Home PANCHANGAM Daily Horoscope 04-01-2022

Daily Horoscope 04-01-2022

0
Daily Horoscope 04-01-2022
Daily Horoscope 6/02/2022

Daily Horoscope 04-01-2022

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

04, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
పుష్య మాసము
శుక్ల విదియ
భౌమ్య వాసరే (మంగళవారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి.
ఆంజనేయుని ఆరాధించాలి

 వృషభం

ఈరోజు
మిశ్రమ వాతావరణం ఉంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళనకు గురవుతారు.
దైవారాధన మానవద్దు

 మిధునం

ఈరోజు
ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి.
శివారాధన శుభప్రదం

కర్కాటకం

ఈరోజు
ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.
ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచిది

 సింహం

ఈరోజు
ప్రారంభించిన పనులను విజయవంతంగా  పూర్తి చేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. శారీరక శ్రమ అధికం అవుతుంది. వాదులాటకు దూరంగా ఉండటమే మంచిది.
శని శ్లోకాన్ని చదవండి

 కన్య

ఈరోజు
చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి.
గణపతి ఆరాధన శుభప్రదం

 తుల

ఈరోజు
అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. కోపతాపాలకు పోకండి. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది.
శివాష్టోత్తరం చదవాలి

 వృశ్చికం

ఈరోజు
శుభకాలం. మీ మీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
విష్ణు ఆరాధన మంచిది

 ధనుస్సు

ఈరోజు
ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి.
శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది

 మకరం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్దికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తి చేస్తారు.
విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం

 కుంభం

ఈరోజు
కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు.
హనుమాన్ చాలీసా చదవాలి

 మీనం

ఈరోజు
కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయకండి.
శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం

Panchangam

పంచాంగం
తేది : 4, జనవరి 2022
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ
(నిన్న రాత్రి 8 గం॥ 36 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 24 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాషాఢ
(నిన్న మద్యాహ్నం 3 గం॥ 25 ని॥ నుంచి
ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 2 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 21 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 36 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 36 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 35 ని॥ లకు
శుక్ర మూఢమి ప్రారంభం

check Daily Horoscope 07/11/2021 :

Leave a Reply

%d bloggers like this: