Daily Horoscope 13-01-2022

0
49
Daily Horoscope 13-01-2022
Daily Horoscope 13-01-2022

Daily Horoscope 13-01-2022

ఓం శ్రీ గురుభ్యోనమః 
శుభమస్తు 

13, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
పుష్య మాసము
శుక్ల దశమి
సౌమ్య వాసరే (బుధ వారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

శివ రామ గోవింద నారాయణ మహాదేవా
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్

రాశి ఫలాలు

మేషం

ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగమున మార్పులు ఉంటాయి.

వృషభం

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభ సూచలున్నవి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మిధునం

చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి.

కర్కాటకం

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం

చేపట్టిన పనులు చకచకా సాగుతాయి.కొన్ని విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య.

చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.గృహ నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.దైవచింతన పెరుగుతుంది.

తుల

చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది.బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు.

వృశ్చికం

మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక సమయంలో ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆస్తి వివాదాలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి.

ధనస్సు

సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషానిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖులతో సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

మకరం

చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. నూతన రుణయత్నాలు సాగిస్తారు దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. చిన్నపాటి అనారోగ్యాలు తప్పవు. కుటుంబ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కుంభం

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబసభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో మందకోడిగా సాగుతాయి.

మీనం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరస్తి వివాదాలలో బయటపడటానికి ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి , ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

Panchangam 13-01-2022

ఓం శ్రీ గురుభ్యోనమః
జనవరి 13, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంతఋతువు
పుష్య మాసం
శుక్ల పక్షం
తిధి: ఏకాదశి రా8.21
వారం: గురువారం
(బృహస్పతివాసరే)
నక్షత్రం: కృత్తిక సా6.24
యోగం: శుభం మ2.19
కరణం: వణిజ ఉ7.27
తదుపరి భద్ర రా8.21
వర్జ్యం: ఉ.శే.వ 7.02 వరకు
దుర్ముహూర్తం: ఉ10.18 – 11.02
&
మ2.42 – 3.26
అమృతకాలం: మ3.47 – 5.31
రాహుకాలం: మ1.30 – 3.00
యమగండం: ఉ6.00 – 7.30
సూర్యరాశి: ధనుస్సు
చంద్రరాశి: మేషం
సూర్యోదయం: 6.38
సూర్యాస్తమయం: 5.39

వైకుంఠ ఏకాదశి
ముక్కోటి ఏకాదశి
శుక్రమౌఢ్య త్యాగము

లోకాః సమస్తాః
సుఖినోభవంతు
సర్వే జనాః సుఖినోభవంతు

Daily Horoscope 13-01-2022

check other posts Daily Horoscope 01/12/2021 :

Leave a Reply