Daily Horoscope 15/01/2022 :

0
39
Daily Horoscope 15/01/2022
Daily Horoscope 15/01/2022

Daily Horoscope 15/01/2022 

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

15, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
హేమంత ఋతువు
పుష్య మాసము
శుక్ల త్రయోదశి
స్ధిర వాసరే (శని వారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 15/01/2022
Daily Horoscope 15/01/2022

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది

 వృషభం

ఈరోజు
కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
నవగ్రహ ఆరాధన శుభప్రదం

 మిధునం

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు.
ఆంజనేయ ఆరాధన చేయాలి

 కర్కాటకం

ఈరోజు
ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి.
గణపతి ఆరాధన శ్రేయోదాయకం

 సింహం

ఈరోజు
కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రారంభించిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం

 కన్య

ఈరోజు
అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్ల వల్ల లాభం చేకూరుతుంది. విందూవినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రవి ధ్యానం శుభప్రదం

 తుల

ఈరోజు
మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు

 వృశ్చికం

ఈరోజు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలలో మార్పులు రాకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనల వల్ల  జ్ఞానోదయం అవుతుంది. లింగాష్టకం చదవడం వల్ల మంచి జరుగుతుంది

 ధనుస్సు

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పని చేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. విందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.
ఇష్టదైవారాధన శుభప్రదం

 మకరం

ఈరోజు
ముఖ్యమైన వ్యవహారాల్లో మంచి ఫలితాలు చేకూరుతాయి. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. అధికారుల సహకారం ఉంటుంది. శని ధ్యానం శుభప్రదం

 కుంభం

ఈరోజు
మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీ రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త.
చంద్ర ధ్యానం శుభప్రదం

 మీనం

ఈరోజు
మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి.
శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శనివారం, జనవరి 15, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – హేమంతఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:త్రయోదశి రా12.34 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:మృగశిర రా11.29 వరకు
యోగం:బ్రహ్మం మ3.13 వరకు
కరణం:కౌలువ ఉ11.29 వరకు
తదుపరి తైతుల రా12.34
వర్జ్యం:లేదు
దుర్ముహూర్తం:ఉ6.38 – 8.06
అమృతకాలం: మ1.44 – 3.30
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.40

సంక్రాంతి పండుగ
శనిత్రయోదశి

check Daily Horoscope 30/12/2021

Leave a Reply