
Daily Horoscope 11-01-2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
11, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
పుష్య మాసము
శుక్ల నవమి
భౌమ్య వాసరే (మంగళవారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹
శివ రామ గోవింద నారాయణ మహాదేవా
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్
రాశి ఫలాలు
మేషం
ఈరోజు
వృత్తి,ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార లావాదేవీల్లో లాభం చేకూరుతుంది. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. గిట్టని వారి జోలికి పోకుండా ఉండటం మంచిది.
ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి
వృషభం
ఈరోజు
ప్రారంభించబోయే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఎవరితోనూ మాట పట్టింపులకు పోవద్దు. క్రమంగా ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉత్సాహంతో ముందుకు సాగండి సత్ఫలితాలను సొంతం చేసుకుంటారు.
ఇష్టదైవారాధన మంచిది
మిధునం
ఈరోజు
బంధువుల సహకారంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేస్తారు. విందూవినోదాల్లో పాల్గొంటారు. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఆంజనేయ ఆరాధన శుభప్రదం
కర్కాటకం
ఈరోజు శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం అందుతుంది. బంధుమిత్రులతో అతి చనువు వద్దు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివ నామాన్ని జపిస్తే మంచిది
సింహం
ఈరోజు
మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
సూర్యాష్టకాన్ని చదివితే మంచిది
కన్య
ఈరోజు
భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి చక్కటి ఫలితాలు సొంతం అవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి.
సూర్య ఆరాధన శుభప్రదం
తుల
ఈరోజు
అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి,ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.
సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి
వృశ్చికం
ఈరోజు
లక్ష్యసాధనలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. మిమ్మల్ని విరోధించే వారితో జాగ్రత్త. అనవసర విషయాలతో కాలహరణం అవుతుంది.
శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం
ధనుస్సు
ఈరోజు
ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.
ప్రశాంతతకు దుర్గాధ్యానం, విష్ణు సహస్రనామ పారాయణ చదవాలి
మకరం
ఈరోజు
మీ మీ రంగాల్లో ఆచి తూచి ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్దిస్తాయి. ప్రారంభించబోయే పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మేలు చేకూరుతుంది. అధికారులతో వాగ్వాదాలకు దిగవద్దు.
దైవారాధన మానవద్దు
కుంభం
ఈరోజు
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తోంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం
మీనం
ఈరోజు
కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
Daily Horoscope 11-01-2022
Panchangam 11-01-2022
ఓం శ్రీ గురుభ్యోనమః
జనవరి 11, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంతఋతువు
పుష్య మాసం
శుక్ల పక్షం
తిధి: నవమి సా5.09
వారం: మంగళవారం
(భౌమ్యవాసరే)
నక్షత్రం: అశ్విని మ2.19
యోగం: సిద్ధం మ2.18
కరణం: కౌలువ సా5.09
తదుపరి తైతుల తె5.51
వర్జ్యం: ఉ10.01 – 11.42
&
రా12.37 – 2.20
దుర్ముహూర్తం: ఉ8.50 – 9.34
&
రా10.50 – 11.42
అమృతకాలం: ఉ6.38 – 8.19
రాహుకాలం: మ3.00 – 4.30
యమగండం: ఉ9.00 – 10.30
సూర్యరాశి: ధనుస్సు
చంద్రరాశి: మేషం
సూర్యోదయం: 6.38
సూర్యాస్తమయం: 5.39
Check other posts Daily Horoscope 06/01/2022