkrānti – The significance of the festival  – సంక్రాంతి –  పండగ ప్రాముఖ్యత – తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి .

సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది కనుక దీనిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం.

సంక్రాంతి పండుగ తరుచుగా జనవరి 14 లేదా 15 వ తేదిల్లో వస్తుంది. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి సంక్రాంతి తరువాత వచ్చే పండుగ కనుమ ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు.

దీనిని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అని తమిళనాడులో పొంగల్ , పంజాబ్ లో లోహిరి రాజస్థాన్ , గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరయన్ అని పిలుస్తారు.

ఈ పండుగను కేవలం మన దేశంలోనే కాక మన పొరుగు దేశాలైనటువంటి భర్మ , నేపాల్ , థాయిలాండ్ దేశాల్లో కూడా జరుపుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నెల రోజుల ముందునుండే పండగ హడావిడి మొదలవుతుంది.

Saṅkrānti - The significance of the festival
Saṅkrānti – The significance of the festival

ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు , గొబ్బమ్మలతో స్వాగతం పలుకుతాయి. వేకువ జామున హరినామ సంకిర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మల్లిస్తాడు. గంగిరెద్దులు , కోడి పందాలు , ఎడ్ల పందాల మాట సరేసరి.

ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది. ఇంటిల్లిపాది మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్ళల్లో వాలిపోతారు. పిండివంటల తయారికి పండుగకు పది రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది.

అరిసెలు , పాకుండలు , సకినాలు , మిటాయిలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు. ఈ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికోస్తుంది.

దీనితో ఎ పడుగకైన ఖర్చుకు వెనుకాడుతరేమో కాని ఈ పండుగకు మాత్రం సందేహించారు. ఇంట్లో వున్నా ప్రతి ఒక్కరు కొత్త బట్టలు కొనుక్కుంటారు.

అలాగే సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తాం. అందుకే దీనిని గాలిపటాల పండుగ అని కూడా అంటారు.

సంక్రాంతి రోజున వేకువజామున నిద్రలేచి తలంటు స్థానం చేసి తెలుగింటి ఆడపడుచులు వాకిట్లో సింగారంతో ముగ్గులు పెడుతుంటే. పెద్దవారు ఇంటికి తోరణాలను అలంకరిస్తారు.

సేమ్య పాయసం , గారెలు , బూరెలు మొదలైన పిండి వంటలు ఆరగించి పనివారికి , రజకులకు ఇంకా ఇంటి పక్కవారికి తాము వండుకున్న పిండివంటల రుచి చూపిస్తారు. కొత్త అల్లుళ్ళకు ఈ పండుగ మరీ ప్రత్యేకం.

ఎక్కడున్నా సరే భార్యతో అత్తారింటికి వెళ్ళడం ఆనవాయితీ. పితృ దేవతలకు ఈ రోజున పితృ తర్పనాలు సమర్పిస్తారు. ఈ పండుగ ఒకెత్తు అయితే ముందు వెనక వచ్చే పండుగలు మరో ఎత్తు అవే భోగి , కనుమ. ముందుగా భోగి పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం.

సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. ఈ రోజున అందరూ కుడా వేకువజామున నిద్ర లేచి ఇంట్లో వున్నా పాత సామాను , ఆవు పేడతో చేసిన పిడకలు మొదలైన వాటితో మంటలు వేస్తారు. వీటినే భోగి మంటలు అంటారు.

ఆ తరువాత సాయంత్రం సమయంలో బొమ్మలను చక్కగా అలంకరించి బొమ్మల కొలవు ఏర్పాటు చేస్తాం. చంటి పిల్లలున్న వారు రేగి పండ్లు పోసి..ముత్తైదువులందరికి వాటిని పంచుతారు. వీటినే భోగి పండ్లు అంటాం.

ఇక కనుమ పండుగ సంక్రాంతి తరువాతి రోజు వస్తుంది. ఈ రోజు పశువులకు పూజ చేస్తారు. గంగిరెద్దు మేలంవారు గంగిరెద్దులను చక్కగా అలంకరించి ప్రతి ఇంటికి వెళ్లి అయ్యవారికి దండం పెట్టు.

అమ్మ వారికీ దందం పెట్టు అంటూ. సన్నాయి వాయిద్యం వాయిస్తూ గంగిరేద్దులచే లయబద్ధంగా నృత్యం చేపిస్తూ ఆ ఇంటివారు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు.

కనుమ పండుగ రోజు తరువాత వచ్చేది ముక్కనుమ మాంసాహారం , మినుప గారెలు వండుకుంటారు. ముక్యంగా ఈ ముచ్చటైన మూడురోజుల పండుగకు తెలుగు లోగిళ్ళు కలకలలాడుతాయి. ఇదండి సంక్రాంతి పండుగ విశిష్టత.

check Know about the Lohri Festival :

Leave a Reply

%d bloggers like this: