Daily Horoscope 07-01-2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
07, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
పుష్య మాసము
శుక్ల పంచమి
భృగు వాసరే (శుక్రవారం)
శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు
మేషం
ఈరోజు
అనుకున్న పనిని పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం
వృషభం
ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచీచెడుల గురించి ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారంలో ముందుచూపు అవసరం.
విష్ణు దర్శనం శుభకరం
మిధునం
ఈరోజు
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తే మేలు జరుగుతుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. చేయని తప్పునకు నిందపడాల్సి వస్తుంది. ఓర్పును వదలకండి.
లలితాదేవి ఆరాధన శుభదాయకం
కర్కాటకం
ఈరోజు
మిశ్రమ వాతావరణం కలదు. ఉత్సాహంగా పని చేస్తే తప్ప పనులు పూర్తికావు. సమయానికి నిద్రాహారాలు అవసరం. పెద్దల సహకారం ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి.
శని ధ్యానం శుభప్రదం
సింహం
ఈరోజు
శుభకాలం. సుఖసౌఖ్యాలు ఉన్నాయి. ప్రయత్న కార్యానుకూలత ఉంది. అభివృద్ధి కోసం చేసే పనులు సఫలీకృతం అవుతాయి. ఆర్థిక అంశాల్లో తోటివారి సలహాలు మేలు చేస్తాయి.
శివారాధన వల్ల బాగుంటుంది
కన్య
ఈరోజు
ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. మనోబలం పుష్కలంగా ఉంటుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. అవసరానికి తగినట్టుగా ముందుకు సాగడం మేలు.
శివారాధన శుభాన్ని చేకూరుస్తుంది
తుల
ఈరోజు
శ్రమ అధికం అవుతుంది. బలమైన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. తోటివారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును వదలకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.
శ్రీరామ నామాన్ని జపించాలి
వృశ్చికం
ఈరోజు
పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. బలమైన ప్రయత్నం ఫలిస్తుంది. బంధుమిత్రులను కలిసి కీలక విషయాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
దుర్గారాధన శ్రేయస్సును ఇస్తుంది
ధనుస్సు
ఈరోజు
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి.
శివారాధన శుభప్రదం
మకరం
ఈరోజు
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కలహ సూచన ఉంది. ఆదిత్య హృదయం చదవాలి
కుంభం
ఈరోజు
శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు.
దైవారాధన మానవద్దు
మీనం
ఈరోజు
ప్రయత్నలోపం లేకుండా చూసుకోవాలి. మానసికంగా చంచల స్వభావాన్ని వీడండి. అనవసర ఖర్చులు ఉంటాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి.
Panchangam
శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, జనవరి 7, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:పంచమి సా4.19 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:శతభిషం ఉ11.30 వరకు
యోగం:వ్యతీపాతం సా6.31 వరకు
కరణం:బాలువ సా4.19 తదుపరి కౌలువ తె4.02
వర్జ్యం:సా5.53 – 7.29
దుర్ముహూర్తం:ఉ8.48 – 9.32 &
మ12.28 – 1.12
అమృతకాలం:తె3.28 – 5.04
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:6.36 సూర్యాస్తమయం:5.36
check Daily horoscope 28/12/2021