Daily Horoscope 12-02-2022

0
165
Daily Horoscope 6/02/2022
Daily Horoscope 6/02/2022

Daily Horoscope 12-02-2022

ఓం శ్రీ గురుభ్యోనమః 
శుభమస్తు 

12, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
పుష్య మాసము
శుక్ల దశమి
సౌమ్య వాసరే (బుధ వారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

శివ రామ గోవింద నారాయణ మహాదేవా
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. నిర్ణీత సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం

వృషభం

ఈరోజు
ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి.
ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం

మిధునం

ఈరోజు
ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు.
శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది

కర్కాటకం

ఈరోజు
ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది

సింహం

ఈరోజు
శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్దిస్తాయి. ముఖ్య పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మానసిక సంతృప్తిని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి.
లక్ష్మీ దేవి దర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి

కన్య

ఈరోజు
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది

తుల

ఈరోజు
శరీర సౌఖ్యం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఇష్టదేవత శ్లోకాలు చదివితే మంచిది

వృశ్చికం

ఈరోజు
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.
గణపతి స్తోత్రం చదవండి.మంచి జరుగుతుంది

ధనుస్సు

ఈరోజు
కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది

మకరం

ఈరోజు
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను,విషయాలను సాగదీయకండి. త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
ఆదిత్య హృదయం చదవడం మంచిది

కుంభం

ఈరోజు
అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసేవారి ప్రయత్నాలు వృథా ప్రయాసలే అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు.
ఈశ్వర శ్లోకాలు చదవాలి

మీనం

ఈరోజు
ప్రారంభించిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త.
ఇష్టదేవతా శ్లోకాలు చదివితే మంచిది  Daily Horoscope 12-02-2022

Daily Horoscope 12-01-2022
Daily Horoscope 12-01-2022

Panchangam 12-02-2022

శ్రీ గురుభ్యోనమః
బుధవారం, జనవరి 12, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:దశమి సా6.34 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:భరణి సా4.11 వరకు
యోగం:సాధ్యం మ2.10 వరకు
కరణం:గరజి సా6.34 వరకు
వర్జ్యం:తె5.17నుండి(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం:ఉ11.46 – 12.30
అమృతకాలం:ఉ10.59 – 12.43
రాహుకాలo:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.39

Check other posts Daily Horoscope 11-01-2022

Leave a Reply