Daily Horoscope 06/01/2022

0
54
Daily Horoscope 25/01/2022
Daily Horoscope 25/01/2022

Daily Horoscope 06/01/2022

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

06, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
పుష్య మాసము
శుక్ల చవితి
బృహస్పతి వాసరే (గురువారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 06/01/2022
Daily Horoscope 06/01/2022

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త.
ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది

 వృషభం

ఈరోజు
సుఖప్రదమైన కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
శివుణ్ణి ఆరాధిస్తే మంచిది

 మిధునం

ఈరోజు
బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభఫలితాలు పొందుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.
దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి

 కర్కాటకం

ఈరోజు
ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు.
శని ధ్యానం శుభప్రదం

సింహం

ఈరోజు
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి.
సుబ్రహ్మణ్య అష్టకం చదవండి

 కన్య

ఈరోజు
మంచి ఫలితాలు ఉన్నాయి. బంధువుల సహకారం అందుతుంది. ఎవ్వరితోనూ గొడవలు పెరగకుండా చూసుకోవాలి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోకండి.
ఇష్టదేవతారాధన శుభప్రదం

 తుల

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.
ఇష్టదైవారాధన శుభప్రదం

 వృశ్చికం

ఈరోజు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలతో మార్పులు కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగచేస్తాయి.
లింగాష్టకం చదవండి. మంచి జరుగుతుంది

 ధనుస్సు

ఈరోజు
ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం

 మకరం

ఈరోజు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.
గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది

 కుంభం

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు.
ఆంజనేయ ఆరాధన చేయాలి

 మీనం

ఈరోజు
పట్టుదలతో కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

Panchangam

శ్రీ గురుభ్యోనమః🙏
గురువారం, జనవరి 6, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:చవితి సా5.19 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:ధనిష్ఠ ఉ11.59 వరకు
యోగం:సిద్ధి రా8.32 వరకు
కరణం:భద్ర సా5.19 తదుపరి బవ తె4.49
వర్జ్యం:రా7.02 – 8.36
దుర్ముహూర్తం:ఉ10.16 – 11.00 &
మ2.40 – 3.24
అమృతకాలం:తె4.26 – 6.01
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:6.36
సూర్యాస్తమయం:5.36

check Daily Horoscope 04-01-2022

Leave a Reply